ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. జులై 19 నుంచి తన ఆల్బమ్ ఆర్కైవ్‌ను శాస్వతంగా డిలీట్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో చాట్‌లు, వీడియోలు, ఫోటోలను స్టోర్ చేసుకునేందుకు ఉపయోగపడే ఆల్బమ్ ఆర్కైవ్ కనుమరుగు కానుంది. సేవలు నిలిపివేయనున్న తరుణంలో యూజర్లు ఆల్బమ్ ఆర్కైవ్‌లో ఉన్న డేటాను డౌన్‌లోడ్ చేసుకోవాలని గూగుల్ యూజర్లను కోరింది.
సేవల నిలిపివేతపై వినియోగదారులకు మెయిల్స్ పంపుతోంది. ఆల్బమ్ ఆర్కైవ్‌ను నిలిపివేస్తున్నామని, ఇప్పటికే అందులో ఉన్న డేటాను డౌన్‌లోడ్ చేసుకునేలా గూగుల్‌కు చెందిన టేక్‌అవుట్‌ని ఉపయోగించుకోవాలని చెబుతోంది.
గూగుల్‌ఈ వారం ప్రారంభంలో వినియోగదారులకు వార్నింగ్ మెయిల్స్ పంపింది ఇమెయిల్‌లను పంపింది, ఆల్బమ్ ఆర్కైవ్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న కంటెంట్ జూలై 19 నుండి తొలగించబడుతుందని పేర్కొంది. 2018కి ముందు జీమెయిల్‌లో ఉపయోగించిన బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌లు, ఆల్బమ్ కామెంట్స్,లైక్స్ వంటి కంటెంట్ డిలీట్ అవుతాయని వెల్లడించింది.
చదవండి : ఓలా టెక్నాలజీ అదిరింది..హెల్మెట్ లేకపోతే బండి స్టార్ట్ కాదు!
Comments
Please login to add a commentAdd a comment