న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణానికి సంబంధించిన ఫైళ్లు కనిపించకపోవడానికి వెనుక కుట్ర, కుమ్మక్కు ఉన్నాయని బీజేపీ ఆరోపించింది. 2006-09 మధ్య బొగ్గు శాఖ నిర్వహించిన ప్రధాని మన్మోహన్ సింగ్‌ను రక్షించడానికే వాటిని మాయం చేశారని విమర్శించింది. రాజ్యసభలో బీజేపీకి చెందిన ఉప నాయకుడు రవి శంకర్ ప్రసాద్ సోమవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘మాయమైన బొగ్గు శాఖ ఫైళ్ల గురించి అడిగితే ప్రభుత్వం నుంచి స్పందనే లేదు. ఆ ఫైళ్లన్నీ 2006-09 మధ్య కాలానివి. కాంగ్రెస్ నాయకులు చేసిన అన్ని రాజకీయ సిఫార్సులతో ఉన్న కీలక ఫైళ్లన్నీ కనిపించడం లేదు. 157 ప్రైవేటు కంపెనీలకు చెందిన రికార్డులూ కనిపించడం లేదు’’ అని ప్రసాద్ అన్నారు.
ఇందులో కుట్ర ఉందని తాము బలంగా విశ్వసిస్తున్నామన్నారు. క్రిమినల్ కేసుల్లో నిందితులు మొదట చేసే పని ఆధారాలను, సాక్ష్యాలనూ మాయం చేయడమేనని గుర్తుచేశారు. ఫైళ్ల మిస్సింగ్‌పై బొగ్గు శాఖ మంత్రి శ్రీ ప్రకాశ్ జైస్వాల్ ఇంతవరకు పార్లమెంటులో ఎలాంటి ప్రకటన చేయలేదని, ఆయన కచ్చితంగా ఒక ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
‘బొగ్గు’ ఫైళ్ల మిస్సింగ్ వెనుక కుట్ర: బీజేపీ
Published Mon, Aug 19 2013 9:00 PM | Last Updated on Tue, Oct 2 2018 4:01 PM
Advertisement
Advertisement