హెచ్‌ఎం, ఇద్దరు టీచర్లపై సస్పెన్షన్‌ వేటు | H M, two teachers suspended | Sakshi
Sakshi News home page

హెచ్‌ఎం, ఇద్దరు టీచర్లపై సస్పెన్షన్‌ వేటు

Published Thu, Dec 15 2016 11:35 PM | Last Updated on Mon, Sep 4 2017 10:48 PM

H M, two teachers suspended

అనంతపురం ఎడ్యుకేషన్‌:

 స్థానిక భగత్‌సింగ్‌నగర్‌లోని ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవిచంద్రకుమార్‌,   టీచర్లు స్వర్ణలత, శ్రీలక్ష్మిలను సస్పెండ్‌ చేస్తున్నట్లు డీఈఓ ప్రకటించారు. వివరాల్లోకెళ్తే.. డీఈఓ శామ్యూల్‌ గురువారం ఉదయం 9:50 గంటలకు పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు.  డీఈఓ వెళ్లిన సమయానికి హెచ్‌ఎం, మరో టీచర్‌ మాత్రమే ఉన్నారు. వీరు కూడా తరగతి గదులో కాకుండా హెచ్‌ఎం గదిలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు.

ఇదే సమయంలో పాఠశాలకు సంబంధం లేని ఒక ప్రైవేటు వ్యక్తి పిల్లలకు చదువు చెబుతున్నాడు. ఆ వ్యక్తి గురించి డీఈఓ ఆరా తీశారు. 10.10 గంటల దాకా డీఈఓ అక్కడే ఉన్నా టీచర్లు స్వర్ణలత, శ్రీలక్ష్మి బడికి రాలేదు. హాజరు పట్టికను పరిశీలించగా వారు ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. స్కూల్లో  మొత్తం నలుగురు టీచర్లు పనిచేస్తుండగా వంతులు వారీగా స్కూల్‌కు వస్తున్నట్లు కొందరు స్థానికులు డీఈఓకి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై డీఈఓ తీవ్రంగా స్పందించారు. ప్రైవేటు వ్యక్తితో బోధన చేయిస్తున్నందుకు హెచ్‌ఎంను, అనుమతులు లేకుండా విధులకు గైర్హాజరైనందుకు టీచర్లపై చర్య తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement