⇒ చీడపీడల ఫొటో పంపిస్తే చాలు ఏ మందు వాడాలో సలహా
⇒ ఐ–హబ్ యాప్, వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేసిన ఇక్రిశాట్
సాక్షి, హైదరాబాద్: మీ పంటను చీడపీడలు ఆశించా యా? ఏ మందు వాడాలో అంతు చిక్కడం లేదా? అయితే చీడపీడలు ఆశించిన మొక్క ఫొటో తీసి ఐ–హబ్ యాప్‌లో అప్ లోడ్ చేసి ఇక్రిశాట్‌కు పంపండి. అంతే 24 గంటల్లో ఆ పంటకు ఏ పురుగుమందు, ఎరువు వాడాలో, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో సూచనలు పంపిస్తుంది. లక్షల మంది రైతులు ఫొటోలు తీసి పంపినా ఒక్క రోజులోనే శాస్త్రీయమైన సలహా రైతుకు అందుతుందని వ్యవసాయశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. ఆసియా ఖండంలో కోట్లాది రైతు లు పంపినా సలహా ఇచ్చే పరిజ్ఞానం ఇక్రిశాట్‌కు ఉందని ఆయన వెల్లడించారు.
మూడు అంశాల్లో రైతుకు సేవలు...
ప్రతిష్టాత్మక ఇక్రిశాట్ ఐ–హబ్ వెబ్‌సైట్, యాప్ వ్యవసాయానికి సంబంధించి మూడు అంశాలున్నాయి. విత్తనాలు, వాతావరణం, పంటలకు చీడపీడలు ఆశిస్తే ఏం చేయాలన్న అంశాలపై సేవలు అందించేందుకు అధికారు లు ఏర్పాట్లు చేశారు. అందుకు రిమోట్ సెన్సింగ్ వ్యవస్థతోనూ ఇక్రిశాట్ అనుసం« దానమైంది. వాతావరణ మార్పులను బట్టి పంటలను ఏ విధంగా రక్షించుకోవాలి? ఎలాంటి చర్యలు తీసుకోవాలో సలహా లిస్తారు. ఏ నేలలో ఎలాంటి విత్తనాలు వేయా లో సూచిస్తారు.
నేల ఫొటోను, భూసారం వివరాలను అప్‌లోడ్ చేస్తే ఏ పంట వేయాలో ఇక్రిశాట్ తెలుపుతుంది. చీడపీడలు ఆశించి నప్పుడు మొక్కల ఫొటోను రైతులు ఎంత నాసిరకంగా తీసి పంపినా ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో స్పష్టంగా విశ్లేషిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా చెల్లించకుండా ఈ సేవలను ఇక్రిశాట్ అందించనుంది. వ్యవసాయ విస్తరణాధికారులు, ఎరువుల దుకాణదారులపై ఆధారపడకుండా పంటలు, ఎరువులకు ఈ యాప్ ద్వారా శాస్త్రీయమైన నిర్ణయానికి రైతులు రావడానికి వీలు కలుగుతుందని వారు చెబుతున్నారు. నాలుగైదు రోజుల్లో వర్క్‌షాప్‌ను వ్యవ సాయశాఖ నిర్వహించాలని యోచిస్తోంది.