Google Drive Offline Save Mode And Deleted Files Recover Tips - Sakshi

Google Drive: నెట్‌ లేకున్నా డ్రైవ్‌ను ఇలా వాడొచ్చు.. ఫొటో, ఫైల్స్‌ డిలీట్‌ అయితే ఇలా చేయండి

Published Mon, Sep 6 2021 2:53 PM | Last Updated on Mon, Sep 6 2021 5:42 PM

Google Drive Offline Save Mode And Deleted Files Recover Tips - Sakshi

ఫొటోలు, వీడియోస్‌, పీడీఎఫ్‌-వర్డ్‌ డాక్యుమెంట్స్‌, ఇతరత్రా ఫైల్స్‌ను స్టోర్‌ చేసుకోవడానికి గూగుల్‌ అందిస్తున్న ఉచిత క్లౌడ్‌ స్టోరేజ్‌ .. గూగుల్‌ డ్రైవ్‌. తాజాగా గూగుల్ డ్రైవ్ సేవలను ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లో కూడా ఉపయోగించుకోవచ్చని యూజర్లకు గూగుల్ తెలిపింది. ఈ మేరకు యూజర్స్‌ తమ డ్రైవ్‌లోని ఫైల్స్‌ను.. ఇంటర్నెట్‌నెట్ కనెక్షన్ లేకున్నా యాక్సెస్‌ చెసుకోవచ్చని తెలిపింది. 
 

► యూజర్స్ డ్రైవ్‌లో ఫైల్స్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలి.

► తర్వాత ఫైల్ ఓపెన్ చేసి..  కుడివైపు ఉండే మూడు చుక్కలపై క్లిక్ చేయాలి. 

► అక్కడ ఆఫ్‌లైన్ ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్‌ చేస్తే సదరు ఫైల్‌.. ఆఫ్‌లైన్‌ మోడ్‌కు వెళ్తుంది. అంటే ఎప్పుడైనా ఇంటర్నెట్‌ కనెక్షన్ లేకున్నా ఆఫ్‌లైన్ సెక్షన్‌లో కనిపిస్తుంది. 

► నిజానికి ఇదేం కొత్త ఆప్షన్‌ కాదు.  2019లోనే గూగుల్ ఈ ఫీచర్‌ను టెస్టింగ్‌ కోసం తెచ్చింది.

► గూగుల్‌ డ్రైవ్‌ వెబ్‌ ఉపయోగిచేప్పుడు కొన్ని రకాల ఫైల్స్‌ని యాజర్స్‌ మార్క్‌ చేసుకునేందుకు అనుమతించింది. అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో యూజర్స్‌కి ఆఫ్‌లైన్‌ ఫీచర్‌ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం డ్రైవ్‌ను ప్లేస్టోర్‌లో తప్పనిసరిగా అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. 

► ఇక యూజర్స్ మ్యాక్‌, విండోస్‌ కంప్యూటర్లలో గూగుల్ డ్రైవ్‌ డెస్క్‌టాప్‌ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించింది. ఇందులో డ్రైవ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి సపోర్టెడ్‌ ఫైల్స్‌పై రైట్ క్లిక్ చేస్తే ఆఫ్‌లైన్ ఆప్షన్ కనిపిస్తుంది.  దాన్ని ఎనేబుల్ చేస్తే సరిపోతుంది.  డ్రైవ్‌ వెబ్‌ యాప్‌ ఓపెన్ చేస్తే అందులోని ఫైల్స్‌ మీకు ఆఫ్‌లైన్‌లో కనిపిస్తాయి. 

► ఈ ఫీచర్ గూగుల్ వర్క్‌స్పేస్‌ ఖాతాదారులతోపాటు క్లౌడ్ ఐడెంటిటీ ఫ్రీ, క్లౌడ్ ఐడెంటిటీ ప్రీమియమ్‌, జీ సూట్ బేసిక్‌, జీ సూట్ బిజినెట్, సాధారణ ఖాతాదారులకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. 

డేటా ఫుల్‌ అయితే.. 

ప్రస్తుతం 15జీబీ స్టోరేజ్ డేటాను ఉచితంగా అందిస్తుంది. అంతకుమించి ఎక్కువ స్టోరేజ్ కావాలనుకుంటే డబ్బు చెల్లించాల్సిందే. నెలకు 100జీబీ స్టోరేజ్‌ కోసం రూ. 130 చెల్లించాల్సి ఉంటుంది. అలానే 200జీబీ స్టోరేజ్‌కి రూ. 200, 2టీబీ స్టోరేజ్‌కి రూ. 650 చెల్లించి కొనుగోలు చేసుకోవాలి.

► డ్రైవ్‌ నుంచి పొరపాటున ఫొటోలు, వీడియోలు, ఫైల్స్‌ డిలీట్‌ అవ్వొచ్చు. లేదంటే డిలీట్‌ చేయొచ్చు. అలాంటి వాటిని తిరిగి తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ట్రాష్‌లో ఆ ఫొటోలు ఉంటాయి. వాటిని రీస్టోర్‌ గునక కొడితే తిరిగి.. డ్రైవ్‌ ఫోల్డర్‌లోకి వచ్చేస్తాయి.
 

► ఒకవేళ అలా జరగకపోతే.. గూగుల్‌ను సంప్రదించవచ్చు. అప్పుడు టెక్నిషియన్స్‌, ఎక్స్‌పర్ట్స్‌ ద్వారా వాటిని రికవరీ చేయిస్తారు.

► డిలీట్‌ చేసిన ఫొటోల్ని.. అవసరమైతే పర్మినెంట్‌గా డిలీట్‌ చేసేయొచ్చు.

► మల్టీ సెలక్షన్‌లో ఫొటోల్నిగానీ, ఇతర ఫైల్స్‌ను గానీ డ్రైవ్‌లో స్టోర్‌ చేసేటప్పుడు.. పూర్తిగా అప్‌లోడ్‌ అయ్యేదాకా ఆగాలి. లేకుంటే ఆ ఫైల్స్‌ డ్రైవ్‌లో స్టోర్‌ కావు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement