
జగిత్యాలటౌన్: జిల్లాలోని కొడిమ్యాల ప్రభుత్వ పాఠశాలలో జరిగిన మాస్ కాపీయింగ్ వెనక డీఈవో హస్తం ఉందని.. అనవసరంగా ఉపాధ్యాయులను బలి చేశారని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గోదా సత్యనారాయణ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ఏబీవీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నిబంధనలు పాటించని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా డీఈవో పట్టించుకోలేదన్నారు.
విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. పాఠశాలల అవకతవలపై రాష్ట్ర అధికారికి ఫిర్యాదు చేస్తామన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్య సమితి సభ్యులు రెంటం జగదీశ్, జిల్లా కన్వీనర్ చింత అనిల్, మహిళా జిల్లా ఇన్‌చార్జి రాధ, జ్యోతి, నిఖిల్, శ్రీను, కార్యకర్తలు పాల్గొన్నారు.