12మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు
Published Sat, Sep 24 2016 6:53 PM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM
జమ్మికుంట రూరల్ : గతేడాది పదోతరగతి పరీక్షల్లో 60శాతం కన్నా తక్కువ ఫలితాలు వచ్చిన మండలంలోని పలు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు డీఈవో కార్యాలయం నుంచి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. తనుగుల హెచ్‌ఎం దామెర సుధాకర్ (ప్రస్తుత ఇంచార్జీ ఎంఈవో), వావిలాల హెచ్‌ఎం మల్లికార్జునరావు, ఎన్. సదయ్య, ఎ.శ్రీనివాస్, కోరపల్లి హెచ్‌ఎం కాత్యాయని, చంద్రమౌళి, రమేశాచార్యులు, ఆబాదిజమ్మికుంట హెచ్‌ఎం భావనరుషి, జయప్రద, కనగర్తి హెచ్‌ఎం కిషన్‌రావుకు గురువారం డీఈవో కార్యాలయం నుంచి వచ్చిన నోటీసులను వారికి జారీ చేసినట్లు ఎంఈవో తెలిపారు.
Advertisement
Advertisement