బచ్చన్నపేట(వరంగల్): భారత దేశంలో వాడుకలో ఉన్న సేంద్రియ, జీవ ఎరువుల వాడకం గురించి అధ్యయం చేసేందుకు రోమ్ దేశీయుడు వరంగల్ కు వచ్చారు. అధ్యయనంలో భాగంగా రోమ్‌కు చెందిన ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సీనియర్ డెరైక్టర్ రోబ్‌బోస్ బుధవారం వరంగల్ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామంలో పర్యటించారు.
ఈ సందర్భంగా రోబ్ సేంద్రియ, జీవ ఎరువుల వాడకంపై రైతులతో చర్చించారు. అలాగే మహిళా సంఘాల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. జీవ ఎరువుల వాడకం వల్ల సాగు చేస్తున్న కూరగాయల దిగుబడుల గురించి ఆరా తీశారు. రోబ్ తో పాటు ఎన్‌ఆర్‌ఎల్‌ఎమ్ డెరైక్టర్ రాయుడు, ఇక్రిసాట్ శాస్త్రవెత్త హోమ్ రూపేలా ఉన్నారు.