ఎస్‌జీఎఫ్ కబడ్డీ జట్ల ఎంపిక
కడప స్పోర్ట్స్:
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో అండర్–14, అండర్–17 బాలబాలికల విభాగాల్లో జిల్లాస్థాయి కబడ్డీ ఎంపికలు నిర్వహించారు. కడప నగరంలోని గాంధీనగర్ నగరపాలకోన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ ఎంపికలకు డీఈఓ బి. ప్రతాప్‌రెడ్డి విచ్చేసి క్రీడాకారులను పరిచయం చేసుకుని ఎంపికలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో చక్కటి ఆటతీరును కనబరిచి విజేతలుగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఆర్‌ఐపీఈ భానుమూర్తిరాజు, ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎల్.ఎ. సునీల్ మాట్లాడుతూ జిల్లా జట్టుకు ఎంపికైన అండర్–14 క్రీడాకారులు కర్నూలులో, అండర్–17 విభాగం క్రీడాకారులు విజయనగరంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సత్యసుజాతమ్మ, సుబ్బానాయుడు, వ్యాయామ ఉపాధ్యాయులు శివశంకర్‌రెడ్డి, వి. కేశవ, సంపత్‌కుమార్, నాగార్జున, రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు.
అండర్–14 బాలుర జట్టు : పి. సతీష్‌కుమార్, పి.నాగరాజు, టి.మురళీకృష్ణ, ఎం.రంజింత్‌కుమార్, ఎం.వేణు, వి.నరేన్‌యాదవ్, డి.సుదర్శన్‌రెడ్డి, మధుకల్యాణ్, మహమ్మద్‌సలీం, మురళీమోహన్, చంద్రశేఖర్, రామాంజినేయులు. స్టాండ్‌బై : ఎస్.కె. సలీం, ఎం. శివకృష్ణ, కె.హరినాథ్, వి.వంశీ, ఎస్.మాబూహుస్సేన్.
అండర్–14 బాలికల జట్టు : ఎం. సుకుమారి, జె.నాగసుధామణి, ఎం.శిల్ప, కె.సుస్మిత, ఎస్.మహబూబ్‌చాన్, సి. స్పందన, కె.సౌజన్య, ఎస్.నాగజ్యోతి, ఎస్.పల్లవి, ఎం. వెంకటనందిని, ఐ. కీర్తి, ఎ.పుష్పలత. స్టాండ్‌బై : ఎం. ప్రగతి, కె.శ్రీదేవి, ఎస్.దీప్తి, డి.మీనాక్షి, ఎల్.అపర్ణ.
అండర్–17 బాలుర జట్టు : ఆర్. వెంకటేష్‌నాయక్, డి. శ్రీనివాసులు, కె.ప్రసన్న, కె.సురేంద్ర, ఎం.కిరణ్‌కుమార్, జి.సుధీర్‌కుమార్‌రెడ్డి, టి.చరణ్‌కుమార్, ఆర్.గోవర్ధన్‌రెడ్డి, ఎం.నందకుమార్, కె.దేవారెడ్డి, డి.విష్ణువర్ధన్, డి.కల్యాణ్‌యాదవ్. స్టాండ్‌బై : వై. రాధాకృష్ణారెడ్డి, ఎస్.శివప్రసాద్, జె.నవీన్‌కుమార్, పి. వినోద్‌కుమార్, పి.మహబూబ్‌బాషా.
అండర్–17 బాలికల జట్టు : ఎస్.పూజ, వి.లక్ష్మిదేవి, పి.లక్ష్మిప్రసన్న, జి.అప్సర, కె.వెంకటపద్మజ, పి.చంద్రిక, వి.లక్ష్మిప్రసన్న, ఎం.ధనలక్ష్మి, డి.చిట్టెమ్మ, పి.మైనా, పి.సుభాషిణి, ఎ.సైదా. స్టాండ్‌బై : సి.హరిత, ఇ.అశ్విని, ఎన్.అజయ్‌కుమారి, డి. దీపిక.