జిల్లాలోని గంగదేవిపల్లి జెడ్పీఎస్‌ఎస్, గొర్రెకుంట జెడ్పీఎస్‌ఎస్‌లను సోమవారం జిల్లా విద్యాశాఖాధికారి పి.రాజీవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గంగదేవిపల్లిలో ప్రార్ధన సమయానికి వెళ్లి ప్రార్థనలో కూడా ఆయన పాల్గొన్నారు. ఆ పాఠశాలలో నలుగురు టీచర్లు శనివారం లీవ్ పెట్టినట్లు లేఖలు ఉండగా సోమవారం కూడా విధులకు గైర్హాజరయ్యారు.
- విద్యారణ్యపురి : జిల్లాలోని గంగదేవిపల్లి జెడ్పీఎస్‌ఎస్, గొర్రెకుంట జెడ్పీఎస్‌ఎస్‌లను సోమవారం జిల్లా విద్యాశాఖాధికారి పి.రాజీవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గంగదేవిపల్లిలో ప్రార్ధన సమయానికి వెళ్లి ప్రార్థనలో కూడా ఆయన పాల్గొన్నారు. ఆ పాఠశాలలో నలుగురు టీచర్లు శనివారం లీవ్ పెట్టినట్లు లేఖలు ఉండగా సోమవారం కూడా విధులకు గైర్హాజరయ్యారు. ఫోన్ ద్వారా సోమవారం కూడా లీవ్‌ను కొనసాగించుకుంటున్నట్లు నలుగురు టీచర్లు తెలిపారని హెచ్‌ఎం జ్యోతిర్మయి డీఈఓకు వివరించారు. ఈ పాఠశాలలో 8 మంది స్కూల్ అసిస్టెంట్లు ఉండగా అందులో నలుగురికి లీవ్‌లు ఒకేసారి ఇవ్వటం సరికాదని విద్యార్థులకు విద్యాబోధన ఎలా అందుతుందని డీఈవో హెచ్‌ఎంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. శనివారం లీవ్‌లెటర్ పెడితే సోమవారం నలుగురికి లీవ్‌ను ఎలా కొనసాగిస్తారని జ్యోతిర్మయిని ప్రశ్నించారు. అనంతరం పలు సూచనలు చేసిన డీఈవో సోమవారం సాయంత్రం గంగదేవిపల్లి హెచ్‌ఎం జ్యోతిర్మయి, నలుగురు స్కూల్ అసిస్టెంట్‌లు శ్యామ్‌కుమార్, ఎం.రమాదేవి, వి.మమత, కె.అండాలుకు మోమోలు జారీ చేశారు. రెండు మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఇక గొర్రెకుంట జెడ్పీఎస్‌ఎస్‌లో తనిఖీ చేయగా నిహారిక ఈనెల 2న లీవ్ పెట్టినట్లు ఉన్నప్పటికీ ఆ తర్వాత ఇక సోమవారం వరకు కూడా విధులకు గైర్జాజరైందని డీఈవో గుర్తించారు. నిహారిక తన లీవ్‌ను ఫోన్ ద్వారా హెచ్‌ఎంకు తెలిపి కొనసాగించుకుంటున్నారని హెచ్‌ఎం ద్వారా తెలుసుకున్న డీఈవో ఆమెకు మోమో జారీ చేశారు. రెండు పాఠశాలు కలిపి మొత్తంగా ఆరుగురికి మోమోలు జారీ చేశారు.