ఏజీ వర్సిటీ,న్యూస్‌లైన్: పరిశోధనా ఫలితాలను రైతులకు అందించడంలో ‘వ్యవసాయ విస్తరణ విద్య’ కీలకపాత్ర పోషిస్తుందని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పద్మరాజు కొనియాడారు. వ్యవసాయ విస్తరణ విద్య అభివృద్ధికి తీసుకోవాల్సిన విధానాలపై గురువారం రాజేంద్రనగర్‌లోని విస్తరణ విద్యాసంస్థ (ఈఈఐ)లో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం వ్యవసాయంలో వస్తున్న పరిశోధనలను ప్రతి రైతు ముంగిట చేర్చేందుకు విస్తరణ కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరముందని గుర్తుచేశారు.
గ్రామీణ యువతను వ్యవసాయంపై ఆసక్తి కలిగించేలా వ్యవసాయ విద్యవిధానాలను రూపొందించాలని శాస్త్రవేత్తలకు సూ చించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ విద్యలో వినియోగించుకొని రానున్నకాలంలో ఏజీ వర్సిటీ పరి ధిలో సీడ్ టెక్నాలజీ వంటి కోర్సులను ఆన్‌లైన్‌లో అందించడానికి కృషి చేస్తామన్నారు. నగరంలోని వివిధ ఐఐటీ, ఐటీలతోపాటు అంతర్జాతీయ సంస్థ ఇక్రిశాట్‌తో కలిసి పనిచేసేందుకు తమ యూనివర్సిటీ సిద్ధంగా ఉందన్నారు. సదస్సులో వర్సిటీ విస్తరణ సంచాలకులు రాజిరెడ్డి, భారత విస్తరణ విద్యా శిక్షణ సంస్థ డెరైక్టర్ డాక్టర్ ప్రశాంత్ ఎస్.ఆర్మోఖర్, శైలేష్‌కుమార్ మిశ్రా, ఈఈఐ సంచాలకులు జగన్నాథరాజు, అండమాన్, నికోబార్, దక్షిణాది రాష్ట్రాలకు చెందిన 56 మంది వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
ఇక్రిశాట్‌తో పనిచేసేందుకు సిద్ధం
Published Thu, May 15 2014 11:28 PM | Last Updated on Fri, Aug 17 2018 5:52 PM
Advertisement
Advertisement