కేశవ్ మెమోరియల్ స్కూల్ గెలుపు | keshav memorial school wins kabaddi title | Sakshi
Sakshi News home page

కేశవ్ మెమోరియల్ స్కూల్ గెలుపు

Published Tue, Aug 23 2016 11:11 AM | Last Updated on Sat, Sep 15 2018 5:21 PM

keshav memorial school wins kabaddi title

సాక్షి, హైదరాబాద్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతోన్న హిమాయత్‌నగర్ జోనల్ కబడ్డీ, వాలీబాల్ టోర్నమెంట్‌లో కేశవ్ మెమోరియల్ స్కూల్ విజయం సాధించింది. సోమవారం జరిగిన కబడ్డీ టోర్నమెంట్ అండర్-17 బాలుర విభాగంలో కేశవ్ మెమోరియల్ స్కూల్ 27-1తో ప్రభుత్వ బాలుర హైస్కూల్ (అంబర్‌పేట)ను చిత్తుగా ఓడించింది. బాలికల విభాగంలో ప్రభుత్వ బాలికల హైస్కూల్ 25-8తో బీఆర్‌ఆర్ హైస్కూల్‌పై విజయం సాధించింది. ఇతర  మ్యాచ్‌ల్లో నృపతుంగ హైస్కూల్ 19-6తో జీపీఎస్‌పై, హారో హైస్కూల్ 19-7తో నవ్య గ్రామర్ స్కూల్‌పై, సెయింట్ పీటర్స్ హైస్కూల్ 10-7తో జీజీహెచ్‌ఎస్ (అంబర్‌పేట)పై గెలుపొందాయి.


 ఇతర మ్యాచ్‌ల వివరాలు


 అండర్ -17 బాలురు: జీబీహెచ్ (కాచిగూడ) 19-8తో రిషి విద్యాలయపై, హెచ్‌పీఎస్ (రామంతపూర్) 11-7తో కేశవ్ మెమోరియల్ స్కూల్(ఇంగ్లీష్ మీడియం)పై, పీపుల్స్ హైస్కూల్ 15-3తో శ్రీ సత్యసాయి స్కూల్(విద్యానగర్)పై, గాంధీ హైస్కూల్ 10-3తో సెయింట్ అగస్టీన్ హూస్కూల్‌పై, భరత్ స్కౌట్స్, గైడ్స్ హైస్కూల్ 9-6తో సెయింట్ ఫిలిప్స్ స్కూల్‌పై విజయం సాధించాయి.
 అండర్-14 బాలురు: జీబీహెచ్ ఎస్ (కాచిగూడ) 10-3తో భాష్యం హైస్కూల్‌పై, భరత్ హైస్కూల్ 21-6తో సెయింట్ పీటర్స్ ైెహ స్కూల్‌పై, శ్రీ సత్యసాయి విద్యా విహార్ 10-6తో కోర్ మోడల్ హైస్కూల్‌పై, హుడా హైస్కూల్ 14-12తో సెయింట్ అగస్టీన్ హైస్కూల్‌పై, హారో హైస్కూల్ 5-3తో ప్రభుత్వ పోలీస్ బాలుర స్కూల్‌పై, నవ్య గ్రామర్ హైస్కూల్ 18-4తో సీపీఎల్ (అంబర్‌పేట)పై విజయం సాధించాయి.


 అండర్-14 బాలికలు: అజంపురా హైస్కూల్ 15-5తో సీపీఎల్ అంబర్‌పేటపై, జీబీహెచ్‌ఎస్, కాచిగూడ 18-0తో సెయింట్ అగస్టీన్‌పై, భాష్యం హైస్కూల్ 15-5తో ఆర్పీహెచ్‌ఎస్‌పై నెగ్గాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement