ఉపాధ్యాయులు సమయాన్ని పాటించాలి | teachers must follow timings | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయులు సమయాన్ని పాటించాలి

Published Fri, Jul 22 2016 5:24 PM | Last Updated on Mon, Sep 4 2017 5:51 AM

ఉపాధ్యాయులు సమయాన్ని పాటించాలి

ఉపాధ్యాయులు సమయాన్ని పాటించాలి

 
  • జిల్లా విద్యాశాఖాధికారిణి విజయలక్ష్మి
రాపూరు: ఉపాధ్యాయులు సమయాన్ని పాటించాలని జిల్లా విద్యాశాఖాధికారిణి విజయలక్ష్మి సూచించారు. రాపూరులోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమయాన్ని పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉపాధ్యాయులు సమయాన్ని పాటిస్తే విద్యార్థులు గంట కొట్టకముందే వస్తారన్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్లకు నీటి వసతి లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని విలేకరులు ఆమె దృష్టికి తీసుకురాగా, నీటి సదుపాయాన్ని కల్పించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. ఎస్‌ఎంసీ ఎన్నికలు పూర్తయితే కమిటీ చైర్మన్‌ బాధ్యత వహిస్తారన్నారు. కంప్యూటర్లు నిరుపయోగంగా ఉన్నాయని ఆమె దృష్టికి తీసుకురాగా కంప్యూటర్‌ విద్యను అందిస్తామన్నారు. రాపూరు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో బాలికలు మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయని, కనీసం తలుపులు కూడా సక్రమంగా లేవని, మరమ్మత్తులు చేయించాలని డీఈఓను కోరారు. స్పందించిన ఆమె  తలుపులకు వెంటే మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు. తొలుత పాఠశాల ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటినారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖాధికారి శ్రీనివాసులురెడ్డి, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులు పాల్గొన్నారు.
 
   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement