లావేరు (శ్రీకాకుళం) : జిల్లా విద్యాశాఖ అధికారి జరిపిన ఆకస్మిక తనిఖీల్లో భాగంగా నిర్వహించిన పరీక్షలో పలువురు విద్యార్థులకు సున్నా మార్కులు రావడంతో ఆయన విస్తుపోయారు. శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) దేవానంద్‌రెడ్డి సోమవారం లావేరులోని ప్రభుత్వ ఎలిమెంటరీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో 4,5 తరగతుల విద్యార్థుల విద్యా ప్రమాణాలను తెలుసుకునేందుకు పరీక్ష నిర్వహించగా.. 9 మందికి సున్నా మార్కులు వచ్చాయి. మరో ఏడుగురు విద్యార్థులకీ అత్తెసరు మార్కులే.
4, 5 వ తరగతులు చదువుతున్న 28 మంది విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. కొంతమందికి సున్నామార్కులు రాగా, మరికొంతమందికి 40 శాతం లోపే వచ్చాయి. దీంతో డీఈవో అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. ప్రధానోపాధ్యాయుడు రమేశ్, ముగ్గురు టీచర్లు, లావేరు క్లస్టర్ విద్యాశాఖ సీఆర్‌పీ పద్మావతిలకు వెంటనే షోకాజు నోటీసులు జారీ చేశారు.
డీఈవో సమక్షంలో పరీక్ష: విద్యార్థులకు సున్నాలు
Published Mon, Dec 14 2015 4:36 PM | Last Updated on Sun, Sep 3 2017 1:59 PM
Advertisement