బోదె పద్ధతిలో మొక్కజొన్న | corn in doormat method | Sakshi
Sakshi News home page

బోదె పద్ధతిలో మొక్కజొన్న

Published Sat, Nov 22 2014 2:45 AM | Last Updated on Tue, Oct 2 2018 4:01 PM

బోదె పద్ధతిలో మొక్కజొన్న - Sakshi

బోదె పద్ధతిలో మొక్కజొన్న

ట్రాఫిక ల్టర్
 సహజంగా రైతులు మొక్కజొన్న సాగు చేయడానికి పొలాలు దున్ని సాళ్లుగా చేసి సాళ్లలో విత్తనాలు చల్లి ఎదపెడతారు. ఇది పాత పద్ధతి. వర్షాలు అధికంగా కురిసినప్పుడు సాళ్లలో నీరు నిల్వ ఉండి విత్తనాలు దెబ్బతినే ప్రమాదం ఎక్కువ . ఒకవేళ వర్షాలు తక్కువగా ఉంటే.. మొక్కలకు నీరందక చనిపోయే ప్రమాదం ఉంది. వీటిని అధిగమించడానికి బోదె పద్ధతి  మొక్కజొన్న సాగులో ఇక్రిశాట్ ప్రయోగాత్మకంగా చేపట్టింది. ఈ బోదెలు చేసే యంత్రాన్ని ట్రాఫికల్టర్ అంటారు. దీన్ని ట్రాక్టర్‌కు అమర్చి ఉపయోగించవచ్చు. బాడుగ భరించలేని రైతులు ఎడ్లతో లాగించి మొక్కజొన్న విత్తనాలు నాటుకోవచ్చు.  

 ముందుగా బోదె పద్ధతిలో మొక్కజొన్న సాగు చేయాలనుకున్న పొలాన్ని ఎంచుకుంటారు. ఈ పద్ధతికి నల్లరేగడి నేలలు బాగా అనుకూలమైనవి. చేను ఎటు వైపు నుంచి ఎత్తుగా ఉంది.

 ఎటు వైపునకు పల్లంగా ఉం దో చూసుకుని ట్రాక్టరుకు బోదెలు చేసే యంత్రాన్ని తగిలించి నేలను సరిచేస్తారు. బోదెల మధ్య 1.5 మీటర్లు ఖాళీ ఉండే విధంగా సాళ్లు ఏర్పాటు చేస్తారు. అధిక వర్షాలు పడినప్పుడు బోదెలపై ఉన్న నీరు సాళ్లలోకి జారిపోవడమేగాక, సాళ్లలో ట్రాక్టర్లు, ఎడ్లు, చక్రా లు నడవడానికి కూడా పనికి వస్తాయి. ఈ పద్ధతిలో బోదెపై మూడు వరుసలు వస్తాయి. ఎకరానికి 28 వేల మొక్కలు పడతాయి. 8 కిలోల విత్తనాలు సరిపోతాయి. బోదెలు చేసిన తర్వాత విత్తనాలను యంత్రంతోనే నాటుతారు.

 బోదె పద్ధతి వల్ల ఉపయోగాలు  
 బోదె పద్ధతిలో మొక్కజొన్న సాగు చేస్తే మామూలు విధానంలో కన్నా 20 శాతం అధికంగా దిగుబడి వస్తుందని ఇక్రిశాట్ పరిశోధనలో తేలింది.
 ఈ పద్ధతిలో మొక్కజొన్న, కంది, శనగ, వేరుశనగ, సోయాబీన్  సాగు చేసుకోవచ్చు.
 వర్షపాతం ఎక్కువగా ఉన్నప్పుడు పంట దెబ్బ తినకుండా బోదెలపైన ఉన్న నీరు వెంటనే సాళ్ల ద్వారా బయటకు వెళ్తుంది. వర్షపాతం తక్కువగా ఉన్నప్పుడు బోదెల్లో ఉన్న తేమ పంట దెబ్బతినకుండా కాపాడుతుంది.

 పొలం వాలు, ఎత్తు పల్లాలను కొలిచి బోదెలు చేసుకుంటాం కాబట్టి నేల కోతకు గురికాకుండా కాపాడుతుంది. బోదెల్లో నీరు ఇంకిపోయేలా చేయడం ద్వారా పంట బెట్టకు వచ్చే అవకాశం తక్కువ.
 =సాళ్ల మధ్య దూరం 18 అంగుళాలు ఉంటుంది. అదే మామూలు పద్ధతిలో సాగు చేస్తే 22 అంగుళాలు ఉంటుంది. దీని వల్ల స్థలం కలిసి వస్తుంది. బోదెలు పెరుగుతాయి. మొక్కల సంఖ్య పెరుగుతుంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement