
సాక్షి, విశాఖపట్నం : భారీ వర్షసూచన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలోని ప్రభుత్వం, ప్రైవేటు పాఠశాలలు గురువారం సెలవు ప్రకటిస్తున్నట్టు జిల్లా విద్యాధికారి ఒక ప్రకటన విడుదల చేశారు. రేపు (అక్టోబర్ 24) విద్యాలయాలకు సెలవు ప్రకటించిన విషయాన్ని తల్లిదండ్రుల కమిటీలు, విద్యార్థులు, మధ్యాహ్న భోజన నిర్వాహకులకు పాఠశాలలు చేరవేసి ఒక్క విద్యార్థి పాఠశాలకు హాజరు కాకుండా చూడాలని చెప్పారు. జిల్లా విద్యాశాఖ ఉత్తర్వులను పట్టించుకోకుండా పాఠాశాలలు తెరిస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే సంబంధిత స్కూలు యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment