డీఎడ్ విద్యార్థులు 15లోగా ఫీజులు చెల్లించాలి
Published Sat, Sep 3 2016 12:52 AM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM
డీఈవో మధుసూదనరావు
ఏలూరు సిటీ : డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) 2014–16 విద్యాసంవత్సరానికి సంబంధించి ఫీజు, నామినల్ రోల్స్ సమర్పించాల్సిన తేదీలను డీఈవో డి.మధుసూదనరావు శుక్రవారం తెలిపారు. అభ్యర్థులు ఫీజులను ఎటువంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 15లోగా చెల్లించాలని, నామినల్ రోల్స్‌ను కాలేజీ యాజమాన్యాలు ఈనెల 17లోగా డీఈవో కార్యాలయానికి సమర్పించాలని కోరారు. రూ.50 అపరాధ రుసుముతో ఈనెల 22 వరకు ఫీజులు చెల్లించవచ్చని, నామినల్ రోల్స్ వివరాలు 24 తేదీలోగా డీఈవో కార్యాలయానికి సమర్పించాలని తెలిపారు. రెగ్యులర్ అభ్యర్థులు రూ.250, ఫెయిల్ అయిన అభ్యర్థులు నాలుగు లేదా ఐదు పరీక్షలకు రూ.250, మూడు పేపర్లకు రూ.175, రెండు పేపర్లకు రూ.150, ఒక పేపర్‌కు రూ.125 చెల్లించాలని తెలిపారు.
డీఏ డ్రాకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్
ఏపీ ట్రెజరీ వెబ్‌సైట్‌లో నూతన డీఏను
డ్రా చేసుకునేందుకు వీలుగా సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం అప్‌డేట్ చేసిందని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.జయకర్, బి.గోపీమూర్తి శుక్రవారం
ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 5 నుంచి 8వ తేదీల్లో డీఏ అరియర్స్ బిల్లులను
డీడీవోలు అంతా బిల్లులు చేసి ట్రెజరీలకు పంపాలని కోరారు.
Advertisement