సీడీఓ అభిషేక్ గోయల్ జారీ చేసిన ఆదేశాల కాపీ
లక్నో : అధికారులు, ఇతర ఉద్యోగులు డాక్యుమెంట్లు, ఫైల్ల పేజీలను తిప్పటానికి ఎంగిలి ఉపయోగించకూడదని రాయబరేలీ చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఆదేశాలు జారీచేశారు. పేజీలను తిప్పటానికి ఎంగిలి ఉపయోగించే అలవాటును మానేయటం ద్వారా అంటురోగాలను నివారించొచ్చనే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీడీఓ(చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్) అభిషేక్ గోయల్ తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న చాలా మంది డాక్యుమెంట్లు, ఫైల్లను తిప్పడానికి ఎంగిలి ఉపయోగిస్తున్నారని, తద్వారా వారు అంటురోగాల బారిన పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అభిషేక్ గోయల్ నిర్ణయం మేరకు జిల్లా స్థాయిలోని అందరు అధికారులు, ఉద్యోగులు పేజీలను తిప్పడానికి ఎంగిలి ఉపయోగించకూడదని, అందుకు బదులుగా వాటర్ స్పాంజ్‌లను వాడాలని ఆదేశారు జారీ అయ్యాయి. ఈ నెల పదవ తేదీన ఆదేశాలు జారీ కాగా, ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఆర్డర్స్ కాపీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment