ఆ బాక్సుల నిండా ఫైళ్లు!  | The bus belonging to Sandhya Aqua Company is suspicious | Sakshi
Sakshi News home page

ఆ బాక్సుల నిండా ఫైళ్లు! 

Published Mon, Mar 25 2024 2:35 AM | Last Updated on Mon, Mar 25 2024 10:12 AM

The bus belonging to Sandhya Aqua Company is suspicious - Sakshi

అనుమానాస్పదంగా ‘సంధ్య’ బస్సు

పోలీసుల తనిఖీ.. అట్టపెట్టెలుగా నిర్ధారణ

సీబీఐ అధికారులకు నివేదిస్తామన్న పోలీసులు

పిఠాపురం: మూడు రోజులుగా కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కొత్త మూలపేట ఎస్‌ఈజెడ్‌ కాలనీలో నిలిపివేసిన సంధ్యా ఆక్వా కంపెనీకి చెందిన బస్సు అనుమా­నాస్ప­దంగా కనిపించడంతో స్థానికులు ఇచ్చిన సమా­చారం మేరకు ఆదివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

కొత్తపల్లి ఎస్‌ఐ స్వామి­నాయుడు సంధ్యా ఆక్వా కంపెనీ ప్రతి­ని­ధులను విచారించగా బస్సు బ్రేక్‌ డౌన్‌ కావ­డం­తో అక్కడ నిలిపి ఉంచి­నట్లు చెప్పారు. బస్సు­లోని అట్ట పెట్టెల్లో పలు ఫైళ్ల కట్టలు ఉన్న­­ట్లు పోలీసులు గుర్తించారు.  అనుమా­నా­స్పద వస్తువులేవీ కనిపించలేదని, ఈ అంశాన్ని దర్యా­ప్తు చేస్తున్న సీబీఐకి తెలియ­జేస్తామని ఎస్‌ఐ చెప్పారు. తనిఖీల అనంతరం బస్సును ఆక్వా కంపెనీలోకి తరలించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement