icrisat
-
ఇక్రిశాట్ నూతన డైరక్టర్ జనరల్‌గా డా.హిమాన్షు పాఠక్ బాధ్యతలు
సాక్షి,హైదరాబాద్: అంతర్జాతీయ సమశీతోష్ణ మండల ప్రాంత వ్యవసాయ పరిశోధన సంస్థ(ఇక్రిశాట్) డైరెక్టర్ జనరల్‌గా నియమితులైన డా.హిమాన్షు పాఠక్ బాధ్యతలు స్వీకరించారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్‌గా పని చేసిన ఆయన.. తాజాగా ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన బాధ్యతలు తీసుకునే క్రమంలో ఇక్రిశాట్ హిమాన్షు పాఠక్‌కు సాదర స్వాగతం పలికింది.మొట్టప్రాంతాల వ్యవసాయ పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్) డైరెక్టర్ జనరల్‌గా నియమితులైన డాక్టర్ హిమాన్షూ పాఠక్ దేశంలోనే పేరెన్నికగన్న వ్యవసాయ శాస్త్రవేత్త. నేల, వ్యవసాయ రసాయనాలు, మొక్కలు ఎదుర్కొనే ఒత్తిళ్ల గురించి విసృ్తత పరిశోధనలు చేసిన ఈయన 1986లో బెనారస్ హిందూ యూనివర్శిటీ నుంచి వ్యవసాయంలో బీఎస్సీ విద్యనభ్యసించారు.భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐసీఏఆర్)లో సాయిల్ సైన్స్ ఎమ్మెస్సీతోపాటు పీహెచ్డీ చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ కార్యదర్శిగా ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్‌గా, ఐసీఏఆర్ జాతీయ వరి పరిశోధన సంస్థ (కటక్) డైరెక్టర్ జనరల్‌గా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబయటిక్ స్ట్రెస్ మేనేజ్మెంట్ (బారామతి) డైరెక్టర్‌గానూ పనిచేశారు. యూకేలోని ఎస్సెక్స్ యూనివర్శిటీ, జర్మనీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటరాలజీ అండ్ క్లైమెట్ రీసెర్చ్‌లలో విజిటింగ్ సైంటిస్ట్‌గా పని చేశారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లోని మెట్టప్రాంతాల చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం కోసం పరిశోధన, వ్యవసాయ విధానాలను రూపొందించడంలో డాక్టర్ పాఠక్‌ది కీలకపాత్ర. -
పంటలకు వానలా నీళ్లు!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: కాలువలు, బోరు బావుల పైప్లైన్లు వంటివి సాంప్రదాయ సాగునీటి పద్ధతులు... డ్రిప్‌లు, స్పింక్లర్లు.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సూక్ష్మ సేద్య విధానాలు.. కానీ ఇందుకు భిన్నంగా పంటలపై వాన కురిసినట్టుగా, అవసరానికి తగినట్టే నీళ్లు అందేలా ‘పివోట్ లీనియర్ ఇరిగేషన్’విధానాన్ని ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు అవలంబిస్తున్నారు. విదేశాల్లో వినియోగిస్తున్న ఈ సాంకేతికతను మన దేశంలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. పరిశోధనల్లో భాగంగా సాగు చేస్తున్న పంటలకు ఈ విధానంలో నీళ్లు అందిస్తున్నారు. మొత్తం పొలమంతా కాకుండా... కావాల్సిన చోట మాత్రమే, అనుకున్న సమయంలో పంటలకు వర్షంలా నీళ్లు అందించగలగడం దీని ప్రత్యేకత.తక్కువ ఎత్తులో పెరిగే పంటలకు..ప్రస్తుతం ఇక్రిశాట్లో వేరుశనగ, శనగ కొత్తవంగడాలపై పరిశోధనల కోసం సాగు చేస్తున్న వ్యవసాయ క్షేత్రాల్లో ఈ‘సెంట్రల్ పివోట్ లీనియర్ ఇరిగేషన్’విధానం ద్వారా నీటిని అందిస్తున్నారు. ఇలా తక్కువ ఎత్తుండేపంటల సాగుకు ఈ విధానంతో ఎంతో ప్రయోజనం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మీటరుకన్నా తక్కువ ఎత్తుతోనే పండే పంటలకు ఎక్కువ మేలు అని పేర్కొంటున్నారు. భారీ విస్తీర్ణంలో పంటలు వేసే భూకమతాలు, ఒకేచోట వందల ఎకరాల్లో ఒకేతరహా పంటలు సాగుచేసే భారీ వ్యవసాయ క్షేత్రాల్లో ఈ విధానాన్ని వినియోగిస్తుంటారని చెబుతున్నారు. యంత్రాలతో కూడిన పద్ధతిలో కేవలం ఒకరిద్దరు వ్యక్తులతోనే వందల ఎకరాలకు సాగునీటిని అందించవచ్చని వివరిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లోని భారీ వ్యవసాయ క్షేత్రాల్లో పివోట్లీనియర్ ఇరిగేషన్ విధానం ఎక్కువగా వినియోగిస్తున్నారని చెబుతున్నారు.ప్రయోజనాలు ఎన్నెన్నో...ఈ విధానంలో పంటలకు సాగునీరు అందించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ విధానంలో విద్యుత్ వినియోగం కూడా తక్కువని, నీటి వృథాను తగ్గిస్తుందని.. తక్కువ నీటి వనరులతో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయవచ్చని వివరించారు. నీటిని పారించే కూలీల అవసరం ఉండదని.. నేల కోతకు గురికావడం వంటి నష్టాలు కూడా ఉండవని వెల్లడించారు. పంటల అవశేషాలు తిరిగి మట్టిలో కలసి కుళ్లిపోవడానికి ఈ విధానం వీలు కలి్పస్తుందని, తద్వారా ఎరువుల వినియోగం తక్కువగా ఉంటుందని వివరించారు.⇒ పొలంలో కొన్ని పదుల నుంచి వందల మీటర్ల వరకు దూరంలో రెండు భారీ రోలర్లు, వాటి మధ్య పైపులతో అనుసంధానం ఉంటుంది. ఆ పైపులకు కింద వేలాడుతున్నట్టుగా సన్నని పైపులు ఉంటాయి. వీటి చివరన నాజిల్స్ ఉంటాయి.⇒ పొలంలోని బోరు/ మోటార్ ద్వారా వచ్చే నీటిని పైపుల ద్వారా రోలర్ల మధ్యలో ఉన్న ప్రధాన పైప్‌లైన్‌కు అనుసంధానం చేస్తారు. దీనితో బోరు/మోటార్ నుంచి వచ్చే నీరు.. రెండు రోలర్ల మధ్యలో ఉన్న పైపులు, వాటికి వేలాడే సన్నని పైపుల ద్వారా ప్రయాణిస్తుంది. నాజిల్స్ నుంచి వర్షంలా పంటలపై నీరు కురుస్తుంది.⇒ ఈ రోలర్లు పొలం పొడవునా నిర్దేశించిన వేగంలో ముందుకు, వెనక్కి కదులుతూ ఉంటాయి. ఈ క్రమంలో పంటపై వర్షంలా నీరు పడుతూ ఉంటుంది.⇒ రోలర్లను రిమోట్ ద్వారా నడపవచ్చు. లేదా కంప్యూటర్, సెల్‌ఫోన్ ద్వారా కూడా ఆపరేట్ చేయవచ్చు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటకు ఎంత పరిమాణంలో నీటిని అందించాలన్నది నియంత్రించవచ్చు.‘పివోట్ లీనియర్ ఇరిగేషన్’విధానం ఇదీ..⇒ కావాలనుకున్న చోట ఎక్కువగా, లేకుంటే తక్కువగా నీటిని వర్షంలా కురిపించవచ్చు. వేర్వేరు పంటలను పక్కపక్కనే సాగు చేస్తున్న చోట ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.⇒ వ్యవసాయ క్షేత్రం విస్తీర్ణాన్ని బట్టి, ఏర్పాటు చేసుకునే పరికరాలను దీనికి అయ్యే ఖర్చు ఆధారపడి ఉంటుందని ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చిన్న, సన్నకారు రైతులు కాకుండా.. సమష్టి వ్యవసాయం చేసేందుకు ఈ విధానం మేలని పేర్కొంటున్నారు. -
ఎక్కడున్నా మొక్కపై నిఘా!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: వ్యవసాయ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల కోసం పంట పొలాల్లో తిరగాల్సి ఉంటుంది. ప్రత్యక్షంగా వెళ్లి మొక్కల తీరును పరిశీలించి డేటాను సేకరించాలి. కానీ, పంటలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా అధ్యయనం చేయ గల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇక్రిశాట్లో ఉన్న ప్రత్యేక పరిశోధన క్షేత్రంలో వినియోగిస్తున్నా రు. పంటల వద్దకు వెళ్లకుండానే తామున్న చోట నుంచే పంటల తీరును పరిశీలించేందుకు వీలుండే ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. ‘హై థ్రోపుట్ ఫినోటైపింగ్ ఫెసిలిటీ’అనే అధునాతన ల్యా బ్ ద్వారా ఇతర దేశాల్లో ఉన్న సైంటిస్టులు కూడా ఇక్కడి పంటల తీరును ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు కలుగుతోంది. ప్రస్తుతానికి ఈ ఆధునిక ప్రయోగశాలలో జొన్న పంటపై పరిశోధన జరుగుతోంది. అంతర్జాతీయ పంటల పరిశోధన సంస్థ.. ఇక్రిశాట్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లోని రామచంద్రాపురంలో ఉన్నప్పటికీ.. దీని ప్రాంతీయ కార్యాలయాలు కెన్యా, మాలి, నైజీరియా, మలావీ, ఇథియోఫియా, జింబాబ్వే తదితర ఆఫ్రికా దేశాల్లో ఉన్నాయి. ఆయా దేశాల్లో ఉన్న శాస్త్రవేత్తలు సైతం ఇక్కడి పరిశోధన క్షేత్రంలో పెరుగుతున్న మొక్కలను వీక్షించేందుకు, పరిశీలించేందుకు ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. మొక్క ప్రతిస్పందనపై క్షణక్షణం నిఘా హైథ్రోపుట్ ఫినోటైపింగ్ ఫెసిలిటీ కేంద్రంలో ప్రస్తుతం జొన్న పంటకు సంబంధించి ఐదు వేల మొక్కలను పెంచుతున్నారు. ఈ సెంటర్ మొక్క ప్రతి స్పందనను క్షణక్షణం రికార్డు చేస్తుంది. ఈ డేటాను ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తుంది. మొక్క పత్రహరితానికి సంబంధించిన ఫ్లోరోసెన్స్, మొక్క 3డీ మాడలింగ్, ఆర్జీబీ ఇమేజింగ్, హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్, థర్మల్ ఇమేజింగ్.. ఇలా మొక్కను పూర్తిస్థాయిలో స్కాన్ చేయగల ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. నీటి వాడకానికీ లెక్క ఉంటుంది.. మొక్క ఎప్పడు ఎంత నీటిని వాడుకుంటుందనే వివరాలు కూడా ఈ ల్యాబ్‌లో రికార్డు అవుతాయి. మొక్క ట్రే కింద ప్రత్యేకంగా లోడ్ సెన్సార్ ఉంటుంది. మొక్కకు పట్టిన నీళ్లు ఎన్ని ఆవిరయ్యాయి? ఎంత వినియోగమైంది? అనే వివరాలను సేకరిస్తుంది. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా మొక్క ఎంత ఒత్తిడికి గురవుతుంది? మొక్కల ఎదుగుదల ఎలా ఉంటుంది? అనే అంశాలను ఇమేజ్, వీడియో రూపంలో కూడా రికార్డు చేస్తుంది.మొక్కలు ఎంత నీళ్లు ఇస్తే తట్టుకోగలవు. నీళ్లు లేకపోతే ఎంత మేరకు అనుగడ సాధించగలవు? అనే అంశాలను పరిశీలించేందుకు వీలుంటుంది. తద్వారా నీటి కొరతను తట్టుకునే వెరైటీలు, అధిక వర్షాలకు తట్టుకునే వెరైటీలను కనుగొనే అవకాశం ఉంటుందని ఇక్రిశాట్ రిసెర్చ్ స్కాలర్ కల్పన తెలిపారు. -
నేలమ్మకు కొత్త శక్తి.. చీడపీడల విముక్తి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మన ఆహారం ఆరోగ్యానికి మేలు చేసేదిగా ఉండాలంటే ఆహార ఉత్పత్తులు పండే నేల కూడా ఆరోగ్యంగా ఉండాలి. రసాయన ఎరువులు, పురుగుమందులు వాడిన నేలల్లో పండే పంటలు ఆరోగ్యానికి హాని చేస్తాయి. అలాంటిది ఆరోగ్యానికి మేలు చేసే, అధిక దిగుబడులనిచ్చే ఆధునిక వంగడాల అభివృద్ధికి మెట్ట ప్రాంత పంటల అంతర్జాతీయ పరిశోధన కేంద్రం (ఇక్రిసాట్) కొత్త దారిలో పరిశోధనలు చేస్తోంది. ఇందుకోసం పునరుత్పాదక వ్యవసాయ విధానాన్ని అవలంబిస్తోంది. ఈ దిశగా ముందడుగు సైతం వేసింది. భారత్‌తోపాటు వివిధ దేశాల్లో ఎక్కువగా సాగయ్యే వేరుశనగ, కంది, సజ్జ, పొద్దుతిరుగుడు, శనగ వంటి మెట్ట పంటల్లో మెరుగైన వంగడాల కోసం ఈ విధానంలో పరిశోధనలు జరుగుతున్నాయి. ఏడాదంతా ఏదో పంట.. ఈ పునరుత్పత్తి వ్యవసాయం పద్ధతిలో.. ఒకే కమతంలో పక్కపక్కనే వివిధ రకాల పంటలు వి త్తుకుంటారు. ఒక్కో పంట ఒక్కో దశలో ఉంటుంది. ఏడాదంతా వాటి అనుకూల కాలానికి తగ్గట్లుగా ఈ పంటలు వేసుకుంటున్నారు. ఒక పంట కొతకొచ్చే దశలో మరో పంట కాయ దశలో ఉంటుంది. ఇంకో పంట పూత దశకు వస్తుంది. రెండు బ్లాకుల్లో సాగు.. ఇక్రిసాట్‌లో మొత్తం నాలుగు రకాల నేలలు ఉండగా అందులో ఎర్ర, నల్లరేగడి నేలల్లోని రెండు బ్లాకుల్లో పునరుత్పత్తి వ్యవసాయ విధానంపై పరిశోదనలు సాగుతున్నాయి. ఎర్ర నేలతో కూడిన బ్లాకులో వేరుశనగ, పొద్దుతిరుగుడు, సజ్జ, కంది పంటలను ఒకే కమతంలో సాగు చేస్తున్నారు. నల్లరేగడి నేలతో కూడిన మరో బ్లాక్‌లో శనగ, పొద్దుతిరుగుడు, సజ్జ, కంది పంటలు వేశారు. ఇవీ ప్రయోజనాలు.. రీజనరేటివ్ అగ్రికల్చర్ విధానంలో అనేక ప్రయోజనాలున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. సాగవుతున్న పంటల్లో దేనికైనా చీడపీడలు ఆశిస్తే ఆ ప్రభావం పక్కనే ఉన్న మరో పంటకు వ్యాపించేందుకు వీలుండదు. ఆ పంటకే పరిమితమవుతుంది. అదే ఒకే పంట పూర్తి విస్తీర్ణం వేస్తే చీడపీడలు పూర్తి విస్తీర్ణంలో పంటలను ఆశించే ప్రమాదం ఉంటుంది. దీన్ని ఈ విధానం ద్వారా అధిగమించేలా పరిశోధనల ప్రక్రియ కొనసాగుతోంది. అలాగే ఆరోగ్యవంతమైన బ్యాక్టీరియా, పంటలకు ఉపయోగకరమైన ఫంగస్‌ను నాశనం కాకుండా కాపాడుకోవచ్చు. హానికరమైన రసాయనాలు, కలుపు మందులు, పురుగు మందులపై ఆధార పడాల్సిన అవసరం ఉండదు. ఆరోగ్యకరమైన నేలపై పర్యావరణానికి అనుకూలమైన రీతిలో ఈ వ్యవసాయం ఉంటుంది. విలువైన ప్రకృతి వనరులు క్షీణించకుండా, వనరులు మరింత బలోపేతం అయ్యేందుకు ఈ విధానం దోహదపడుతుంది.సాధారణంగా ఏటా అధిక మోతాదుల్లో ఎరువుల వాడకం వల్ల నేల స్వభా వాన్ని కోల్పోతూ ఉంటుంది. కానీ పునరుత్పాదక వ్యవసాయ విధానం ద్వారా నేల పునరుజ్జీవం చెందుతుంది. డీగ్రేడ్ అయిన నేల రీస్టోర్ అవుతుందని రీసెర్చ్ స్కాలర్ కల్పన పేర్కొన్నారు. -
రైతులకు త్వరగా చేరినప్పుడే కొత్త వంగడాల ప్రయోజనం!
వాతావరణ మార్పుల్ని ధీటుగా తట్టుకునే అధిక పోషకాలతో కూడిన 109 కొత్త వంగడాలను ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల విడుదల చేశారు. వీటిల్లోని 5 వంగడాలతో అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా సంస్థ (ఇక్రిశాట్)కు సంబంధం ఉంది. ఇక్రిశాట్లో పెరిగిన తల్లి మొక్కల (పేరెంట్ లైన్స్)ను తీసుకొని వివిధ యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థలు కొత్త వంగడాలను రూపొందించాయి. ఈ ఐదింటిలో మూడు కంది, జొన్న, సజ్జ వంగడాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు అనువైనవి. ఈ వంగడాల రూపకల్పనలో ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు డా. ప్రకాశ్, డా.గుప్తా, డా. ఇఫ్రీన్ ప్రధానపాత్ర పోషించారని ఇక్రిశాట్ ప్రధాన శాస్త్రవేత్త డా.పసుపులేటి జనీల ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. ఇంతకీ.. ఇప్పుడు విడుదలైన కొత్త విత్తనాలు రైతులకు ఎప్పటికి అందుతాయి? అని ప్రశ్నిస్తే.. ఆశ్చర్యకరమైన సమాధానం వచ్చింది. కొన్ని పంటల్లో 5 నుంచి 15 ఏళ్లు పడుతోందన్నారు. విత్తన వ్యవస్థలపై శ్రద్ధ కొరవడినందున కొత్త వంగడాలు గ్రామీణ రైతులకు సత్వరమే చేరటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 5 తెగుళ్లను తట్టుకునే సజ్జ హైబ్రిడ్సజ్జ పూసా 1801: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు అనువైన హైబ్రిడ్ ఇది. ఇక్రిశాట్‌తో కలసి న్యూఢిల్లీలోని ఐఎఆర్ఐ రూపొందించింది. సజ్జల కోసమే కాకుండా, పశుగ్రాసం కోసం కూడా సాగు చేయతగినది. 5 తెగుళ్లను తట్టుకోగలుగుతుంది. అగ్గి తెగులును, వెర్రి తెగులును పూర్తిగా.. తుప్పు తెగులు, స్మట్, ఆర్గాట్ తెగుళ్లను కొంతమేరకు తట్టుకుంటుంది. ఈ రకం సజ్జల్లో ఇనుము (70 పిపిఎం), జింక్ (57 పిపిఎం) ఎక్కువ. హెక్టారుకు 33 క్వింటాళ్ల సజ్జలు, ఎండు చొప్ప హెక్టారుకు 175 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ఇది ప్రకృతి సేద్యానికీ అనువుగా ఉంటుందని డా. జనీల తెలిపారు.కోతకొచ్చినా పచ్చగా ఉండే జొన్నజొన్న ఎస్పిహెచ్ 1943: తెలంగాణకు అనువైన(ఏపీకి కాదు) హైబ్రిడ్ ఇది. యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ ధర్వాడ్(కర్ణాటక) ఇక్రిశాట్‌తో కలసి అభివృద్ధి చేసింది. హెక్టారుకు 39 క్వింటాళ్ల జొన్నల దిగుబడినిచ్చే ఈ రకం ఖరీఫ్‌లో వర్షాధార సాగుకు అనుకూలం. గడ్డి దిగుబడి హెక్టారుకు 116 క్వింటాళ్లు. కోత దశలోనూ గడ్డి ఆకుపచ్చగానే ఉండటం (స్టే గ్రీన్) దీని ప్రత్యేకత. గింజ బూజును కొంత వరకు తట్టుకుంటుంది. తక్కువ నత్రజని ఎరువుతోనే 9% అధిక దిగుబడినిస్తుంది. ప్రకృతి సేద్యానికీ అనువైనదని డా. జనీల తెలిపారు. 5 నెలల కంది సూటి రకంకంది ఎన్ఎఎఎం–88: ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వర్షాధారం/నీటిపారుదల కింద ఖరీఫ్‌కు అనువైన సూటి రకం. ఇక్రిశాట్‌తో కలసి కర్ణాటక రాయచూర్‌లోని యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ ఈ రకాన్ని అభివృద్ధి చేసింది. 142 రోజుల (స్వల్పకాలిక) పంట. హెక్టారుకు 15 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ఎండు తెగులును కొంతమేరకు తట్టుకుంటుంది.పాలకులు శ్రద్ధ చూపాలిశాస్త్రవేత్తలు దీర్ఘకాలం పరిశోధనలు చేసి ఓ కొత్త వంగడాన్ని రూపొందిస్తారు. కానీ, విడుదలైన తర్వాత కూడా కొత్త విత్తనం రైతులకు సత్వరం అందటం లేదు. వేరుశనగ, శనగ వంటి పంటల్లో 15–18 ఏళ్లు పడుతోంది. వెరైటీల రిలీజ్‌తో పని అయి పోయినట్లు కాదు. ఫార్మల్, ఇన్ఫార్మల్ సీడ్ సిస్టమ్స్‌ను ప్రోత్సహించటంపైపాలకులు దృష్టిని కేంద్రీకరించటం అవసరం. అప్పుడే రైతులు, వినియోగదారులకు కొత్త వంగడాల ప్రయోజనాలందుతాయి. – డా. పసుపులేటి జనీల, క్లస్టర్ లీడర్ – క్రాప్ బ్రీడింగ్, ప్రధాన శాస్త్రవేత్త (వేరుశనగ), ఇక్రిశాట్ -
‘నల్ల తామర’కు ముకుతాడు?
సాక్షి సాగుబడి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మిరప రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్న నల్ల తామరను తట్టుకునే మిరప రకాలను రూపొందించుకునే పరిశోధనల్లో వరల్డ్ వెజిటబుల్ సెంటర్ గణనీయమైన పురోగతి సాధించింది. తైవాన్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ వరల్డ్ వెజిటబుల్ సెంటర్ (డబ్ల్యూ.వి.సి.) దక్షిణాసియా ప్రాంతీయ పరిశోధనా స్థానం పఠాన్‌చెరులోని ఇక్రిశాట్ ఆవరణలో ఉంది. ఈ కేంద్రంలో సాగులో ఉన్న నల్లతామరను తట్టుకునే గుణాలున్న 9 మిరప రకాలతో కూడిన ప్రదర్శన క్షేత్రాన్ని ఆసియా అండ్ పసిఫిక్ సీడ్ అసోసియేషన్(ఎపిఎస్‌ఎ)కు చెందిన 50 ప్రైవేటు విత్తన కంపెనీల ప్రతినిధులు పరిశీలించారు. ఆసక్తి కలిగిన విత్తన కంపెనీలతో కలసి త్వరలో చేపట్టనున్న బ్రీడింగ్ ప్రాజెక్టు ద్వారా నల్లతామర, తదితర చీడపీడలను చాలావరకు తట్టుకునే సరికొత్త సంకర వంగడాలను రూపొందించనున్నట్లు డబ్ల్యూ.వి.సి. ఇండియా కంట్రీ డైరెక్టర్ అరవఝి సెల్వరాజ్ తెలిపారు. 10 రాష్ట్రాల్లో మిరపకు నల్లతామర ప్రపంచంలో మిరపను అత్యధిక విస్తీర్ణంలో పండిస్తూ, వినియోగిస్తూ, ఎగుమతి చేస్తున్న దేశం భారత్. అంతేకాకుండా, దేశంలో అత్యధిక విస్తీర్ణంలో సాగవుతున్న రెండో పెద్ద కూరగాయ పంట మిరప. హెక్టారుకు రూ. 2.5–3 లక్షల వరకు పెట్టుబడి అవసరమైన ఈ పంట దేశంలో సుమారు 7.30 లక్షల హెక్టార్లలో సాగవుతోంది. తామర పురుగులు గతం నుంచి ఉన్నప్పటికీ అంత ప్రమాదకరం కాదు. అయితే, ఇండోనేసియా నుంచి బొప్పాయి ద్వారా మన దేశంలోకి ప్రవేశించిన నల్ల తామర 2015లో తొలుత మిరపను ఆశించి విధ్వంసం సృష్టిస్తోంది. గత రెండు–మూడేళ్లుగా ఏపీ, తెలంగాణ సహా పది రాష్ట్రాల్లో మిరప తోటలకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. నల్ల తామర తాకిడిని తట్టుకోవడానికి అతి తరచూ పురుగుమందులు పిచికారీలు చేసినా దిగుబడి నష్టం 40–50 శాతం ఉంటుంది. ఏభయ్యేళ్ల పరిశోధన ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో దీన్ని తట్టుకునే వంగడాలపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. కూరగాయ పంటలపై గత ఏభయ్యేళ్లుగా పరిశోధనలు చేస్తూ మెరుగైన వంగడాల అభివృద్ధికి, స్థానిక వంగడాల అభివృద్ధికి దోహదపడుతున్న అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ వరల్డ్ వెజిటబుల్ సంస్థ. తైవాన్‌లోని ప్రధాన పరిశోధన స్థానం కలిగిన డబ్లు్య.వి.సి. ప్రధానంగా మిరప, టొమాటో, కాకర, గుమ్మడి, బెండ, పెసర, వెజ్‡సోయాబీన్స్, తోటకూర పంటలకు సంబంధించి చీడపీడలు తట్టుకునే మెరుగైన వంగడాల అభివృద్ధిపై ఈ సంస్థ గత ఐదు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తోంది. అయితే, పటాన్‌చెరులోని డబ్ల్యూ.వి.సి. కేంద్రంలో ముఖ్యంగా మిరప, టొమాటో, పెసర, వెజ్ సోయాబీన్ పంటలపై పరిశోధనలు జరుగుతున్నాయి. మెరుగైన వంగడాలు వాడితే తక్కువ పిచికారీలు చాలు తైవాన్‌లోని డబ్ల్యూ.వి.సి. పరిశోధనా కేంద్రంలో నల్ల తామరను తట్టుకునే లక్షణాలు 7 రకాల మిరప వంగడాల్లో గుర్తించారు. పటాన్చెరు కేంద్రంలో గుర్తించిన మరో 2 మిరప రకాలను గుర్తించాం. ఈ 9 రకాలపై రెండేళ్లుగా పరిశోధనలు చేయగా, ఇందులో 6 రకాల్లో నల్ల తామరను తట్టుకునే లక్షణాలు కనిపించాయి. ఈ లక్షణాలకు కారణమైన జన్యువులను, వాటికి సంబంధించిన మార్కర్లను గుర్తించాలి. ఇందుకు ఆసక్తి గల స్థానిక ప్రైవేటు విత్తన కంపెనీలతో కలసి తదుపరి దశ పరిశోధనలు సాగించాల్సి ఉంది. ఈ పరిశోధనలన్నీ పూర్తయి నల్లతామరను చాలా మటుకు తట్టుకునే మెరుగైన మిరప విత్తనాలు రైతులకు చేరటానికి మరో 3–4 ఏళ్ల సమయం పడుతుంది. ఇప్పుడు చాలా సార్లు పురుగుమందులు పిచికారీ చేయాల్సి వస్తున్నది. మెరుగైన విత్తనాలు వాడితే తక్కువ పిచికారీలు సరిపోతాయి. ఈ మెరుగైన విత్తనాలను వాడుతూ రైతులు మంచి వ్యవసాయ పద్ధతులను పాటించటం అవసరం. దీర్ఘకాలం పాటు చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునేందుకు అనువైన మిరప వంగడాల అభివృద్ధికి దోహదపడటమే మా లక్ష్యం. – డా. నల్లా మనోజ్‌కుమార్, అసిస్టెంట్ సైంటిస్ట్, వరల్డ్ వెజిటబుల్ సెంటర్, దక్షిణాసియా పరిశోధనా కేంద్రం, ఇక్రిశాట్ ఆవరణ, పటాన్చెరు -
వ్యవసాయ రంగం పెద్ద దిక్కును కోల్పోయింది
సాక్షి, హైదరాబాద్: దేశంలో హరిత విప్లవ పితామహుడు, ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, పద్మ విభూషణ్ డాక్టర్ ఎం.ఎస్ స్వామినాథన్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. ఆయన మరణంతో దేశ వ్యవసాయ రంగం పెద్ద దిక్కును కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రజల ప్రధాన ఆహార వనరులైన వరి, గోధుమ పంటలపై స్వామినాథన్ చేసిన అద్భుతమైన ప్రయోగాలతో భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి హరిత విప్లవాన్ని సాధించిందని కేసీఆర్ తెలిపారు. సాంప్రదాయ పద్ధతిలో సాగుతున్న దేశీయ వ్యవసాయాన్ని స్వామినాథన్ వినూత్న పద్ధతుల్లో గుణాత్మక దశకు చేర్చారని కొనియాడారు. ఆహారాభివృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించిందంటే అది ఎంఎస్ స్వామినాథన్ కృషితోనే సాధ్యమైందన్నారు. దేశంలో రాష్ట్రాల వారీగా ప్రజలు పండిస్తున్న పంటలపై విస్తృత పరిశోధనలు చేసిన ఆయన ప్రతి భారత రైతు హృదయంలో స్థిరస్థాయిగా నిలిచిపోతారని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ వ్యవసాయాభివృద్ధిని ప్రశంసించారు: మంత్రులు నిరంజన్‌రెడ్డి, హరీశ్‌రావు స్వామినాథన్ మరణం తీరని లోటుని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. ఇటీవల తాము చెన్నై వెళ్లి ఆయన్ను కలిసినప్పుడు తెలంగాణ వ్యవసాయాభివృద్ధిని ప్రశంసించారని గుర్తు చేశారు. ఎంఎస్ స్వామినాథన్ మృతి బాధాకరమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు విచారం వెలిబుచ్చారు. ఆయన మరణం పరిశోధన రంగంతోపాటు యావత్ దేశ వ్యవసాయ రంగానికి తీరని లోటన్నారు. వ్యవసాయ పరిశోధనలకు మార్గదర్శి : కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దేశ వ్యవసాయరంగంలో జరిగే పరిశోధలనకు ఓ మార్గదర్శిగా హరిత విప్లవ పితామహుడు డా.ఎంఎస్ స్వామినాథన్ నిలిచారని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి నివాళులర్పిం చారు. స్వామినాథన్ మృతిపట్ల ఓ ప్రకటనలో తీవ్రవిచారం వ్యక్తం చేశారు. ఎంఎస్ స్వామినాథన్ మరణం వ్యవసాయ రంగానికి తీరని లోటని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, పార్టీ తమిళనాడు సహ ఇన్చార్జి పొంగులేటి సుధాకరరెడ్డి వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. హరియాణా గవర్నర్ దత్తాత్రేయ సంతాపం ఎంఎస్ స్వామినాథన్ మృతి పట్ల హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. దేశ వ్యవసాయ రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టి, వ్యవసాయ రంగంలో అభివృద్ధికి ఆయన ఎన్నో సేవలు అందించి తన పరిశోధనలకు దేశ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్నారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భారత్‌ను వ్యవసాయరంగంలో ప్రపంచశక్తిగా డా.స్వామినాథన్ తీర్చిదిద్దారని మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ శ్రద్ధాంజలి ఘటించారు. దేశానికి తీరనిలోటు: పీసీసీ చీఫ్ రేవంత్ వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమానికి నిరంతరం శ్రమించిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ మృతి అత్యంత బాధాకరమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. దేశంలో మేలైన వరి వంగడాలను సృష్టి్టంచి.. హరిత విప్లవానికి నాంది పలికిన స్వామినాథన్ మరణం దేశంలో వ్యవసాయ రంగానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ఆత్మగౌరవాన్ని కాపాడారు: మురళీ శర్మ, ఇక్రిశాట్ విశ్రాంత శాస్త్రవేత్త. ‘‘1960లలో మనం అమెరికా తదితర దేశాల నుంచి తిండిగింజలు దిగుమతి చేసుకునేవాళ్లం. ఇందుకు డబ్బులు చెల్లించినప్పటికీ మేము మీకు తిండి పెడుతున్నామన్నట్టుగా ఆయా దేశాలు మనల్ని చిన్నచూపు చూసేవి. అలాంటి పరిస్థితుల్లో డాక్టర్ స్వామినాథన్ దేశంలో హరిత విప్లవానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం దేశ జనాభా 140 కోట్లకు పైగా ఉన్నప్పటికీ తిండి గింజల విషయంలో స్వయం సమృద్ధిని సాధించాం. ఒక రకంగా చెప్పాలంటే దేశం తన ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు స్వామినాథన్ నేతృత్వంలో నడిచిన హరిత విప్లవం ఉపయోగపడింది’’అని ఇక్రిశాట్ విశ్రాంత శాస్త్రవేత్త మురళీశర్మ నివాళులర్పించారు. సాగుపై పూర్తి అవగాహన స్వామినాథన్‌కే సొంతం: జి.వి.రామాంజనేయులు ‘‘భారతీయ వ్యవసాయ రంగం బహుముఖీనతను అర్థం చేసుకునేందుకు డాక్టర్ స్వామినాథన్ నివేదికలు ఎంతో ఉపయోగపడతాయి. వ్యవసాయ శాస్త్రవేత్తల్లో సాగుకు సంబంధించిన సమగ్ర అవగాహన ఉన్న తొలి, చివరి వ్యక్తి కూడా డాక్టర్ స్వామినాథనే కావచ్చు.’’అని సెంటర్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్ వ్యవస్థాపకుడు జీవీ రామాంజనేయులు సంతాపం ప్రకటించారు. ఎం.ఎస్.స్వామినాథన్ భౌతికంగా లేకపోవచ్చు కానీ.. ఆయనిచ్చిన స్ఫూర్తి ఎప్పటికీ చెరిగిపోనిదని సీఎస్ఐఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ రఘునాథ్ మషేల్కర్ పేర్కొన్నారు. వ్యవసాయరంగానికి తీరని లోటు: రైతు నేతలు వెంకట్, మల్లారెడ్డి ఎంఎస్పీ సాధన, ఆహార భద్రత చట్టం అమలు కోసం పోరాడడమే స్వామినాథన్‌కు అర్పించే నిజమైన నివాళి అని అఖిల భారత వ్యవసాయ కారి్మక సంఘం కార్యదర్శి బి.వెంకట్ పేర్కొన్నారు. స్వామినాధన్ హరిత విప్లవ మార్గదర్శకుడని అఖిల భారత కిసాన్ సభ సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి నివాళులర్పించారు. భూ సంస్కరణల అమలుకు కృషి చేశారు: తమ్మినేని స్వామినాథన్ మృతికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రగాఢ సంతాపం ప్రకటించారు. భూసంస్కరణల అమలుకు కృషి చేసిన ఆయన మరణం దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. తెలంగాణను కొనియాడారు తెలంగాణలో వ్యవసాయరంగాభివృద్ధికి దిశగా రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణను ఎం ఎస్ స్వామినాథన్ పలుమార్లు కొనియాడిన విషయాలను, తనతో ఉన్న అనుబంధాన్ని సీఎం కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో రాష్ట్ర సచివాలయంలో ఆయనతో తాను సమావేశం కావడం మరిచిపోలేనని పేర్కొన్నారు. ఉచిత విద్యుత్, ఎత్తిపోతలతో సాగునీటి రంగాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణను స్వామినాథన్ఎంతగానో ప్రశంసించారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. వ్యవసాయ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణలో స్వామినాథన్ స్పూర్తి ఇమిడి ఉందని సీఎం తెలిపారు. వీలుచూసుకుని తెలంగాణ పర్యటనకు వస్తానని మాట ఇచ్చిన స్వామినాథన్ ఆ ఆకాంక్ష తీరకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం బాధను కలిగిస్తోందని విచారం వ్యక్తం చేశారు. ఆయన మన్ననలు పొందడం రైతుబిడ్డగా, ముఖ్యమంత్రిగా తనకెంతో గర్వకారణమంటూ స్వామినాథన్ కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జీవితకాలం మొత్తం రైతుల సంక్షేమం కోసం పరితపించిన మహావ్యక్తి వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్ స్వామినాథన్ ఇక లేరు అని విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ ఒక ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశంలో పంటల సమృద్ధి, ఆహార అభివృద్ధి, భద్రత, మహిళా రైతుల స్వయం సమృద్ధి కి విశేషంగా కృషి చేసిన స్వామినాథన్ మరణం పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. కో ఫౌండర్..బ్రాండ్ అంబాసిడర్ ఇక్రిశాట్‌తో స్వామినాథన్‌కు అనుబంధం సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: దేశ హరితవిప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌తో సంగారెడ్డి జిల్లాలో ఉన్న అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ(ఇక్రిశాట్)కు ప్రత్యేక అనుబంధముంది. 1972లో ఈ సంస్థ ఏర్పాటైంది. ఈ పరిశోధన సంస్థ స్థాపనలో స్వామినాథన్ కీలకపాత్ర పోషించారు. 1972 నుంచి 1980 వరకు ఆయన ఇక్రిశాట్ గవర్నింగ్ బోర్డ్ వైస్ చైర్మన్‌గా వ్యవహరించారు. అందరికీ పౌష్టికాహార భధ్రత కల్పించడమే లక్ష్యంగా ఉష్ణ మండల పాంత్రాల్లో సాగుకు యోగ్యంగా లేని భూముల్లో సైతం ఆహార పంటలు పండించేలా ఇక్రిశాట్ నూతన వంగడాలను అభివృద్ధి చేస్తోంది. ఈ సంస్థ మెట్ట పంటలపై, వాతావరణ మార్పుల ప్రభావంపై పరిశోధన చేస్తోంది. ప్రధానంగా జొన్న, వేరుశనగ, తృణధాన్యాల పంటలకు సంబంధించిన ఎన్నో వంగడాల ను అభివృద్ధి చేసింది. ప్రజల జీవన ప్రమాణాల పెంపు, పోషకాహార భద్రతను కల్పించడమే లక్ష్యంగా అంతర్జాతీయస్థాయిలో పరిశోధనలు చేస్తున్న ఇక్రిసాట్ 2013లో ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్ర ముఖులను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకుంది. బిల్‌గేట్స్, న్యూజిలాండ్ మాజీ ప్రధానమంత్రి జేమ్స్బొల్గర్, ఒలింపిక్ మెడలిస్ట్ సైనా నెహా్వల్, భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్‌కలాం తదితర ప్రముఖులతోపాటు స్వామినాథన్ కూడా ఇక్రిశాట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ‘‘వ్యవసాయం విఫలమైతే.. అన్ని రంగాలు విఫలమైనట్లే..’’అనే ఫ్రొఫెసర్ ఎం.ఎస్ స్వామినాథన్‌తో ఇక్రిశాట్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. వ్యవసాయ రంగంపై చెరగని ముద్ర: ఇక్రిశాట్ వ్యవసాయ పరిశోధనల రంగంలో డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ చెరగని ముద్ర వేశారని, వ్యవసాయ రంగానికి ఆయన చేసిన సేవ ప్రపంచవ్యాప్తంగా ఎందరో శాస్త్రవేత్తలకు స్ఫూర్తినిచ్చిందని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీ య మెట్ట ప్రాంతపంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్) తెలిపింది. ఇక్రిశాట్ సహ వ్యవస్థాపకుడుగా, 1972 – 80ల మధ్యకాలంలో సంసథ గవర్నింగ్ బాడీ ఉపాధ్యక్షులుగానూ డా క్టర్ స్వామినాథన్ పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకుంది. -
ఇక్రిశాట్లో ఆసక్తికర ఘటన.. శనగకాయలు తిన్న ప్రధాని మోదీ
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి, రామచంద్రాపురం: ఇక్రిశాట్ స్వర్ణోత్సవ లోగోను శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆవిష్కరించారు. ఆ తర్వాత శాస్త్రవేత్తలతో మాట్లాడారు. ఇక్రిశాట్ పరిశోధనల పురోగతిని వారు ప్రధానికి వివరించారు. సజ్జ, కంది, శనగ, వేరుశనగ, ఇతర చిరుధాన్యాలు, విత్తన రకాలు, నాణ్యతపై ప్రధాని శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పంట క్షేత్రాలను పరిశీలించారు. అక్కడ సాగవుతున్న శనగ పంటను చూసి కాయలను కోసుకొని రుచి చూశారు. స్వర్ణోత్సవాలకు హాజరైన ప్రధానిని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ జాక్వెలిన్ డి ఆరోస్ సన్మానించారు. చదవండి: 20 రకాల కూరలతో సుష్టుగా తినొచ్చు.. ధర రూ.100 మాత్రమే! -
భవిష్యత్ అంతా డిజిటల్ అగ్రికల్చర్ దే
-
ఇక్రిశాట్ స్వర్ణోత్సవ లోగోను ఆవిష్కరించిన ప్రధాని మోదీ
-
ఈ మూర్తి.. జగతికి స్ఫూర్తి
సాక్షి, హైదరాబాద్: జగద్గురు రామానుజాచార్యుల బోధనలు, ఆయన చాటిన ఆధ్యాత్మిక చైతన్యమే వేల ఏళ్ల బానిసత్వంలోనూ భారతీయులను చైతన్యవంతులుగా నిలిపాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్లాఘించారు. ఆయన చూపిన మార్గం ప్రపంచానికే ఆదర్శమని చెప్పారు. నాటి స్వాతంత్య్ర పోరాటం అధికారం, హక్కుల కోసమే కాకుండా వేల ఏళ్ల సంస్కృతి పరిరక్షణ కోసం జరిగిందని తెలిపారు. ఆ పోరాటంలో పాటించిన ఆధ్యాత్మిక, మానవీయ విలువలు మనకు రామానుజాచార్యుల వంటి వారి బోధనల నుంచే లభించాయన్నారు. ప్రధాని మోదీ శనివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ శ్రీరామనగరంలో నిర్వహిస్తున్న శ్రీరామానుజుల సహస్రాబ్ది సమారోహ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 216 అడుగుల భారీ రామానుజాచార్యుల విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించి ప్రసంగించారు. ఈ వివరాలు ప్రధాని మాటల్లోనే.. ఆయన విలువలు, ఆదర్శాలే మార్గం ‘‘రామానుజులు దక్షిణాదిలో జన్మించినా ఆయన బోధనలు దేశమంతటా విస్తరించి ఏకత్వాన్ని బోధించాయి. ఆయనను పరమ గురువుగా చిరస్థాయిలో నిలిపాయి. రామానుజులు తన బాగుకంటే జీవకోటి సంక్షేమానికే ఎక్కువ ఆరాటపడ్డారు. ఎంతో శ్రమకోర్చి నేర్చుకున్న గురుమంత్రాన్ని రహస్యంగా ఉంచాలనే గురువు మాటను కాదని.. తాను నరకానికి వెళ్లినాసరే మిగతా వారికి మేలు కలగాలనే ఉద్దేశంతో ఆలయ శిఖరంపైకి ఎక్కి అందరికీ మంత్రాన్ని ఉపదేశించారు. జగద్గురు రామానుజాచార్యుల బోధనలు ప్రపంచానికి మార్గనిర్దేశం కావాలని కోరుకుంటున్నాను. మనం అనుసరిసున్న విలువలు, ఆదర్శాలను మనం ఈరోజు రామానుజాచార్యుల విగ్రహ రూపంలో ఆవిష్కరించుకుంటున్నాం. రామానుజుల మార్గం రాబోయే సమస్యల పరిష్కారానికి దిశానిర్దేశం చేయడమే కాకుండా ప్రాచీన భారతీయతను కూడా బలోపేతం చేస్తుంది. విశిష్టాద్వైత బోధనతో.. అంబేద్కర్ వంటివారు రామానుజాచార్యులను ప్రశంసించడంతోపాటు ఆయన బోధనల నుంచి నేర్చుకోవాలని అనేవారు. మన దేశంలో పూర్వకాలం నుంచీ వివిధ వాదాలు, సిద్ధాంతాలను విశ్లేషించి స్వీకరించడమో, తిరస్కరించడమో కాకుండా.. అందులోని మంచిని వివిధ రూపాల్లో ఆచరించే సాంప్రదాయం ఉండేది. అదే రీతిలో రామానుజాచార్యులు కూడా అద్వైత, ద్వైత సిద్ధాంతాలను సమ్మిళితం చేసి విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించారు. తన బోధనల్లో కర్మ సిద్ధాంతాన్ని ఉత్తమ రీతిలో ప్రస్తావించడంతోపాటు స్వయంగా తన పూర్తి జీవితాన్ని అందుకోసమే సమర్పించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం చర్చిస్తున్న ప్రగతిశీలత, సామాజిక సమస్యల పరిష్కారం వంటి ఎన్నో అంశాలను రామానుజులు తన సంస్కృత, తమిళ గ్రంథాల్లో ఎప్పుడో లేవనెత్తారు. మూఢ విశ్వాసాలను అధిగమిస్తూ.. వెయ్యేళ్ల క్రితం సమాజంలో బలంగా ఉన్న మూఢ, అంధ విశ్వాసాలను అధిగమిస్తూ భారతీయ ఆలోచన ధారను రామానుజాచార్యులు సమాజానికి పరిచయం చేశారు. వెనుకబడిన తరగతులు, దళితుల పట్ల సమాజంలో ఉన్న అభిప్రాయాలను పటాపంచలు చేస్తూ, వారిని చేరదీసి గౌరవించారు. యాదగిరిపై నారాయణ మందిరం నిర్మించి దళితులకు దర్శనం, పూజలు చేసే అధికారం కల్పించారు. తాను స్నానం చేసి వచ్చే సమయంలో శిష్యుడు ధనుర్దాసు భుజాల మీద చేయివేసి నడవడం ద్వారా అంటరానితనం సరైనది కాదని స్పష్టంచేశాడు. చదవండి: ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్ దూరం సమానత్వాన్ని బోధిస్తున్న ‘స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ’.. ఆదర్శాలు, సత్యం అనే ఆభరణాలు లేని గాంధీని, ఆయన లేని స్వాతంత్య్ర పోరాటాన్ని మనం ఊహించలేం. హైదరాబాద్ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని కలిగిన సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్ విగ్రహం ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ ఏకత్వాన్ని.. రామానుజాచార్యుల ‘స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ సమానత్వాన్ని బోధిస్తున్నాయి. అధికారం లేదా బలం మీద కాకుండా ఏకత్వం, సమానత్వం, సమాదరణ అనే సూత్రాల మీద మనదేశం ఆధారపడి ఉంది. రామానుజుల విగ్రహం దేశవాసులకు నిరంతరం స్ఫూర్తినిస్తుంది. ఈ సమతాస్ఫూర్తితోనే ఎలాంటి అంతరాలు లేకుండా ప్రతిఒక్కరికీ అభివృద్ధి ఫలాలు అందించేందుకు ప్రభుత్వం ప్రయ త్నిస్తోంది. ఈ రోజు ఇక్కడ నాకు 108 దివ్యదేశ మందిరాల సందర్శన భాగ్యం లభించింది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. చినజీయర్‌స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మైహోం అధినేత రామేశ్వర్రావు పాల్గొన్నారు. ప్రధాని మోదీది రాజధర్మం: చినజీయర్ స్వామి నిత్యం ప్రజల శ్రేయస్సును కాంక్షించే శ్రీరామచంద్రుడు వ్రత సంపన్నుడుగా ప్రసిద్ధికెక్కాడని.. ఇప్పుడు దేశప్రజల కోసం అహర్నిశలు కృషిచేస్తున్న ప్రధాని మోదీ కూడా వ్రత సంపన్నుడేనని త్రిదండి చినజీయర్ స్వామి కొనియాడారు. మనుషులంతా ఒక్కటేననే స్ఫూర్తిని వెయ్యి ఏళ్లకు పూర్వమే రామానుజులు వ్యక్తపరిచారని.. ఆయన స్ఫూర్తిని మోదీ చాటుతున్నారని పేర్కొన్నారు. ‘‘వాల్మీకి రామాయణంలో ప్రజల సుఖసంతోషాల కోసం ప్రభువు చేసే త్యాగాలు, ధైర్య సాహసాలన్నీ మోదీలో కనిపిస్తున్నాయి. ప్రపంచ దేశాల్లో భారత్‌ను ముందు వరుసలో నిలిపేలా ఆయన కృషిచేస్తున్నారు. అందుకే ఆయనకే ప్రధాని స్థానం సరిపోలుతుంది. సబ్‌కాసాత్– సబ్కా వికాస్ నినాదంతో దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు.’’అని చినజీయర్‌స్వామి ప్రశంసించారు. కిషన్‌రెడ్డి ప్రసంగిస్తూ.. మనుషులంతా సమానమేనని రామానుజులు వెయ్యేళ్ల కింద చాటి చెప్పారని, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈ సమానత్వ సిద్ధాంతాన్ని అమలుచేస్తోందన్నారు. కొందరు విచ్ఛిన్నకర కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని, కానీ మనందరం రామానుజుల స్ఫూర్తితో సమానత్వంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. -
చిరుధాన్యంతో ఆరోగ్యభాగ్యం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: భారతదేశంలో ఎక్కువ మందిని పీడిస్తున్న రక్తహీనత జబ్బునుంచి బయటపడాలంటే చిరు ధాన్యాలు (మిల్లెట్స్)ను రోజూ ఆహారంగా తీసుకుంటే సమస్యను అధిగమించవచ్చని ఇక్రిశాట్ (అంతర్జాతీయ పంటల పరిశోధన సంస్థ) పేర్కొంది. ఇటీవలే ఇక్రిశాట్ వివిధ అధ్యయనాలతో పాటు కొంతమంది నుంచి నమూనాలు సేకరించి పరిశోధన చేసింది. దీంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలతో కలిసి సుమారు 22 అధ్యయనాలు జరిపినట్లు ఇక్రిశాట్ నివేదికలో వెల్లడించింది. ఇనుపధాతువు లోపాన్ని అధిగమించడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చని నివేదికలో వెల్లడించింది. భారీగా పెరిగిన హిమోగ్లోబిన్ స్థాయి సజ్జలు, రాగులు, జొన్నలు, కొర్రలు, అరికెలు, అండుకొర్రలు వంటి చిరుధాన్యాలు తీసుకున్న వారిలో, వీటిని తీసుకోని వారిలోనూ పరిశోధన నిర్వహించారు. చిరుధాన్యాలు తీసుకోని వారికంటే తీసుకున్న వారిలో 13.2 శాతం హిమోగ్లోబిన్ స్థాయిలు పెరిగినట్టు తమ నివేదికలో ఇక్రిశాట్ ప్రతినిధులు ధ్రువీకరించారు. సీరం ఫెరిటిన్ (ఇనుప ధాతువు) సగటున మిల్లెట్స్ తీసుకున్న వారిలో 54.7 శాతం అధికంగా ఉన్నట్లు తేల్చారు. ఫెరిటిన్ అంటే రక్తంలో ప్రొటీన్ కలిగిన ఇనుము. దీన్నే ఇనుము లోపానికి క్లినికల్ మార్కర్‌గా పేర్కొంటారు. వెయ్యి మంది చిన్నారులపై పరిశోధన వెయ్యిమంది చిన్నారులనే కాకుండా.. కౌమార దశ అంటే 15 ఏళ్లలోపు వారు, 25 ఏళ్లు దాటిన వారి నమూనాలనూ సైతం పరిశీలించారు. ఆరు రకాల చిరు ధాన్యాలను ఆహారంగా తీనుకున్న వారినే పరిశోధనకు తీసుకున్నారు. వీరిని పరిశీలించగా..ఇనుప ధాతువు, రక్తం వృద్ధి చెందినట్లు తేలింది. ఇప్పటివరకూ చిరుధాన్యాల ప్రభావంపై చేసిన అధ్యయనాల్లో ఇదే అతి పెద్దదని ఇక్రిశాట్ పేర్కొంది. మధుమేహం..హృద్రోగ బాధితులకు మంచిది దేశంలో మధుమేహ రోగులు, గుండె సంబంధిత రోగుల పెరుగుదల ప్రమాదకర స్థాయిలో ఉందని, అత్యధిక మరణాలకు ఈ జబ్బులే కారణమవుతున్నాయని నివేదికలో స్పష్టం చేశారు. చిరుధాన్యాలు రోజువారీ ఆహారంలో (మై ప్లేట్ ఫర్ ది డే) భాగంగా ఉండాలని, ఇలా తీసుకోగలిగితే షుగర్, బీపీ, గుండె జబ్బులను తగ్గించవచ్చునని ఇక్రిశాట్ ప్రతినిధులు చెప్పారు. చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల ఇనుపధాతువు పెరిగిందని, అదే మొలకెత్తిన చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల ఇనుపధాతువు వృద్ధి రెట్టింపు అయ్యిందని ఇక్రిశాట్ పేర్కొంది. -
ఒకటి, రెండు కాదు..శనగ వయసు ఏకంగా 12,600 ఏళ్లు
సాక్షి, హైదరాబాద్: భారత్‌తో పాటు దాదాపు 50 దేశాల్లో విరివిగా వాడే శనగల పూర్తిస్థాయి జన్యుక్రమ నమోదు పూర్తయింది. అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్) నేతృత్వంలో దేశ విదేశాలకు చెందిన 41 పరిశోధన సంస్థలు కలసి నిర్వహించిన ప్రాజెక్టు ఫలితంగా సంపూర్ణ జన్యుక్రమం సిద్ధమైంది. దీంతో అధిక దిగుబడులిచ్చే, చీడపీడలు, వాతావరణ మార్పుల ప్రభావాన్ని సమర్థంగా తట్టుకోగల కొత్త వంగడాల సృష్టికి మార్గం సుగమైంది. ఇక్రిశాట్ 2013లో ‘కాబూలీ చనా’అని పిలిచే ఒక రకం శనగల జన్యుక్రమాన్ని విజయవంతంగా నమోదు చేసింది. చదవండి: Stress Relief:: నువ్వులు.. గుడ్లు.. శనగలు..షెల్ఫిష్! అయితే మరిన్ని రకాల జన్యుక్రమాలను కూడా నమోదు చేయడం ద్వారా శనగల పుట్టు పూర్వోత్తరాల గురించి పూర్తిగా తెలుసుకునేందుకు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. దాదాపు 3,366 శనగ రకాలను ఎంపిక చేసి వాటన్నింటి జన్యుక్రమాలను నమోదు చేసి, విశ్లేషణ జరిపింది. ఫలితంగా శనగల్లో దాదాపు 29,870 జన్యువులు ఉంటాయని స్పష్టం కాగా ఇందులో 1,582 జన్యువులను మొదటిసారి గుర్తించారు. చదవండి: ఇక్రిశాట్ మరో అద్భుతం.. కరువు తట్టుకునేలా.. మధ్యధరా ప్రాంతంలో పుట్టుక.. ‘సిసెర్ రెటిక్యులాటమ్’అనే అడవిజాతి మొక్క నుంచి దాదాపు 12,600 ఏళ్ల కింద శనగలు పుట్టుకొచ్చాయని ఇక్రిశాట్ సంపూర్ణ జన్యుక్రమ విశ్లేషణ ద్వారా తేలింది. ఫర్టైల్ క్రెసెంట్‌గా పిలిచే ప్రస్తుత ఇజ్రాయెల్, ఇరాక్, సిరియా ప్రాంతంలో పుట్టిన ఈ పంట కాలక్రమంలో టర్కీ మీదుగా మధ్యధరా ప్రాంతానికి, దక్షిణాసియా, తూర్పు ఆఫ్రికా ప్రాంతాలకు రెండు మార్గాల్లో విస్తరించింది. ప్రయోజనాలేమిటి? శనగల సంపూర్ణ జన్యుక్రమం నమోదు కారణంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ప్రొటీన్ వనరుగా శనగల కోసం డిమాండ్ పెరగనుంది. వేర్వేరు రకాల జన్యుక్రమాలను ఈ సంపూర్ణ జన్యుక్రమంతో పోల్చి చూడటం ద్వారా పంట దిగుబడులపై ప్రతికూల ప్రభావం చూపుతున్న జన్యువులను గుర్తించడం సులువు కానుంది. చెడు జన్యువులను తగ్గించి.. మంచి జన్యువుల పనితీరును మెరుగుపరిస్తే మంచి లక్షణాలున్న శనగల వంగడాలను అభివృద్ధి చేయొచ్చు. మంచి జన్యువులను చొప్పిస్తే కొత్త వంగడాల్లో వచ్చే తేడాను కంప్యూటర్ మోడలింగ్ ద్వారా పరిశీలించారు. దీని ప్రకారం శనగల దిగుబడికి కొలమానంగా చూసే వంద విత్తనాల బరువు 12 నుంచి 23 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. పుష్టికరంగా మార్చేందుకు ‘శనగ పంట దిగుబడిని పెంచేందుకు మాత్రమే కాదు. శనగలను మరింత పుష్టికరంగా మార్చేందుకు ఈ సంపూర్ణ జన్యుక్రమం చాలా ఉపయోగపడుతుంది.’ – ప్రొఫెసర్ రాజీవ్ వార్ష్నీ, రీసెర్చ్ ప్రోగ్రామ్ డైరెక్టర్, ఇక్రిశాట్ పరిశోధనలు కొనసాగిస్తాం ‘దశాబ్ద కాలంలో శనగలకు సంబంధించిన పలు జన్యుపరమైన వనరులను ఇక్రిశాట్ అందుబాటులోకి తెచ్చింది. రైతులు, వినియోగదారులు, దేశాలకు ఎంతో ప్రయోజనకరమైన శనగ పరిశోధనలను కొనసాగిస్తాం’. –డాక్టర్ జాక్వెలీన్ హ్యూగ్స్, డైరెక్టర్ జనరల్, ఇక్రిశాట్ -
ఇక్రిశాట్ మరో అద్భుతం.. కరువు తట్టుకునేలా..
ఇక్రిశాట్ సంస్థ నుంచి మరో అద్భుతం ఆవిష్కృతమైంది. ఉష్ణమండల ప్రాంతాల్లో కఠిన పరిస్థితులను తట్టుకుంటే అధిగ దిగుబడి ఇచ్చే నూతన వంగడాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ సీజన్ నుంచే ఈ విత్తనాలు రైతులకు అందుబాటులోకి రానున్నాయి. ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమి అరిడ్ ట్రోపిక్ (ఇక్రిశాట్), హైదరాబాద్ నుంచి శనగల సాగుకు సంబంధించి మూడు నూతన వంగడాలను రూపొందించింది. ఈ నూతన వంగడాలు కరువు నేలలను తట్టుకోవడంతో పాటు రోగాలను సమర్థంగా ఎదుర్కొని అధిగ దిగుబడులు ఇస్తాయని ఇక్రిశాట్ తెలిపింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్), ఇక్రిశాట్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన బీజీ 4005, ఐపీసీ ఎల్4-14, ఐపీసీఎంబీ 19-3 రకం విత్తనాలకు సెంట్రల్ వెరైటల్ రీసెర్చ్ కమిటీ ఆమోద ముద్ర వేసినట్టు ఇక్రిశాట్ కార్యదర్శి త్రిలోచన్ మహాపాత్ర తెలిపారు. సాధారణంగా కరువు సంభవించే ప్రాంతాల్లో మెట్ట భూముల్లోనే శనగలు సాగు చేస్తుంటారు. కరువు కారణంగా ప్రతీ ఏడు 60 శాతం దిగుబడి తగ్గిపోతుంది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన వంగడాలు కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొని అధిక దిగుబడి ఇస్తాయని ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు తెలిపారు. చదవండి: రక్తపుమడుగులో వ్యక్తి, చోద్యం చూస్తూ మనుషులు! ఎమర్జెన్సీ అలర్ట్‌తో కాపాడిన స్మార్ట్‌వాచ్ -
బరువు తగ్గేందుకు భరోసా!
-
కొలెస్ట్రాల్, గుండెకూ ‘చిరు’ రక్షణ! ఇక్రిశాట్ కొత్త స్టడీ
సాక్షి, హైదరాబాద్: చిరుధాన్యాలు రుచిగా ఉండటమే కాకుండా బరువు తగ్గేందుకు దోహదపడతాయని ఇటీవలే నిర్ధారించిన మెట్టప్రాంత పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్) తాజాగా మరో కొత్త విషయాన్ని గుర్తించింది. చిరుధాన్యాలను తరచూ తినడం వల్ల శరీరంలోని మొత్తం కొలెస్ట్రాల్‌తో పాటు, హానికారక ట్రైగ్లిజరైడ్స్ మోతాదునూ తగ్గిస్తాయంది. వివిధ దేశాలకు చెందిన ఐదు సంస్థలు ఇక్రిశాట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అధ్యయయనంలో ఇప్పటికే జరిగిన 19 పరిశోధనల ఫలితాలను విశ్లేషించారు. ఫలితాలను ఫ్రాంటియర్స్ ఆఫ్ న్యూట్రిషన్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న ఊబకా యం, మధుమేహం, గుండె జబ్బులను ఆహారంతోనే నివారించే అవకాశాన్ని చిరుధాన్యాలు ఇస్తున్నందున వీటికి మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో తాము వాటి శాస్త్రీయ విశ్లేషణ చేపట్టామని ఇక్రిశాట్ తెలిపింది. చెడు కొవ్వులకు చెక్.. చిరుధాన్యాలను తరచూ తిన్నవారిలో మొత్తం కొలెస్ట్రాల్ మోతాదు 8% వరకు తగ్గిందని, అదే సమయంలో హానికారక లోడెన్సిటీ లిపోప్రోటీన్ కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్), ట్రైగ్లిజరాల్ కూడా 10% వరకు తగ్గినట్లు ఈ అధ్యయనం ద్వారా తెలిసింది. ఫలితంగా అధ్యయనం చేసిన వ్యక్తుల కొవ్వు మోతాదులు అసాధారణ స్థాయి నుంచి సాధారణ స్థాయికి చేరాయని, పైగా చిరుధాన్యాలతో డయాస్టోలిక్ రక్తపోటు కూడా 7% వరకు తగ్గినట్లు అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ఎస్.అనిత తెలిపారు.బరువు తగ్గేందుకే కాకుండా గుండెకూ మేలు ∙చిరుధాన్యాలపై ఇక్రిశాట్ అధ్యయనంలో వెల్లడి తిండే కారణం: డాక్టర్ హేమలత గుండెజబ్బులు, మధుమేహం వంటివి పెరిగేందుకు అనారోగ్యకరమైన ఆహారం ప్రధాన కారణమని, చిరుధాన్యాలను తినడం ద్వారా ఈ సమస్యను కొంతమేరకైనా అధిగమించొచ్చని ఇక్రిశాట్ అధ్యయనంలో భాగం వహించిన జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) డైరెక్టర్ డాక్టర్ ఆర్.హేమలత తెలిపారు. భారతీయుల ఆహారంలో చిరుధాన్యాలు ప్రధాన భాగం అయ్యేందుకు తద్వారా మధుమేహం, గుండెజబ్బులను తగ్గించేందుకు ఈ అధ్యయనం సాయపడుతుందని అన్నారు. కాగా, మెరుగైన వంగడాలు రూపొందిస్తే చిన్న, సన్నకారు రైతులకు మేలు జరుగుతుందని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జాక్వెలిన్ హ్యూగ్స్ తెలిపారు. ఇక్రిశాట్, ఎన్‌ఐఎన్‌తో పాటు యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్, న్యూట్రిషన్ అండ్ హెల్త్ (యూకే), జపాన్‌కు చెందిన కోబెయూనివర్సిటీలు ఈ అధ్యయనంలో పాలుపంచుకున్నాయి. -
తృణధాన్యాలతో మధుమేహానికి చెక్!
సాక్షి, హైదరాబాద్: మధుమేహంతో బాధపడుతున్న వారికి శుభవార్త. కొర్రలు, జొన్నలు, రాగుల వంటి తృణధాన్యాలను ఆహారంగా తీసుకుంటే టైప్–2 మధుమేహాన్ని నియంత్రించొచ్చని ఇక్రిశాట్ (మెట్టప్రాంత పంటల పరిశోధన కేంద్రం)తో పాటు అంతర్జాతీయ సంస్థలు నిర్వహించిన అధ్యయనం స్పష్టం చేసింది. మధుమేహం బారినపడని వారికి కూడా ప్రయోజనమేనని 11 దేశాల్లో జరిగిన పరిశోధనల ఆధారంగా జరిగిన ఈ అధ్యయనంలో తేలింది. ఫ్రాంటీయర్స్ ఇన్ న్యూట్రీషన్ జర్నల్ సంచికలో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి. 15 శాతం తగ్గుదల: తృణ ధాన్యాలను ఆహారం గా తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ శాతం 12 నుంచి 15 శాతం వరకు (భోజనానికి ముందు, తర్వాత) తగ్గుతుందని తెలి సింది. అలాగే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు డయాబెటిస్ వచ్చినప్పటి కంటే రాకముందు స్థాయికి తగ్గిపోయినట్టు గుర్తించారు. ప్రీ డయాబెటిక్‌లో ఉన్నవారి హెచ్‌బీఏ1 సీ (హీమోగ్లోబిన్‌కు అతుక్కున్న గ్లూకోజ్) మోతాదుల్లోనూ 17 శాతం తగ్గుదల నమోదైందని చెబుతున్నారు. 80 అధ్యయనాల సారాంశం: మధుమేహంపై తృణధాన్యాల ప్రభావాన్ని మదింపు చేసేందుకు ఈ అధ్యయనాన్ని నిర్వహించిన శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రచురితమైన 80 అధ్యయనాలను పరిశీలించారు. ‘తృణధాన్యాల ప్రభావం మధుమేహంపై ఎలా ఉంటుందో ఇప్పటివరకు ఎవరూ శాస్త్రీయంగా పరి శోధించలేదు. ఈ నేపథ్యంలో పద్ధ తి ప్రకారం అన్ని అధ్యయనాలను సమీక్షించాలని తాజాగా ఈ ప్రయత్నం చేశాం’అని ఇక్రిశాట్ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ ఎస్.అనిత తెలిపారు. తృణధాన్యాలే పరిష్కారం ‘అనారోగ్యం, పోషకాల లోపం వంటి సమ స్యలకు తృణధాన్యాలను ఆహారంగా తీసుకోవడమే పరిష్కారం. ఆహారం ద్వారా మరిన్ని పోషకాలు అందించేందుకు పరిశోధనలు చేపట్టాల్సి ఉంది. స్మార్ట్‌ఫుడ్ పేరుతో ఇక్రిశాట్ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఈ అధ్యయ నాన్ని నిర్వహించాం. మధుమేహం మాత్రమే కాకుండా.. రక్తహీనత, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, కాల్షియం లోపాల వంటి అనేక సమస్యలకు తృణధాన్యాలకు ఉన్న సంబంధాన్ని ఈ ఏడాదే విడుదల చేస్తాం’ –జాక్వెలిన్ హ్యూగ్స్, ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ -
వందేళ్ల ప్రయోగంలో ఇక్రిశాట్!
సాక్షి, హైదరాబాద్: విత్తనం ఎంత కాలం బతుకుతుంది? ఈ ఆసక్తికరమైన ప్రశ్నకు సమాధానం వెతికేందుకు ప్రయత్నం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్) సహా ఆరు అంతర్జాతీయ సంస్థలు ఇందుకోసం స్వాల్‌బోర్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్‌లో పదమూడు రకాల విత్తనాలను వందేళ్ల ప్రయోగాల కోసం నిల్వ చేయనున్నాయి. భవిష్యత్తులో ప్రపంచం మొత్తమ్మీద ఏదైనా పంటను మళ్లీ పునరుద్ధరించేందుకు ఏం చేయాలన్నది ఈ ప్రయోగం ద్వారా తెలుస్తుందని అంచనా. ఇక్రిశాట్‌తోపాటు ఇతర సంస్థల్లోని విత్తన జన్యుబ్యాంకులు ఈ ప్రయో గంలో పాల్గొంటున్నాయి. మొత్తం 13 రకాల విత్తనాలను స్వాల్‌బోర్డ్‌లోని విత్తన బ్యాంకులో నిల్వ చేయనుండగా ఇందులో నాలుగింటిని ఇక్రిశాట్ సమకూర్చనుంది. వేరుశనగ, జొన్న, కంది, శనగ పంటలను ఇక్రిశాట్ అందజేయనుందని, ప్రయోగం 2022 –23లో మొదలవుతుందని ఇక్రిశాట్లోని ఆర్.ఎస్.పరోడా జీన్‌బ్యాంక్ అధ్యక్షుడు డాక్టర్ వానియా అజెవీడో ఒక ప్రకటనలో తెలిపారు. విత్తన బ్యాంకులో విత్తనాలను –18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లో నిల్వ చేస్తారని, పదేళ్లకు ఒకసారి విత్తనాలను వెలికితీసి పరిశీలించి మళ్లీ నిల్వ చేస్తారని వివరించారు. రానున్న మూడేళ్లలో మిగిలిన సంస్థలు మరిన్ని విత్తనాలను నిల్వ చేయనున్నాయి. వీటిలో వరి, మొక్కజొన్న, సోయాబీన్, టిమోతీ విత్తనాలుంటాయి. -
ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్‌గా జాక్వెలీన్ హ్యూగ్స్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్) కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జాక్వెలిన్ డీ అరోస్ హ్యూగ్స్ గురువారం బాధ్యతలు చేపట్టారు. బ్రిటన్‌కు చెందిన హ్యూగ్స్ మైక్రో బయాలజీ, వైరాలజీల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. 1990లలో కోకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పనిచేసేందుకు ఆఫ్రికాలోని ఘనా దేశానికి వెళ్లిపోయారు. అక్కడి నుంచి నైజీరియాలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ అగ్రికల్చర్లో కొంతకాలం పనిచేశారు. (అంతటితో ‘ఆగ’లేదు! ) తైవాన్‌లోని వరల్డ్ వెజిటబుల్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా పనిచేసిన హ్యూగ్స్, ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లోనూ అదే హోదాలో పనిచేశారు. తాజాగా రైస్ రీసెర్చ్ సెంటర్ నుంచి ఇక్రిశాట్‌కు మారారు. ప్రయాణాలపై నిషేధమున్న నేపథ్యంలో హ్యూగ్స్ ఫిలిప్పీన్స్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇక్రిశాట్ బాధ్యతలు చేపట్టడమే కాకుండా.. తన ప్రాథమ్యాల గురించి వివరించారు. కరోనా విషయంలో ఇక్రిశాట్ ఎక్కడ అవసరమైతే అక్కడ సాయం అందించాలని హ్యూగ్స్ స్పష్టంచేశారు. మెట్ట ప్రాంతాల్లో పంటల ఉత్పాదకతను పెంచేందుకు ఇక్రిశాట్ తన ప్రయత్నాలను కొనసాగిస్తుందని తెలిపారు. (మన్ను.. మన్నిక ఇక్రిశాట్ చెప్పునిక!) -
ఆధునిక శోధనం.. అవసరానుగుణ విత్తనం
ఒకపక్క జనాభా పెరిగిపోతోంది.. వాతావరణ మార్పుల ప్రభావం ముంచుకొస్తోంది.. కానీ.. అందుబాటులో ఉన్న సాగుభూమి పెరగదు సరికదా.. దిగుబడులూ తగ్గిపోయే ప్రమాదమూ వెన్నాడుతోంది.ఈ వీటిని పరిష్కరించే లక్ష్యంతో అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్) ఓ వినూత్న కార్యక్రమం చేపట్టింది.మన అవసరాలకు తగ్గ కొత్త పంటలను అభివృద్ధి చేసేందుకు పట్టే సమయాన్ని సగానికి తగ్గించేందుకు.. వంగడ అభివృద్ధి ఆధునికీకరణను చేపట్టింది. ఆ పరిశోధనలేమిటో తెలుసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి నేతృత్వం వహిస్తున్న శాస్త్రవేత్త యాన్ దబానేను ‘సాక్షి’ సంప్రదించింది.. ఇవీ ఆ వివరాలు... ప్రశ్న: వంగడాల అభివృద్ధి ప్రక్రియను ఆధునికీకరించాలనే ఇక్రిశాట్ నిర్ణయం వెనుక ఉద్దేశం? జవాబు: ఒక్కమాటలో చెప్పాలంటే.. కొత్త, వినూత్న లక్షణాలున్న వంగడాలను వేగంగా అభివృద్ధి చేయడమే. అంతర్జాతీయ స్థాయిలో కొన్ని విత్తన కంపెనీలు విజయవంతంగా వాడిన సాంకేతికత, పద్ధతులను సామాన్య రైతులకు అందుబాటులోకి తేవాలని ఇక్రిశాట్ ఈ విత్తన ఆధునికీకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. నగరంలోని ఇక్రిశాట్ ప్రధాన కేంద్రంలో ‘ర్యాపిడ్‌జెన్’ పేరిట ప్రారంభించిన వ్యవస్థ ఈ దిశగా వేసిన తొలి అడుగు. ప్ర: ‘ర్యాపిడ్‌జెన్’ వ్యవస్థ తొలి అడుగు అంటున్నారు. ఇంకా ఎలాంటి సాంకేతికత, పద్ధతులు దీంట్లోకి చేర్చవచ్చు? జ: చాలా ఉన్నాయి. పంటలకు సంబంధించి నాణ్యమైన సమాచారం రాబట్టేందుకు ‘ర్యాపిడ్‌జెన్’ఉపయోగపడుతుంది. విత్తనోత్పత్తికి, పంట దిగుబడి, నాట్లకు చెందిన కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేయవచ్చు. చీడపీడలను తట్టుకోవడంతోపాటు కరవు కాటకాలను, విపరీతమైన వేడిమిని ఓర్చుకునే పంటలు, మంచి పోషకాలు ఇవ్వగల వంగడాలను అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే అందుబాటులో ఉన్న మాలిక్యులర్ మార్కర్ టెక్నాలజీలను (కణస్థాయిలో మార్పులు చేయడం ద్వారా మొక్కల లక్షణాలను నియంత్రించడం) కూడా ఇందులో వాడుకోవచ్చు. ప్ర: ఇక్రిశాట్ చేపట్టిన వంగడ ఆధునికీకరణ పూర్తయ్యేందుకు ఎంత సమయం పడుతుంది? జ: సాంకేతికత అనేది కాలంతోపాటు అభివృద్ధి చెందుతుంటాయి. కాబట్టి నిర్దిష్టంగా ఇంత సమయం అని చెప్పలేము.ఎప్పటికప్పుడు మరింత వృద్ధి చేసేందుకు ఎప్పుడూ అవకాశం ఉంటుంది.‘ర్యాపిడ్‌జెన్’ద్వారా చేపట్టిన కొన్ని కార్యక్రమాలను రానున్న రెండేళ్లలోనే రైతులకు అందుబాటులోకి తేవచ్చు. ప్ర: మీరు అమలు చేయబోయే టెక్నాలజీలపై ఏవైనా అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం ఉందా? జ: అలాంటిదేమీ లేదు. వంగడ అభివృద్ధి ఆధునికీకరణలో ఉపయోగిస్తున్న టెక్నాలజీలన్నీ ఇప్పటికే ఇతర ప్రాంతాల్లో విజయవంతంగా అమల్లో ఉన్నాయి.ఇక్రిశాట్ వాణిజ్య భాగస్వాములు కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. వీటిలో ఎక్కడా ఎలాంటి వ్యతిరేక పరిణామాలు సంభవించలేదు. ప్ర: ఇక్రిశాట్ ప్రధానంగా ఆరు పంటల (రాగి, సజ్జ, జొన్న, కంది, శనగ, వేరుశనగ)పై మాత్రమే పనిచేస్తోంది.వంగడ అభివృద్ధి ఆధునికీకరణను ఇతర పంటలకు విస్తరించే ఆలోచన ఏదైనా ఉందా? జ: ఇక్రిశాట్ అంతర్జాతీయ స్థాయిలో వేర్వేరు ప్రభుత్వ పరిశోధన సంస్థలతోనూ కలిసి పనిచేస్తోంది. భారత్‌లో ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్‌తోపాటు అంతర్జాతీయ మొక్కజొన్న, గోధుమ అభివృద్ధి కేంద్రం, అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం, ప్రపంచ కాయగూరల కేంద్రాలు వీటిలో ఉన్నాయి. మొక్కల అభివృద్ధికి ఇక్రిశాట్ ఈ సంస్థలకు తన దగ్గరున్న ఆరు పంటల జెర్మ్ప్లాసమ్ను సరఫరా చేస్తుంది. ఆయా సంస్థలు ఇతర పంటలపై కూడా పరిశోధనలు చేసుకుంటాయి. హైదరాబాద్‌లోని ఇక్రిశాట్ కేంద్రంలో ఇతర సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. ప్ర: చిన్న, సన్నకారు రైతులకు ఈ కార్యక్రమం ఎలా ఉపయోగపడుతుంది? జ: వాతావరణ మార్పుల నేపథ్యంలో చిన్న, సన్నకారు రైతులు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. చీడపీడల సమస్య పెరిగిపోనుంది. మారుతున్న వాతావరణాన్ని తట్టుకోగల వంగడాల అవసరం మునుపటి కంటే ఇప్పుడు ఎక్కువగా ఉంది. ఇక్రిశాట్ చేపట్టిన వంగడ అభివృద్ధి ఆధునికీకరణ ద్వారా వీటికి వేగం గా పరిష్కారాలు లభించే అవకాశాలున్నాయి. -
ఇక తక్కువ సమయంలోనే కొత్త వంగడాల సృష్టి
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయం కొత్త పుంతలు తొక్కేందుకు హైదరాబాద్‌లోని అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్) వేదిక కానుంది. ర్యాపిడ్‌జెన్ పేరు గల ఈ వ్యవస్థ సాయంతో ఇప్పటివరకూ పది పన్నెండేళ్ల సమయం పట్టే కొత్త వంగడాల సృష్టిని అతితక్కువ సమయంలో సాధించవచ్చునని, ప్రభుత్వరంగ సంస్థల్లో ఇలాంటి వ్యవస్థ ఏర్పాటు ఇదే తొలిసారని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ పీటర్ కార్‌బెరీ శుక్రవారం విలేకరులకు వివరించారు. ఇక్రిశాట్లోని జన్యుబ్యాంకులో మంచి లక్షణాలున్న పురాతన వంగడాలు చాలా ఉన్నాయని.. వాటిని వేగంగా రైతుల పొలాల్లోకి చేర్చేందుకు ర్యాపిడ్‌జెన్ ఉపయోగపడుతుందని వివరించారు. ఈ వ్యవస్థ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న సీనియర్ శాస్త్రవేత్త పూజా భట్నాగర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... ‘‘అధిక దిగుబడి నిచ్చే.. లేదా ఏ మంచి లక్షణంతో కూడిన వంగడాన్ని అభివృద్ధి చేయాలన్నా ఇప్పుడు ఏళ్ల సమయం పడుతుంది. ఆయా లక్షణాలున్న 2 వంగడాలను వేర్వేరు పద్ధతుల ద్వారా సంకరం చేసి మొక్కలను పెంచడం.. వాటిల్లో మనకు కావాల్సిన లక్షణాలు ఉన్న వాటిని వేరు చేసి మళ్లీ పెంచడం.. ఇలా సుమారు ఆరు నుంచి ఏడు తరాల పాటు మొక్కలు పెంచిన తరువాతగానీ మన అవసరాలకు తగిన లక్షణాలున్న వంగడం అభివృద్ధి కాదు. ఆ తరువాత వేర్వేరు వాతావరణ పరిస్థితుల్లో, నేలల్లో కొత్త వంగడాన్ని పండించి పరిశీలిస్తారు. ఆ తర్వాతే రైతులకు దాన్ని అందుబాటులోకి తెస్తారు. ఈ సుదీర్ఘకాలపు ప్రక్రియను కుదించేందుకు ర్యాపిడ్‌జెన్ ఉపయోగపడుతుంది. వాతావరణ పరిస్థితులు, పోషకాలు, వెలుతురు వంటి అన్నింటినీ కృత్రిమ పద్ధతుల్లో మొక్కలకు అందిస్తారు. మొక్కలు వేగంగా పుష్పించేలా.. విత్తనాలు ఇచ్చేలా చేస్తారు. తద్వారా ఒక్కో పంటకు ఏడాదిపాటు వేచి చూడాల్సిన అవసరం ఉండదు. 4 నెలల్లో పండాల్సిన ఖరీఫ్ పంట 50 రోజుల్లోనే పండిపోతుంది. పంటలను వేగంగా పండించి ఆ విత్తనాలను ఒకట్రెండేళ్లలోనే క్షేత్ర పరీక్షలకు సిద్ధం చేయవచ్చు’’అని తెలిపారు. ప్రస్తుతానికి తాము సంప్రదాయ వంగడ అభివృద్ధి ప్రక్రియను వేగంగా పూర్తి చేయడంపై మాత్రమే దృష్టి పెట్టామని, అత్యాధునిక జన్యు ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రైతులు, మార్కెట్ అవసరాలకు తగ్గ వంగడాలను సృష్టించేలా ర్యాపిడ్జెన్ను అభివృద్ధి చేస్తామని ఇక్రిశాట్ వంగడ అభివృద్ధి విభాగపు అంతర్జాతీయ అధ్యక్షుడు డాక్టర్ యాన్ దబానే తెలిపారు. -
మన్ను.. మన్నిక ఇక్రిశాట్ చెప్పునిక!
సాక్షి, హైదరాబాద్: భూఅంతరాల్లో దాగి ఉన్న పోషకాల రహస్యాన్ని ఛేదించేందుకు అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్) ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో అమలవుతున్న మిషన్ కాకతీయ ఫలితాలెలా ఉన్నాయన్న దానిపై దృష్టి సారించిన ఇక్రిశాట్ అభివృద్ధి కేంద్రం (ఐడీసీ) ఈ మేరకు ప్రక్రియ ప్రారంభించింది. దీనికోసం 90 గ్రామాల్లో మట్టి నమూనాలను సేకరించింది. ఇద్దరితో కూడిన ఎనిమిది బృందాలు ఇక్కడ పర్యటించి ప్రతి గ్రామంలో 11 నమూనాలను సేకరించాయి. ఇందులో 10 నమూనాలు రైతుల భూములవి కాగా, మిషన్ కాకతీయ కింద పునరుద్ధరించిన చెరువుల్లోని మట్టిని పోసిన భూముల్లో ఒక్కో నమూనా తీసుకున్నారు. ఈ నమూనాలను పరిశీలించి ఆయా భూముల్లోని పోషక విలువల వివరాలు, భూ క్షారత, మేలు చేసే మూలకాల వివరాలను సేకరించనున్నారు. ప్రస్తుతం ఈ నమూనాలు పరిశీలన దశలో ఉన్నాయని, పది రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తామని ఇక్రిశాట్ అధికారులు చెపుతున్నారు. కాగా, నమూనాల సేకరణకు వెళ్లినప్పుడు రైతులు తమ భూమిలోని పోషక విలువలను తెలుసుకునేందుకు ఉత్సాహం చూపించారని, వారి సహకారంతో సేకరణ 8 రోజుల్లో పూర్తి చేయగలిగామని ఇక్రిశాట్ సైంటిఫిక్ అధికారి అరుణ శేషాద్రి తెలిపారు. నమూనాల సేకరణకు ప్రత్యేక యాప్‌ను తయారుచేసి జీఐఎస్‌తో అనుసంధానం చేసినట్లు చెప్పారు. -
కత్తెర పురుగు కట్టడికి ప్రయత్నాలు షురూ!
సాక్షి, హైదరాబాద్: మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం చేస్తున్న కత్తెర పురుగు (ఫాల్ ఆర్మీ వర్మ్) నియంత్రణకు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం నడుం బిగించింది. దిగుబడిలో కనీసం 25–40% నష్టం చేయగల ఈ పురుగును గతేడాది కర్ణాటకలో తొలిసారి గుర్తించారు. అయితే ఇది ఏడాది కాలంలోనే దేశంలోని దాదాపు 8 రాష్ట్రాలకు విస్తరించడం.. మొక్కజొన్నతోపాటు 80 ఇతర పంటలకూ ఆశించగల సామర్థ్యం దీనికి ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్)లో బుధవారం ఒక సదస్సు జరిగింది. భారత వ్యవసాయ పరిశోధన సమాఖ్య (ఐసీఏఆర్)తోపాటు దేశంలోని అనేక ఇతర వ్యవసాయ పరిశోధన సంస్థలు, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ ప్రతినిధులు సదస్సులో పాల్గొన్నారు. ఈ పురుగు నియంత్రణకు ఏం చర్యలు తీసుకోవాలి? ఈ పురుగు విస్తరణ, ప్రభావం తదితర అంశాలపై విస్తృత స్థాయిలో పరిశోధనలు చేపట్టాలని తీర్మానించారు. హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ కేథరీన్ హడ్డా మీడియాతో మాట్లాడుతూ.. యూఎస్ఎయిడ్, సీఐఎంఎంవైటీ వంటి అంతర్జాతీయ సంస్థల సహకారంతో చేపట్టే ఈ పరిశోధనలతో సమీప భవిష్యత్తులోనే కత్తెర పురుగును నియంత్రించవచ్చునని.. తద్వారా చిన్న, సన్నకారు రైతులకు జరిగే నష్టాన్ని తగ్గించవచ్చని తెలిపారు. ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ త్రిలోచన్ మహాపాత్ర మాట్లాడుతూ.. కత్తెర పురుగు సమస్యను ఎదుర్కొనేందుకు కేంద్రం అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టిందని, అందుబాటులో ఉన్న సమాచారంతో రైతులు చేపట్టాల్సిన చర్యలను రాష్ట్రస్థాయి వ్యవసాయ అధికారులకు సమాచారం అందించడంతోపాటు ప్రభుత్వ స్థాయిలో విధానపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేశామన్నారు. రాత్రికి రాత్రే వందల కిలోమీటర్ల దూరాలను చేరగల ఈ పురుగుపై ఓ కన్నేసి ఉంచేందుకు, చీడ ఆశించిన ప్రాంతాలపై నివేదికలు తెప్పించుకునేందుకూ ఏర్పాట్లు చేశామన్నారు. అమెరికాకు పాతకాపే.. కత్తెర పురుగు అమెరికాలో మొక్కజొన్న విస్తృతంగా పండే ప్రాంతాల్లో దశాబ్దాలుగా ఉన్న కీటకమే. కాకపోతే మూడేళ్ల క్రితం దీన్ని తొలిసారి ఆఫ్రికా ఖండం లో గుర్తించారు. అమెరికాలోని కార్న్ బెల్ట్‌లో చలి వాతావరణాలను తట్టుకోలేక ఇవి దక్షిణ ప్రాంతాలకు వెళ్లేవని.. సీజన్లో మాత్రం మళ్లీ తిరిగి వచ్చేవని ఇంటర్నేషనల్ మెయిజ్ అండ్ వీట్ ఇంప్రూవ్మెంట్ సెంటర్ ప్రతినిధి డాక్టర్ ప్రసన్న తెలిపారు. మొక్కల ఆకులను చాలా వేగంగా తినేయగల, నష్టం చేయగల సామర్థ్యం కత్తెరపురుగు సొంతమని ప్రస్తుతానికి ఇది కేవలం మొక్కజొన్న పంటకే ఆశిస్తున్నా, ఇతర పంటలకూ ఆశించవచ్చునని, ఆసియాలోనూ వేగంగా విస్తరిస్తుండటంతో నియంత్రణ, నిర్వహణలు రెండూ అంతర్జాతీయ ప్రాముఖ్యతను సంపాదించుకున్నాయని అన్నారు. కార్యక్రమంలో ఇక్రిశాట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ కిరణ్ శర్మ పాల్గొన్నారు. -
కొత్త శనగ వంగడాల సృష్టికి మార్గం సుగమం!
సాక్షి, హైదరాబాద్: కరువు కాటకాలను తట్టుకుని ఎక్కువ దిగుబడులు ఇవ్వగల సరికొత్త శనగ వంగడాల అభివృద్ధికి మార్గం సుగమమైంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్) నేతృత్వంలో జరిగిన ఓ అంతర్జాతీయ పరిశోధన శనగలో మేలైన లక్షణాలను అందివ్వగల జన్యువులను గుర్తించారు. దాదాపు 45 దేశాల్లోని 429 రకాల శనగ పంటల జన్యుక్రమాన్ని విశ్లేషించడం ద్వారా శాస్త్రవేత్తలు అందులోని జన్యువైవిధ్యతను అంచనా వేయగలిగారు. శనగ మొట్టమొదట ఏ ప్రాంతంలో పుట్టింది? ఆసియా, ఆఫ్రికాల్లోకి ఎలా ప్రవేశించిందన్న విషయాలనూ తెలుసుకోగలిగారు. సుమారు 200 ఏళ్ల క్రితం మధ్యదరా ప్రాంతం నుంచి ఈ శనగ పంట అఫ్గానిస్తాన్ మీదుగా భారత్‌కు వచ్చింది. అదే సమయంలో ప్రపంచానికి ఈ పంట మధ్యదరా ప్రాంతం నుంచి కాకుండా మధ్యాసియా లేదా తూర్పు ఆఫ్రికా ప్రాంతం నుంచి విస్తరించడం గమనార్హం. శనగ జన్యుక్రమాన్ని నిర్దిష్ట లక్ష్య సాధన కోసం పునఃసమీక్షించడంలో ఇదే అతిపెద్ద పరిశోధన. దీనిద్వారా లభించిన సమాచారంతో వర్షాభావం, అధిక ఉష్ణోగ్రతలు, చీడపీడలను తట్టుకునే కొత్త వంగడాలను సృష్టించడం సులువు కానుంది. మూడేళ్లు శ్రమపడి శాస్త్రవేత్తలు జరిపిన ఈ అధ్యయనం వివరాలు నేచర్ జెనిటిక్స్ ఆన్లైన్లో ప్రచురితమయ్యాయి. పప్పు ధాన్యాలకు దేశం లో డిమాండ్ ఉన్నప్పటికీ సాగు, దిగుబడులు లేవు. ఈ నేపథ్యంలో భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలనేకం ఈ అంతర్జాతీయ పరిశోధనలో పాలుపంచుకున్నాయి. 90 శాతం సాగు ఇక్కడే.. ప్రపంచవ్యాప్త శనగ సాగులో దక్షిణాసియా ప్రాంతం వాటా దాదాపు 90 శాతం. అయితే వర్షాభావం, ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కారణంగా దిగుబడులు తగ్గిపోతున్నది కూడా ఇక్కడే ఎక్కువ. ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కారణంగా రబీ సీజన్ పంట అయిన శనగకు నష్టమెక్కువగా జరుగుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు తాము గుర్తించిన ఆర్‌ఇఎన్–1, 3–గ్లుకనేస్, ఆర్ఈఎఫ్ 6 జన్యువులు, ఉపయోగపడతాయని, వీటిని నియంత్రించడం ద్వారా పంటలు 38 డిగ్రీ సెల్సియస్ వేడిని తట్టుకోవడమే కాకుండా ఎక్కువ దిగుబడి సాధించవచ్చునని ఇక్రిశాట్ శాస్త్రవేత్త, అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ రాజీవ్ వార్‡్షణీ తెలిపారు. అంతర్జాతీయ బృందం అధ్యయనం కారణంగా శనగకు సంబంధించి అనేక కొత్త విషయాలు తెలిశాయని, వీటి ఆధారంగా వాతావరణ మార్పులను తట్టుకునే కొత్త వంగడాలను ఉత్పత్తి చేయవచ్చునని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ పీటర్ కార్బెర్రీ తెలిపారు. ఈ పరిశోధన రైతులకు మరింత ఆదాయం తెచ్చిపెడుతుందని, ఇక్రిశాట్ లాంటి సంస్థతో కలసి పనిచేయడం తమకు ఎంతో సంతోషాన్నిచ్చిందని గ్లోబల్ క్రాప్ డైవర్సిటీ ట్రస్ట్ (జర్మనీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేరీ హాగా హర్షం వ్యక్తంచేశారు. ఈ పరిశోధనలో బీజీఐ (చైనా), ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఏఆర్ఐ), ఫ్రెంచ్ నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ (ఐఆర్డీ, ఫ్రాన్స్), ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్), యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ (బెంగళూరు)లతోపాటు కీనా, ఇథియోపియా, కొరియా, అమెరికా, మెక్సికో, ఆస్ట్రేలియాలకు చెందిన పలు పరిశోధన సంస్థలు పాల్గొన్నాయి. -
‘కాకతీయ’పై ఇక్రిశాట్ అధ్యయనం
సాక్షి, హైదరాబాద్: ఐదు దశల ‘మిషన్ కాకతీయ’ ఫలితాలు, ప్రభావాలపై అధ్యయనం చేసేందుకు అంతర్జాతీయ సంస్థ ఇక్రిశాట్‌తో నీటిపారుదల శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. సచివాలయంలోని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కార్యాలయంలో ఈ మేరకు శుక్రవారం ఒప్పందంపై సంతకాలు జరిగాయి. మంత్రి హరీశ్ సమక్షంలో ప్రభుత్వం తరఫున కాడా కమిషనర్ మల్సూర్, ఇక్రిశాట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కిరణ్ శర్మ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం కింద రెండేళ్ల పాటు మిషన్ కాకతీయ ఫలితాలు– వాటి ప్రభావంపై ఇక్రిశాట్ అధ్యయనం చేసి, ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది. చెరువు మట్టి ద్వారా రైతులు ఎలాంటి లాభాలు పొందారు, పంట దిగుబడి ఎంత పెరిగిందన్న అంశాలను ఈ అధ్యయనంలో పరిశీలించనున్నారు. చెరువుల పునరుద్ధరణ జరిగిన ప్రాంతాల్లో భూగర్భ జలాల పెంపు జరిగిన తీరును ఇక్రిశాట్ అధ్యయనం చేయనుంది. చెరువు మట్టి ద్వారా పంట దిగుబడి మాత్రమే కాకుండా రైతుకు ఆర్థికంగా చేకూర్చిన లాభాలను ఇక్రిశాట్ పరిశీలనలోకి తీసుకోనుంది. ఇక్రిశాట్‌తో ఒప్పందం సంతోషకరం ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో గత కొన్ని దశాబ్దాలుగా వ్యవసాయ పరిశోధనలు చేస్తున్న ఇక్రిశాట్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న ప్రతిష్టాత్మక సంస్థలతో సాగునీటి శాఖ కలసి పని చేస్తోందన్నారు. ఇరిగేషన్ సమాచార వ్యవస్థను రూపొందించడానికి గతంలో ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకున్నామని, వారు రూపొందించిన సమాచార వ్యవస్థ ఆధారంగా ప్రభుత్వం గొలుసు కట్టు చెరువులను మేజర్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానం చేస్తున్నామని అన్నారు. వర్షాభావ సంవత్సరాల్లో కూడా చెరువులను నింపాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. సమగ్ర అధ్యయనం అనంతరం సూచనలు, సలహాలతో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. నీహాల్ చదువుకు ఆర్థిక సాయం నీటిపారుదల శాఖకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన నీహాల్కు మంత్రి హరీశ్‌రావు శుక్రవారం సచివాయంలో రూ.35 వేల చెక్‌ను అందజేశారు. మాస్టర్ నీహాల్ను సాగునీటి శాఖకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించి, ఆయన డిగ్రీ చదువు వరకు అయ్యే ఖర్చును సాగునీటి శాఖ భరిస్తుందని మంత్రి గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. -
అన్నదాతకు యాప్ అండ
’ప్లాంటిక్స్’తో రైతులకు మేలు తెగుళ్లు, నివారణ సూచనలు వెంటనే తెలుగులోనూ సమాచారం సహకారం అందిస్తున్న ఇక్రిశాట్ ఏలూరు (మెట్రో): మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పంటకు తెగుళ్ల బెడద ఎక్కువ ఉంటుంది. రైతు వెచ్చించే ఖర్చులో పురుగు మందులదే సింహభాగం. పంటలో తెగులు కనిపిస్తే చాలు ఏ మందులు పిచికారీ చేయాలో అర్థంకాక అన్నదాతలు ఆందోళన చెందుతుంటారు. దీంతో పంటలు పరిశీలించకుండానే వ్యాపారులు చెప్పిందే వేదంగా రైతులు పురుగుమందులు వాడేస్తున్నారు. వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు వచ్చి పంటను పరిశీలించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇలాంటి దీర్ఘకాలికంగా ఉన్న ఇబ్బందులు తీర్చేందుకు ప్రత్యేకంగా తెగుళ్ల నివారణలు సూచించేందుకు మొబైల్ యాప్‌ను ఇటీవల రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్లాంటిక్స్ (పిఎల్ఎఎన్టిఐఎఎక్స్) అనే ఈ యాప్ ద్వారా రైతులకు ఎంతగానో ఉపయోగపడనుంది. మారుతున్న ఆధునిక ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్లు అందుబాటులో ఉంటున్నాయి. ఓ ప్రయివేటు మొబైల్ కంపెనీ సర్వే ప్రకారం ప్రస్తుతం 80 శాతం మంది రైతుల వద్ద స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. ఇలాంటి వారికి ఈ నూతన యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పటికే లక్ష మందికి పైగా ఈ యాప్‌ను ఉపయోగించుకుని తెగుళ్ల సమాచారాన్ని గుర్తించగలుగుతున్నారని వ్యవసాయాధికారులు అంచనా. ఈ యాప్ జర్మనీ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఇది అక్కడ ఫలితాలు సాధించడంతో మన దేశంలోనూ అందుబాటులోకి తెచ్చేందుకు ఇక్రిశాట్ అధికారులు జర్మనీతో ఒప్పందం చేసుకున్నారు. మొదటిగా హిందీ భాషలో అందుబాటులోకి రాగా రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయశాఖ చొరవతో ఈ సంవత్సరం జూన్ నుండి తెలుగు భాషలో లభ్యమయ్యేలా రూపొందించారు. ప్రస్తుతం ఈ యాప్ డచ్, ఇంగ్లీషు, ఫ్రెంచ్, పోర్చుగీసు, హిందీ, తెలుగు భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. నిమిషాల్లో సమచారం: ఆండ్రాయిడ్ వెర్షన్లో ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అవ్వాలి. తర్వాత పంటల వారీగా ఆప్షన్లు కనిపిస్తాయి. ఏ పంటపై తెగుళ్ల సమాచారం కావాలో ఆ పంట ఐకాన్‌పై క్లిక్ చేస్తే కెమెరా తెరుచుకుంటుంది. చెట్టుకు తెగులు ఉన్న చోట ఫొటో తీసి ఆప్‌లోడ్ చేస్తే కొద్ది సేపటికే ఆ తెగులుకు సంబంధించిన వివరాలు, లక్షణాలు, పిచికారీ చేయాల్సిన మందుల వివరాలతో శాస్త్రవేత్తలుగానీ, అనుభవజ్ఞులైన రైతులు నుంచి కానీ సమాచారం వస్తుంది. సూచించిన మందులు తెచ్చుకుని పిచికారీ చేస్తే సరిపోతుంది. ఎంత మోతాదులో వాడాలో కూడా వివరాల్లో ఉంటుంది. దీనికి ఇంటర్నెట్ సదుపాయం తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుతం వరి, అరటి, కంది, గోధుమ, చిక్కుడు, టమాట, దానిమ్మ, పత్తి, బంగాళాదుంప, బొప్పాయి, మామిడి, పెసలు, మినుములు, మిర్చి, మొక్కజొన్న, వంకాయ, సెనగ, సోయాబీన్ వంటి 18 రకాల పంటలకు సంబంధించి ఐకాన్లు ఈ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇతర పంటలు అనే ఐకాన్ కూడా ఏర్పాటు చేయడంతో ఇతర పంటల వివరాల కోసం ఆ ఐకాన్‌ను ఎంచుకుంటే మిగిలిన పంటలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. జీపీఎస్ సహకారంతో వాతావరణ సూచనలు : వాతావరణ పరిస్థితులు, గాలిలో తేమ, వర్షపాతం, ఉష్ణోగ్రత, గాలి వేగం వంటి విషయాలు తెలుసుకునేందుకు ఈ యాప్‌లో ఆప్షన్లు ఉన్నాయి. మొబైల్ జీపీఎస్ ఆప్షన్ ఆన్‌చేస్తే ఆ ప్రాంతానికి సంబంధించిన వాతావరణ సమాచారం తెలుస్తుంది. -
పంటలకు ఇక్రిశాట్ భరోసా
⇒ చీడపీడల ఫొటో పంపిస్తే చాలు ఏ మందు వాడాలో సలహా ⇒ ఐ–హబ్ యాప్, వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేసిన ఇక్రిశాట్ సాక్షి, హైదరాబాద్: మీ పంటను చీడపీడలు ఆశించా యా? ఏ మందు వాడాలో అంతు చిక్కడం లేదా? అయితే చీడపీడలు ఆశించిన మొక్క ఫొటో తీసి ఐ–హబ్ యాప్‌లో అప్ లోడ్ చేసి ఇక్రిశాట్‌కు పంపండి. అంతే 24 గంటల్లో ఆ పంటకు ఏ పురుగుమందు, ఎరువు వాడాలో, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో సూచనలు పంపిస్తుంది. లక్షల మంది రైతులు ఫొటోలు తీసి పంపినా ఒక్క రోజులోనే శాస్త్రీయమైన సలహా రైతుకు అందుతుందని వ్యవసాయశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. ఆసియా ఖండంలో కోట్లాది రైతు లు పంపినా సలహా ఇచ్చే పరిజ్ఞానం ఇక్రిశాట్‌కు ఉందని ఆయన వెల్లడించారు. మూడు అంశాల్లో రైతుకు సేవలు... ప్రతిష్టాత్మక ఇక్రిశాట్ ఐ–హబ్ వెబ్సైట్, యాప్ వ్యవసాయానికి సంబంధించి మూడు అంశాలున్నాయి. విత్తనాలు, వాతావరణం, పంటలకు చీడపీడలు ఆశిస్తే ఏం చేయాలన్న అంశాలపై సేవలు అందించేందుకు అధికారు లు ఏర్పాట్లు చేశారు. అందుకు రిమోట్ సెన్సింగ్ వ్యవస్థతోనూ ఇక్రిశాట్ అనుసం« దానమైంది. వాతావరణ మార్పులను బట్టి పంటలను ఏ విధంగా రక్షించుకోవాలి? ఎలాంటి చర్యలు తీసుకోవాలో సలహా లిస్తారు. ఏ నేలలో ఎలాంటి విత్తనాలు వేయా లో సూచిస్తారు. నేల ఫొటోను, భూసారం వివరాలను అప్లోడ్ చేస్తే ఏ పంట వేయాలో ఇక్రిశాట్ తెలుపుతుంది. చీడపీడలు ఆశించి నప్పుడు మొక్కల ఫొటోను రైతులు ఎంత నాసిరకంగా తీసి పంపినా ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో స్పష్టంగా విశ్లేషిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా చెల్లించకుండా ఈ సేవలను ఇక్రిశాట్ అందించనుంది. వ్యవసాయ విస్తరణాధికారులు, ఎరువుల దుకాణదారులపై ఆధారపడకుండా పంటలు, ఎరువులకు ఈ యాప్ ద్వారా శాస్త్రీయమైన నిర్ణయానికి రైతులు రావడానికి వీలు కలుగుతుందని వారు చెబుతున్నారు. నాలుగైదు రోజుల్లో వర్క్‌షాప్‌ను వ్యవ సాయశాఖ నిర్వహించాలని యోచిస్తోంది. -
ఇక డిజిటల్ వ్యవసాయం
* ఇక్రిశాట్‌తో ఐటీ, వ్యవసాయశాఖల త్రైపాక్షిక ఒప్పందం * సన్న, చిన్నకారు రైతుల కోసం గ్రీన్ ఫ్యాబ్లెట్ ఆవిష్కరణ * ఉత్పాదకతను పెంచేందుకు దోహదం: కేటీఆర్ * సాంకేతిక ఫలాలు రైతులకు చేరాలి: పోచారం సాక్షి, హైదరాబాద్: డిజిటల్ ఇండియా, డిజిటల్ తెలంగాణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం డిజిటల్ వ్యవసాయానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో వ్యవసాయ, ఐటీశాఖ, ఇక్రిశాట్ల మధ్య త్రైపాక్షిక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు, వ్యవసాయమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సమక్షంలో ఇక్రిశాట్ డెరైక్టర్ జనరల్ డేవిడ్బెర్గ్ లెన్సన్, వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి, ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌రంజన్‌లు ఎంవోయూపై సంతకాలు చేశారు. అనంతరం గ్రీన్ ఫ్యాబ్లెట్‌ను మంత్రులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఇక్రిశాట్‌తో వ్యవసాయ, ఐటీ శాఖల మధ్య జరిగిన ఒప్పందం రైతులకు ఎంతో మేలు చేస్తుందని... టెక్నాలజీ ద్వారా మానవ వనరుల కొరతను అధిగమించి గ్రీన్ ఫ్యాబ్లెట్ ద్వారా గ్రామగ్రామాన రైతుకు కావాల్సిన సమాచారం అందించడానికి చర్యలు చేపడతామన్నారు. వివిధ రాష్ట్రాల్లో చేపడుతున్న వ్యవసాయ పద్ధతులను రాష్ర్టంలో రైతులకు వివరించాలని, సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించాలని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులతోపాటు సహకార సంఘాలను భాగస్వామ్యం చేసి రైతులకు సాంకేతికత ఉపయోగపడేలా చూస్తామని వివరించారు. మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతులకు లాభసాటి ధరలు రావడానికి... తమ ఉత్పాదకతను పెంచుకోవడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి త్రైపాక్షిక ఒప్పందం ఉపయోగపడుతుందన్నారు. అధికారులు గ్రామగ్రామాన ప్రచారం నిర్వహించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలని, అప్పుల్లేని తెలంగాణ రైతులుగా తీర్చిదిద్దాలని మంత్రి పోచారం సూచించారు. ఇక్రిశాట్ డెరైక్టర్ జనరల్ డేవిడ్బెర్గ్ లెన్సన్ మాట్లాడుతూ సాంకేతిక సమాచారం రెతులకు ఉపయోగమని... ప్రపంచవ్యాప్తంగా జరుగుతోన్న పరిశోధన ఫలాలు వారు వాడుకుని తద్వారా తమ ఉత్పాదకతను పెంచుకోవచ్చని అన్నారు. ప్రభుత్వంతో ఒప్పందం జరుపుకోవడం వల్ల రైతులు తమ ఉత్పత్తులకు మంచి మార్కెట్ పొందవచ్చని అన్నారు. కార్యక్రమంలో ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయశాఖ కమిషనర్ ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. -
'రైతుల కోసం ఫాబ్లెట్ టెక్నాలజీ'
హైదరాబాద్: రైతుల కోసం ఇక్రిసాట్‌తో కలిసి ఫాబ్లెట్ టెక్నాలజీ అందించనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. రైతులకు సంబంధించిన సమగ్ర సమాచారం ఈ ఫాబ్లెట్లో ఉంటుందని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అలాగే 'మీ సేవ' సర్వీసుల కోసం మొబైల్ ఆప్లికేషన్ రూపొందించినట్టు ఆయన చెప్పారు. అదేవిధంగా హైదరాబాద్‌లో సెప్టెంబర్ 18 నుంచి 21 వరకు ఇండియన్ గాడ్జెట్ షోలో 300 కంపెనీలు పాల్గొంటాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. -
జీవ ఎరువుల పై రోమ్‌వాసి అధ్యయనం
బచ్చన్నపేట(వరంగల్): భారత దేశంలో వాడుకలో ఉన్న సేంద్రియ, జీవ ఎరువుల వాడకం గురించి అధ్యయం చేసేందుకు రోమ్ దేశీయుడు వరంగల్ కు వచ్చారు. అధ్యయనంలో భాగంగా రోమ్కు చెందిన ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సీనియర్ డెరైక్టర్ రోబ్‌బోస్ బుధవారం వరంగల్ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా రోబ్ సేంద్రియ, జీవ ఎరువుల వాడకంపై రైతులతో చర్చించారు. అలాగే మహిళా సంఘాల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. జీవ ఎరువుల వాడకం వల్ల సాగు చేస్తున్న కూరగాయల దిగుబడుల గురించి ఆరా తీశారు. రోబ్ తో పాటు ఎన్ఆర్ఎల్ఎమ్ డెరైక్టర్ రాయుడు, ఇక్రిసాట్ శాస్త్రవెత్త హోమ్ రూపేలా ఉన్నారు. -
టిఫినీలు చేశారా.. స్పూన్లు తిన్నారా..
ఒక ఆలోచన మన జీవితాన్నే మార్చేయొచ్చు.. ఇతరులకు ప్రేరణగా నిలవొచ్చు.. సమాజానికి మేలూ చేయొచ్చు! పీసపాటి నారాయణరావుకి వచ్చిన ఆలోచన ఆయన జీవితాన్ని ఎంతవరకు మార్చిందో తెలియదు కానీ ఇతరులకు ప్రేరణ.. సమాజానికి మేలు చేస్తోంది! ఆ ఐడియా.. జొన్నపిండి బిస్కట్ స్పూన్స్ తయారు చేయడం. దీనికి.. సమాజహితానికి సంబంధం ఏంటో తెలుసుకునే ముందు ఆయన గురించి చిన్న పరిచయం.. - సరస్వతి రమ నారాయణరావు పూర్వాశ్రమంలో సైంటిస్ట్. కోల్‌కతాలో పుట్టిపెరిగిన తెలుగు వ్యక్తి. బరోడాలో పన్నెండేళ్లు పనిచేశాక హైదరాబాద్ ఇక్రిశాట్‌కు బదిలీ అయ్యాడు. ఇంటర్నేషనల్ వాటర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో కొలువు. అక్కడ తన ఆలోచనలను ఆచరణలో పెట్టే అవకాశం దొరుకుతుందని ఆశపడ్డాడు. అదే ఉత్సాహంతో గ్రౌండ్ వాటర్ డిప్లెషన్ మీద పరిశోధన చేశాడు. నేలలో నీటి నిల్వలు తగ్గుతున్నాయనగానే వర్షాభావం అనే సమాధానమే దొరుకుతుంది. కానీ, నారాయణరావు పరిశోధనల్లో మూడేళ్ల సగటు వర్షపాతం ఏమాత్రం తగ్గలేదు. సాగుభూమి పెరిగింది. ఈ లెక్కన జీడీపీలో వ్యవసాయం భాగస్వామ్యం కూడా పెరిగుండాలి, కానీ పెరగలేదు. అదే టైంలో రైతుల సంఖ్య తగ్గింది. ఈ రీసెర్చ్, రిజల్ట్స్ ఆధారంగా గ్రౌండ్ వాటర్ ఎస్టిమేషన్ మోడల్ని తయారు చేశాడు. నీటి నిల్వలు అడుగంటడానికి కారణమూ కనుక్కున్నాడు.. ‘8’ ఆకారంలో ఉన్న రెండు విషస్ సర్కిల్స్ అని. ఒకటి.. రైతులు మితిమీరిన కరెంటును వాడుకోవడం.. రెండు మితిమీరిన నీటిని ఉపయోగించడం. వీటిని సరిచేయాలంటే ఇనెఫిషియెంట్ ఇరిగేషన్ సిస్టమ్‌ను, ఇనెఫీషియెంట్ క్రాపింగ్ చాయిసెస్ను కరెక్ట్ చేసుకోవాలి. ఈ దిశగా పనిచేయడానికి ఉద్యోగ పరిమితులు అడ్డొచ్చాయి. ఎవరో వచ్చి ఏదో చేస్తారని వేచి చూడకుండా ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఇదీ ఆయన పరిచయం.. జొన్నపిండి బిస్కట్ స్పూన్స్ ఆలోచనకు ముందు విషయం! ఆలోచనకు కారణమైన సంఘటన.. రాజీనామా చేశాక ఇనెఫీషియెంట్ క్రాపింగ్ చాయిసెస్ను కరెక్ట్ చేసే ప్రయత్నంలో ఉండగా జొన్నపంట.. దానితో ఉన్న ఆరోగ్య లాభాలు ఆయన్ని బాగా ఆకర్షించాయి. ఎకరా వరికి సరిపోయే నీటితో 60 ఎకరాల జొన్నపంటను పండించొచ్చు. అంటే ఆరుతడి పంటలతో నీటి నిల్వలనూ పెంచొచ్చు. పూర్మెన్ క్రాప్‌గా జొన్నకున్న అపవాదునూ పడగొట్టి దాని డిమాండ్ పెంచాలనుకున్నాడు నారాయణ. ఆ టైమ్‌లోనే అతను దేశంలోని చాలా ప్రాంతాల్లో గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడానికి వెళ్లేవాడు. ఇదంతా 2004 నాటి సంగతి. ప్లాస్టిక్ వాడకం మీద అహ్మదాబాద్‌లో జరిగిన ఓ సెమినార్ ముగించుకుని ఫ్లయిట్లో హైదరాబాద్ వస్తున్నాడు. అంతకుముందు సెమినార్లో మాట్లాడిన విషయాల గురించి ఆలోచిస్తున్నాడు. ప్లాస్టిక్ వాడకం ఇంతలా పెరిగిపోయింది కదా.. ఎన్ని టన్నుల ప్లాస్టిక్ గార్బేజ్ తయారై ఉంటుందో! రైల్వేట్రాక్స్కి రెండు వైపులా పేరుకున్న ప్లాస్టిక్ గార్బేజ్ గుర్తొచ్చింది. హైదరాబాద్ వచ్చాక విద్యానగర్‌లోని తనింటి దగ్గరున్న చాట్ భండార్కెళ్లాడు. చాట్ తినడానికి అన్నీ ప్లాస్టిక్ స్పూన్సే. పక్కనే చెత్తకుండీ ఉంది. ఈ భండార్‌లో వాడిన ప్లాస్టిక్ స్పూన్స్ అన్నీ ఈ చెత్తకుండీలో ఉండాలి కదా అని పక్కనే ఉన్న చెత్త ఏరుకునే మనిషిని అందులో స్పూన్స్ ఏమైనా ఉన్నాయేమో చూడమన్నాడు. విరిగినవి తప్ప దొరకలేదు. అంటే అవన్నీ రీయూజ్ అవుతున్నాయన్నమాట. దిగ్భ్రాంతి కలిగింది నారాయణకు. అప్పుడు ఎప్పుడో అనుకున్న జొన్న పంటకు.. ప్లాస్టిక్‌కు ఒక లింక్ కుదిరినట్టనిపించింది. బేకీస్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ అలా సింక్రనైజ్ అయిన ఆలోచనే ‘బేకీస్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్’గా రూపొందింది. ఆరోగ్యకరమైన జొన్నపంట డిమాండ్ పెంచాలి. విషతుల్యమైన ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి. అందుకే జొన్నలను ప్లాస్టిక్‌కు అల్టర్నేటివ్గా మార్చుకున్నాడాయన. ఆ ధాన్యం పిండితో తయారైన బిస్కట్స్‌ను చెంచాల రూపంలో తయారు చేయడం మొదలుపెట్టాడు. ఈ పరిశ్రమలోకి ఆయన అడుగుపెట్టి ఏడేళ్లు. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆర్థికంగా కూడా. ఉన్న ఇంటినీ అందులోనే పెట్టాడు. ఈ తపనంతా ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అలవాటు చేయాలి. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. మొదట్లో ఈ చెంచాలు ఎవరినీ ఆకట్టుకోలేదు. కస్టమర్ల రుచి, అభిరుచి, ఉపయోగానికి అనుగుణంగా వీటిని మారుస్తూనే ఉన్నాడు. ఇప్పుడు.. జొన్న, రాగులు వంటి వాటి మీద జనాలకు అవగాహన పెరిగింది. ఇదివరకన్నా కాస్త డిమాండ్ ఉంది. ఈ బిస్కట్ చెంచాల ఉపయోగమూ ఊపందుకుంది. అందుకే ఇప్పుడు ఫోర్క్స్, డెజర్ట్ స్పూన్స్, లంచ్ స్పూన్స్, చాప్‌స్టిక్స్ తయారు చేస్తున్నాడు నారాయణ. ‘వీటిని ఉపయోగించి ఐస్‌క్రీమ్ కోన్స్‌లా తినేయొచ్చు. ప్లెయిన్, మసాలా, స్వీట్.. అనే మూడు ఫ్లేవర్స్‌లో ఈ జొన్నపిండి బిస్కట్ స్పూన్స్‌ని తయారు చేస్తున్నాం. ఉట్టి నుంచి కాటిదాకా అనే సామెతుంటుంది మన దగ్గర. నేను జొన్నలను వూంబ్ నుంచి గ్రేవ్ దాకా అని అభివర్ణిస్తాను. ఇందులోని పోషక విలువలు ప్రెగ్నెంట్ విమెన్‌కి చాలా మంచివి. ఈ జొన్నపిండి బిస్కట్ స్పూన్స్ పళ్లొచ్చే పిల్లలకు ఎంతో మేలు చేస్తాయి. అలాగే జొన్నల్లోని ఫోలిక్ యాసిడ్స్ టీనేజర్స్‌లో కలిగే హార్మోనల్ ఇన్బాలెన్స్ను కరెక్ట్ చేస్తాయి. చిన్నప్పటినుంచి జొన్నలు తినడం వల్ల మధుమేహం రాదు. కొలెస్ట్రాల్‌కు విరుగుడు. మరెన్నో లాభాలున్న ఈ జొన్నప్రొడక్ట్స్కు ఇంకా డిమాండ్ పెరగాలి. మార్కెటింగ్ జరగాలి. రైల్వేస్ వాళ్ల కేటరింగ్‌లో వీటిని వాడేలా చేయాలి. ఇప్పుడు నా లక్ష్యం అదే. ఈ పరిశ్రమ అభివృద్ధికి చాలా కష్టపడ్డాను. ఇప్పుడిప్పుడు మార్కెట్ కాస్త స్పందిస్తోంది. నేను చేస్తున్న పని రైతుకు ఆదాయం పెంచేది. ప్రపంచానికి చాలా అవసరం’అంటాడు నారాయణ. ఇన్ని ఉపయోగాలున్న ఈ బిస్కట్ స్పూన్ విలువ ఎంతో తెలుసా.. కేవలం మూడు రూపాయలే! -
బోదె పద్ధతిలో మొక్కజొన్న
ట్రాఫిక ల్టర్ సహజంగా రైతులు మొక్కజొన్న సాగు చేయడానికి పొలాలు దున్ని సాళ్లుగా చేసి సాళ్లలో విత్తనాలు చల్లి ఎదపెడతారు. ఇది పాత పద్ధతి. వర్షాలు అధికంగా కురిసినప్పుడు సాళ్లలో నీరు నిల్వ ఉండి విత్తనాలు దెబ్బతినే ప్రమాదం ఎక్కువ . ఒకవేళ వర్షాలు తక్కువగా ఉంటే.. మొక్కలకు నీరందక చనిపోయే ప్రమాదం ఉంది. వీటిని అధిగమించడానికి బోదె పద్ధతి మొక్కజొన్న సాగులో ఇక్రిశాట్ ప్రయోగాత్మకంగా చేపట్టింది. ఈ బోదెలు చేసే యంత్రాన్ని ట్రాఫికల్టర్ అంటారు. దీన్ని ట్రాక్టర్‌కు అమర్చి ఉపయోగించవచ్చు. బాడుగ భరించలేని రైతులు ఎడ్లతో లాగించి మొక్కజొన్న విత్తనాలు నాటుకోవచ్చు. ముందుగా బోదె పద్ధతిలో మొక్కజొన్న సాగు చేయాలనుకున్న పొలాన్ని ఎంచుకుంటారు. ఈ పద్ధతికి నల్లరేగడి నేలలు బాగా అనుకూలమైనవి. చేను ఎటు వైపు నుంచి ఎత్తుగా ఉంది. ఎటు వైపునకు పల్లంగా ఉం దో చూసుకుని ట్రాక్టరుకు బోదెలు చేసే యంత్రాన్ని తగిలించి నేలను సరిచేస్తారు. బోదెల మధ్య 1.5 మీటర్లు ఖాళీ ఉండే విధంగా సాళ్లు ఏర్పాటు చేస్తారు. అధిక వర్షాలు పడినప్పుడు బోదెలపై ఉన్న నీరు సాళ్లలోకి జారిపోవడమేగాక, సాళ్లలో ట్రాక్టర్లు, ఎడ్లు, చక్రా లు నడవడానికి కూడా పనికి వస్తాయి. ఈ పద్ధతిలో బోదెపై మూడు వరుసలు వస్తాయి. ఎకరానికి 28 వేల మొక్కలు పడతాయి. 8 కిలోల విత్తనాలు సరిపోతాయి. బోదెలు చేసిన తర్వాత విత్తనాలను యంత్రంతోనే నాటుతారు. బోదె పద్ధతి వల్ల ఉపయోగాలు బోదె పద్ధతిలో మొక్కజొన్న సాగు చేస్తే మామూలు విధానంలో కన్నా 20 శాతం అధికంగా దిగుబడి వస్తుందని ఇక్రిశాట్ పరిశోధనలో తేలింది. ఈ పద్ధతిలో మొక్కజొన్న, కంది, శనగ, వేరుశనగ, సోయాబీన్ సాగు చేసుకోవచ్చు. వర్షపాతం ఎక్కువగా ఉన్నప్పుడు పంట దెబ్బ తినకుండా బోదెలపైన ఉన్న నీరు వెంటనే సాళ్ల ద్వారా బయటకు వెళ్తుంది. వర్షపాతం తక్కువగా ఉన్నప్పుడు బోదెల్లో ఉన్న తేమ పంట దెబ్బతినకుండా కాపాడుతుంది. పొలం వాలు, ఎత్తు పల్లాలను కొలిచి బోదెలు చేసుకుంటాం కాబట్టి నేల కోతకు గురికాకుండా కాపాడుతుంది. బోదెల్లో నీరు ఇంకిపోయేలా చేయడం ద్వారా పంట బెట్టకు వచ్చే అవకాశం తక్కువ. =సాళ్ల మధ్య దూరం 18 అంగుళాలు ఉంటుంది. అదే మామూలు పద్ధతిలో సాగు చేస్తే 22 అంగుళాలు ఉంటుంది. దీని వల్ల స్థలం కలిసి వస్తుంది. బోదెలు పెరుగుతాయి. మొక్కల సంఖ్య పెరుగుతుంది -
ఇక్రిశాట్లో చిరుత!
- పట్టుకునేందుకు మూడు నెలలుగా ప్రయత్నం - రంగంలో దిగిన అటవీశాఖ - చిక్కినట్టే చిక్కి తప్పించుకుంటున్న వైనం - భయాందోళనలో సమీప ప్రాంతాల జనం రామచంద్రాపురం: ఇక్రిశాట్లో సంచరిస్తున్న చిరుత అధికారులకు చెమటలు పట్టిస్తోంది. తొలుత ఇక్రిశాట్లో చిరుత సంచరిస్తుందన్న పుకార్లు షికార్లు చేయడంతో అధికారులు ఆ మాటలన్నీ కొట్టిపారేశారు. అయితే ఇక్రిశాట్లోని సీసీ కెమెరాల్లో కూడా చిరుత సంచరిస్తున్న దృశ్యాలు నమోదు కావడంతో వెంటనే అధికారులు మేల్కొన్నారు. ఎలాగైనా చిరుతను పట్టుకోవాలని నెలరోజుల పాటు తీవ్రంగా ప్రయత్నించారు. అయినప్పటి కీ ఫలితం లేక స్థానిక అటవీశాఖ అధికారులను సంప్రదించారు. వలలు తెచ్చి బోనులు పెట్టినా చిరుత చిక్కకపోవడంతో అటు అధికారులు, అటు ఇక్రిశాట్ సమీప ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడినుంచి వచ్చిందో గానీ... అంతర్జాతీయ మెట్ట పరిశోధన సంస్థ (ఇక్రిశాట్) మూడు వేల ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఆ ప్రాంతమంతా గుబురుగా చెట్లు, పలు రకాల పంటలతో పచ్చగా ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ, ఓ చిరుత పులి గత కొన్ని నెలలుగా ఇక్రిశాట్లో ఎవరికి కనిపించకుండా సంచరిస్తోంది. తొలుత ఈ చిరుతను ఇక్రిశాట్ పంట క్షేత్రాల్లో పనిచేసే కార్మికులు గమనించారు. అదే విషయాన్ని అధికారులకు చెప్పినా, చాలా కాలం ఎవరు పట్టించుకోలేదు. సీసీ కెమెరాల్లో అది కనిపించడంతో ఇక్రిశాట్ అధికారుల్లో చలనం మొదలైంది. అయితే ఇక్రిశాట్లోని వివిధ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు, అక్కడి క్వార్టర్స్‌లో నివసిస్తుండడంతో స్థానిక అధికారులు వారికి ఈ విషయం చెప్పకుండానే చిరుత కోసం వేట సాగించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో చిరుత సంచారంపై జిల్లా వైల్డ్‌లైఫ్ ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. చిరుత సంచారాన్ని గమనించి దాన్ని పట్టుకునేందుకు ప్లాన్ వేశారు. అయితే రెండు నెలలుగా అటవీశాఖ అధికారులు ఇక్రిశాట్ మొత్తం వెదికినా చిరుతను మాత్రం పట్టుకోలేకపోయారు. చిక్కినట్టే చిక్కి... అయితే ఇటీవల చిరుతను గుర్తించిన ఫారెస్టు అధికారులు మత్తు పదార్థంతో ఉన్న బుల్లెట్‌ను గన్‌ద్వారా దాని శరీరంలోకి పంపగలిగారు. అది సొమ్మసిల్లి పడిపోవడంతో వెంటనే దాన్ని పట్టుకునేందుకు వె ళ్లేలోపే, అది అక్కడి నుంచి పరుగు తీసింది. మత్తు మోతాదు తక్కువగా ఇవ్వడం వల్లే చిరుత తప్పించుకో గలిగిందని ఫారెస్టు అధికారులు తేల్చారు. అయితే ఈ ఘటన ఆనోటా ఈనోటా బయటకు పొక్కడంతో ఇక్రిశాట్లో చిరుత సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. ఏ క్షణంలో చిరుత వచ్చి దాడి చేస్తుందోనని ఇక్రిశాట్ సమీప ప్రాంతాల వారు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. -
బాబోయ్ చిరుత
రెండు నెలలుగా ఇక్రిశాట్లో సంచారం పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు భయాందోళనలో సమీప ప్రాంతాల ప్రజలు సాక్షి, హైదరాబాద్: నగర శివార్లలోని పటాన్చెరులో ఉన్న జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ (ఇక్రిశాట్) ప్రాంగణంలోకి చిరుత పులి ప్రవేశించింది. రెండు నెలలుగా హల్చల్ చేస్తున్న దీన్ని పట్టుకోవడానికి అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించట్లేదు. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేదని అటవీ శాఖ అధికారులు చెబుతున్నా... ఈ సంస్థ ప్రాంగణం చుట్టూ నివసిస్తున్న ప్రజలు మాత్రం తీవ్ర భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వ్యవసాయ క్షేత్రాలతో, వందల ఎకరాల్లో సువిశాల ప్రాంగణంలో చెట్లు, పొదలతో విస్తరించి ఉన్న ఇక్రిశాట్లో కుందేళ్లు, నెమళ్లు, అడవి పందుల వంటి వన్యప్రాణులు నివసిస్తుంటాయి. ఇందులోకి క్రూరమృగమైన చిరుత పులి ప్రవేశించిన విషయాన్ని రెండు నెలల క్రితం అధికారులు గుర్తించారు. పలుమార్లు చిరుత కదలికల్ని గమనించిన తరువాత విషయాన్ని అటవీ శాఖ దృష్టికి తీసుకువెళ్లారు. ఆ శాఖ అధికారులు సదరు చిరుత ఇక్రిశాట్‌కు 26 కి.మీ. దూరంలో ఉన్న నర్సాపూర్ లేదా 28 కి.మీ. దూరంలో ఉన్న ముడినియాల్ అటవీ ప్రాంతం నుంచి వచ్చినట్లు అంచనా వేశారు. ముడినియాల్ అడవి నుంచి ఇక్రిశాట్ మధ్య మార్గంలో పూర్తిగా అభివృద్ధి చేయని ఔటర్ రింగ్ రోడ్ ఉండటం, దారి పొడవునా చెట్లు, పొదలు ఉండటంతో దఫదఫాలుగా ప్రయాణిస్తూ ఈ మార్గంలోనే వచ్చి ఉంటుందని నిర్థరించారు. చిరుతను పట్టుకోవడానికి ప్రయత్నాలు మాత్రం ఇక్రిశాట్ సిబ్బందే ప్రారంభించారు. ప్రాంగణంలోని అనేక ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేయడంతో పాటు కుక్కల్నీ ఎరగా వేసి ప్రయత్నించారు. ఇప్పటి వరకు ఇవేవీ ఫలించలేదు. ఈ అంశంపై అటవీ శాఖ కన్జర్వేటర్ సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి శంకరన్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా... ‘ఇక్రిశాట్లో చిరుత పులి సంచరిస్తున్న విషయాన్ని అధికారులు మా దృష్టికి కూడా తీసుకువచ్చారు. ప్రాంగణంలో ఉన్న చిన్న జంతువులను తింటూ జీవిస్తున్న చిరుత వల్ల ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేవు. దాన్ని పట్టుకోవడానికి సహాయం కోరితే బృందాలను పంపిస్తాం’ అని అన్నారు. అయితే చిరుత సంచారం, దాన్ని పట్టుకోవడంలో విఫలమవుతున్న ఇక్రిశాట్ అధికారుల తీరుతో చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుత ఒకసారి ప్రాంగణం దాటి బయటకు వస్తే అది మ్యాన్ ఈటర్‌గా మారే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. అది ఏ క్షణంలో ఎక్కడ కనిపిస్తుందో అని దినదినగండంగా గడుపుతున్నారు. వైల్డ్ లైఫ్ ట్రాంక్వలైజింగ్ ఫోర్స్ పేరిట దేశవ్యాప్తంగా క్రూరమృగాల్ని మత్తు మందిచ్చి బంధిస్తున్న నవాబ్ షఫత్ అలీఖాన్ హైదరాబాద్‌లోని రెడ్‌హిల్స్‌కు చెందిన వ్యక్తేనని.. ఇక్రిశాట్ అధికారులు ఆయన సహాయం తీసుకుని వేగంగా క్రూరమృగాన్ని బంధించాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఇక్రిశాట్‌తో పనిచేసేందుకు సిద్ధం
ఏజీ వర్సిటీ,న్యూస్‌లైన్: పరిశోధనా ఫలితాలను రైతులకు అందించడంలో ‘వ్యవసాయ విస్తరణ విద్య’ కీలకపాత్ర పోషిస్తుందని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పద్మరాజు కొనియాడారు. వ్యవసాయ విస్తరణ విద్య అభివృద్ధికి తీసుకోవాల్సిన విధానాలపై గురువారం రాజేంద్రనగర్‌లోని విస్తరణ విద్యాసంస్థ (ఈఈఐ)లో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం వ్యవసాయంలో వస్తున్న పరిశోధనలను ప్రతి రైతు ముంగిట చేర్చేందుకు విస్తరణ కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరముందని గుర్తుచేశారు. గ్రామీణ యువతను వ్యవసాయంపై ఆసక్తి కలిగించేలా వ్యవసాయ విద్యవిధానాలను రూపొందించాలని శాస్త్రవేత్తలకు సూ చించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ విద్యలో వినియోగించుకొని రానున్నకాలంలో ఏజీ వర్సిటీ పరి ధిలో సీడ్ టెక్నాలజీ వంటి కోర్సులను ఆన్లైన్లో అందించడానికి కృషి చేస్తామన్నారు. నగరంలోని వివిధ ఐఐటీ, ఐటీలతోపాటు అంతర్జాతీయ సంస్థ ఇక్రిశాట్‌తో కలిసి పనిచేసేందుకు తమ యూనివర్సిటీ సిద్ధంగా ఉందన్నారు. సదస్సులో వర్సిటీ విస్తరణ సంచాలకులు రాజిరెడ్డి, భారత విస్తరణ విద్యా శిక్షణ సంస్థ డెరైక్టర్ డాక్టర్ ప్రశాంత్ ఎస్.ఆర్మోఖర్, శైలేష్‌కుమార్ మిశ్రా, ఈఈఐ సంచాలకులు జగన్నాథరాజు, అండమాన్, నికోబార్, దక్షిణాది రాష్ట్రాలకు చెందిన 56 మంది వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. -
‘భూ చేతన’.. రైతుకు సాంత్వన
సూక్ష్మపోషకాల లోపాలపై అవగాహన పెలైట్ ప్రాజెక్ట్ కింద నాలుగు మండలాలు ఎంపిక ప్రారంభం కానున్న భూసార నమూనాల సేకరణ సత్ఫలితాల సాధనపై వ్యవసాయశాఖ దృష్టి గజ్వేల్, న్యూస్‌లైన్: భూముల్లో సూక్ష్మపోషకాలు లోపించి దిగుబడులు గణనీయంగా పడిపోతున్న వేళ.. ఇక్రిశాట్, వ్యవసాయశాఖ నడుం బిగించాయి. ముందుగా భూసార పరీక్షలు నిర్వహించడంతోపాటు, అందుకు తగ్గట్టు పోషకాలను అందించే కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టేందుకు మొదట జిల్లాలోని నాలుగు మండలాలను పెలైట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. పంటల సాగులో 16 రకాల సూక్ష్మపోషకాలు ప్రధాన భూమికను పోషిస్తాయి. ఇందులో కార్బనం, నీరు, ఆక్సిజన్, నత్రజని, భాస్వరం, పొటాషియంలను అతి ముఖ్యమైనవిగా చెబుతుండగా జింక్, కాపర్, మెగ్నీషియం, సల్ఫర్, మాలిబ్నమ్, బోరాన్, మాంగనీస్, కాల్షియం తదితర పోషకాలు కూడా ముఖ్యమైనవే. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రసాయనిక ఎరువులను విచక్షణారహితంగా వాడటం, భూసార పరీక్షల ఊసే కరువై సూక్ష్మపోషకాల లోపాల గురించి తెలియకపోవడం వంటి కారణాలతో 20 శాతానికిపైగా పంటల దిగుబడులు పడిపోతున్నాయి. చాలావరకు రైతులు పెట్టుబడులు కూడా దక్కని స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఏ యేటికాయేడు కష్టాల్లో చిక్కుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయరంగం సంక్షోభం దిశగా పయనిస్తున్నది. జిల్లాలో ఈ దుస్థితిని నివారించేందుకు ఇక్రిశాట్, వ్యవసాయశాఖ నడుంబిగించింది. గతేడాది అక్టోబర్ నుంచి ‘భూ చేతన’ పేరిట కార్యక్రమాలను చేపడుతున్నది. తొలుత ఒక్కో మండలంలో కొన్ని గ్రామాలను ఎంపిక చేసి అక్కడ రైతులకు సూక్ష్మపోషకాల లోపాలపై అవగాహన కల్పించి వివిధ రకాల సూక్ష్మపోషకాల బ్యాగులను 50 శాతం సబ్సిడీపై రైతులకు పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమం ద్వారా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంవల్ల మరింత పకడ్బందీగా కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ఇందులోభాగంగానే జిల్లాలోని జగదేవ్‌పూర్, కొండాపూర్, మనూర్, ఝరాసంగం మండలాలను పెలైట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. జగదేవ్‌పూర్ మండలంలోని అలిరాజపేట, తిమ్మాపూర్, బస్వాపూర్, ఇటిక్యాల, ఎర్రవల్లి, బీజీ వెంకటాపూర్ గ్రామాల్లో ఈ ప్రక్రియ ప్రారంభం కానున్నది. జగదేవ్‌పూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో భూసార పరీక్షలకు సంబంధించిన నమునాల సేకరణపై మంగళవారం గజ్వేలోని మార్కెట్ కమీటీ కార్యాలయ సమావేశమందిరంలో రైతులకు, వ్యవసాయాధికారులకు, వ్యవసాయవిస్తరణాధికారులకు శిక్షణనిచ్చారు. అదేవిధంగా మిగతా మండలాల్లోనూ ఆరేసీ గ్రామాలను ఎంపిక చేశారు. మొదటగా ఆయా గ్రామాల్లో భూసార నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ఇక్రిశాట్‌కు పంపనున్నారు. పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత ఏయే సూక్ష్మపోషకాలు లోపించాయనే విషయాన్ని గుర్తించి దానికనుగుణంగా పోషకాలను సబ్సిడీపై ప్రతి రైతుకు అందజేయనున్నారు. తక్కువ ధరకు ఈ షోషకాలను అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించిన పక్షంలో వచ్చే ఖరీఫ్‌లో సత్ఫలితాలను సాధించి అన్ని మండలాలకు ఈ పథకాన్ని వర్తింపజేయడానికి వ్యవసాయశాఖ యోచిస్తున్నది. -
వృధాగా ఉన్న వ్యవసాయ పరికరాలు
చిన్నకోడూరు, న్యూస్‌లైన్: ప్రభుత్వం రాయితీపై ఇచ్చే వ్యవసాయ పరి కరాలను వినియోగించుకొని ఉత్పత్తులు సాధించవచ్చని భావించిన రైతులకు నిరాశ మిగిలింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల చిన్నకోడూరు మండలం అల్లీపూర్లో లక్షల రూపాయల విలువైన వ్యవసాయ పరికరాలు వినియోగంలోకి రాక వృధాగా ఉన్నా యి. 2006-07లో రాష్ట్రీయ సమ వికాస్ యోజన ద్వారా ఇక్రిశాట్ నిధులతో వంద శాతం రాయితీపై అల్లీపూర్‌కు రూ.5లక్షలకు పైగా విలువైన వ్యవసాయ పరికరాలను ప్రభుత్వం సరఫరా చెసింది. వీటిలో మూడు పవర్‌స్ప్రేయర్స్, ఒక మక్కల నూర్పిడి యంత్రం, మూడు ఎడ్లబండ్లు, వాటి విడిభాగాలు, నాలుగు గిరకలు, నాలుగు నాగళ్లు, రెండు పవర్‌పంపులు ఉన్నాయి. ఇటీవలే కొత్తగా మరో మూడు విత్తనాలు, మందులు వేసే పరికరాలు వచ్చాయి. వీటిని అల్లీపూర్ పంచాయతీ ఆవరణలో ఉంచారు. వాటిని వినియోగించకపోవడంతో అవన్ని వృధాగా ఉన్నాయి. వ్యవసాయ పరికరాల వినియోగానికి సంబంధించి మూడేళ్ల కిందట కమిటీ ఎర్పాటు చేసినా సమావేశాలు నిర్వహించలేదు. మక్కల నూర్పిడి పరికరాన్ని ఇప్పటి వరకు వాడలేదు. అసలు యంత్రాన్ని వినియోగించే అవగాహన కూడా కల్పించలేదని రైతులు వాపోయారు. అలాగే మూడు ఎడ్లబండ్ల పరికరాలు ఉన్నప్పటికి ఒక్క రైతు కూడా వినియోగించుకోలేదు. ఈ విషయమై సిద్దిపేట ఏడీఏ వెంకటేశ్వర్లును వివరణ కోరగా పరికరాల నిర్వహణ బాధ్యతను సంబంధించి గ్రామ పంచాయతీలు చూసుకోవాలన్నారు. సలహాలు, సూచనలు మాత్రమే తమ శాఖ ఇస్తుందన్నారు.