
సాక్షి,హైదరాబాద్: అంతర్జాతీయ సమశీతోష్ణ మండల ప్రాంత వ్యవసాయ పరిశోధన సంస్థ(ఇక్రిశాట్) డైరెక్టర్ జనరల్‌గా నియమితులైన డా.హిమాన్షు పాఠక్ బాధ్యతలు స్వీకరించారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్‌గా పని చేసిన ఆయన.. తాజాగా ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన బాధ్యతలు తీసుకునే క్రమంలో ఇక్రిశాట్ హిమాన్షు పాఠక్‌కు సాదర స్వాగతం పలికింది.
మొట్టప్రాంతాల వ్యవసాయ పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్) డైరెక్టర్ జనరల్‌గా నియమితులైన డాక్టర్ హిమాన్షూ పాఠక్ దేశంలోనే పేరెన్నికగన్న వ్యవసాయ శాస్త్రవేత్త. నేల, వ్యవసాయ రసాయనాలు, మొక్కలు ఎదుర్కొనే ఒత్తిళ్ల గురించి విసృ‍్తత పరిశోధనలు చేసిన ఈయన 1986లో బెనారస్ హిందూ యూనివర్శిటీ నుంచి వ్యవసాయంలో బీఎస్సీ విద్యనభ్యసించారు.
భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐసీఏఆర్)లో సాయిల్ సైన్స్ ఎమ్మెస్సీతోపాటు పీహెచ్‌డీ చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ కార్యదర్శిగా ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్‌గా, ఐసీఏఆర్ జాతీయ వరి పరిశోధన సంస్థ (కటక్) డైరెక్టర్ జనరల్‌గా, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అబయటిక్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్ (బారామతి) డైరెక్టర్‌గానూ పనిచేశారు.
యూకేలోని ఎస్సెక్స్ యూనివర్శిటీ, జర్మనీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెటరాలజీ అండ్ క్లైమెట్ రీసెర్చ్‌లలో విజిటింగ్ సైంటిస్ట్‌గా పని చేశారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లోని మెట్టప్రాంతాల చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం కోసం పరిశోధన, వ్యవసాయ విధానాలను రూపొందించడంలో డాక్టర్ పాఠక్‌ది కీలకపాత్ర.
Comments
Please login to add a commentAdd a comment