14మంది ఎంఈఓలకు షోకాజ్ నోటీసులు
Published Fri, Aug 5 2016 12:10 AM | Last Updated on Sat, Sep 15 2018 2:28 PM
విద్యారణ్యపురి : జిల్లాలో డీఈఓ కార్యాలయంలోని సమావేశానికి గైర్హాజరైన 14మంది ఎం ఈవోలకు డీఈఓ పి.రాజీవ్ గురువారం షోకాజ్ నోటీసులు జారీచేశారు. టీచర్ల వర్క్‌అడ్జస్ట్‌మెంట్ విషయంపై చర్చించేందుకు సమావేశానికి రావాలని వారికి సమాచారం ఇచ్చారు. కాగా 51మంది ఎంఈఓలు ఉండగా 14మంది గైర్హాజరయ్యారు. డీఈఓ కార్యాలయంలో సా యంత్రం 4గంటలకు సమావేశం అనంతరం జిల్లా కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలోని స మావేశానికి సైతం కేవలం 20మంది ఎంఈవో లు మాత్రమే హాజరయ్యారు. ఆగ్రహంచిన కలెక్టర్ వాకాటి కరుణ డీఈఓ రాజీవ్‌ను ప్రశ్నించి గైర్హాజరైన వారిని సస్పెండ్‌చేయాలని డీఈ వోను ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో డీఈఓ ముందుగా వివేకానంద (మహబూబాబాద్), వి.ప్రభాకర్(మొగుళ్లపల్లి), రత్నమాల (నెక్కొండ), ఎన్.రంగయ్య(రాయపర్తి), ఎం. బుచ్చయ్య (తొర్రూరు), ఐలయ్య (వెంకటాపూర్), కె.సదానందం(వరంగల్), బి.సోమయ్య (వర్ధన్నపేట), సారయ్య (నర్సంపేట), డి. జనార్ధన్(బచ్చన్నపేట), జి.లక్ష్మీనారాయణ(కొత్తగూడ), సీహెచ్. బిక్షపతి (గూడూరు), కె.ప్రకాశం(దుగ్గొండి), కె.మధులత(డోర్నకల్)కు మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నోటీసుల సమాచారం తెలుసుకున్న కొంత మంది ఎంఈఓలు డీఈఓ కార్యాలయంలో వివరణ ఇచ్చారు.
Advertisement