కంచిలి: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలోని మఠం సరియాపల్లిలోని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థినులు అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రాజెక్టు రూపకల్పన చేసే అరుదైన అవకాశాన్ని పొందారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాదికారి టి.తిరుమల చైతన్య నుంచి పాఠశాలకు శనివారం ఉత్తర్వులు అందాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో భాగంగా అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రాజెక్టు రూపకల్పన చేసి ప్రదర్శించేందుకు ఇక్కడి విద్యార్థినులకు అవకాశం లభించింది. పాఠశాల విద్యా శాఖ తరఫున జిల్లాలో మఠం సరియాపల్లి ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థినులు ఐదుగురు, పొన్నాడ కేజీబీవీ విద్యార్థినులు ఐదుగురు ఎంపికైనట్టు ఉత్తర్వులు వెలువడ్డాయని ప్రిన్సిపాల్ శివప్రసాద్ వెల్లడించారు.
వీరు ఈ నెల 26నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు బెంగళూరులో జరిగే ఇంటర్‌స్టేట్ హాకథాన్ ప్రోగ్రామ్‌లో పాల్గొనబోతున్నట్టు తెలిపారు. పాఠశాలకు చెందిన ఆరాధ్య పాణిగ్రాహి (9వ తరగతి), శ్రద్ధాంజలి మహంతి (9వ తరగతి), యాస్మిన్ చౌదరి (7వ తరగతి), రితిక బడిత్య (9వ తరగతి), మహంతి శ్రద్ధాంజలి (9వ తరగతి), గైడ్ టీచర్ బడియా సత్యనారాయణ ఈ ప్రాజెక్టు ప్రదర్శనకు ఎంపికయ్యారు. ఐదుగురు విద్యార్థినులు, గైడ్ టీచర్ బెంగళూరు వెళ్లి రావడానికి ఉచిత విమాన ప్రయాణం, ఫైవ్ స్టార్ వసతి కల్పించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment