
మాట్లాడుతున్న కొవ్వాడ రైతులు
రణస్థలం: రెవెన్యూ అధికారులతో టీడీపీ ఎంపీపీ గొర్లె విజయకుమార్ కుమ్మక్కై బినామీ పేర్లతో అణు పార్కు పరిధిలో ఉన్న భూములు రాయించుకున్నారని కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతవాసులు ఆరోపించారు. రైతులు మైలపల్లి జగ్గులు, పట్టయ్య, మైలపల్లి రాముడు మండల కేంద్రంలో విలేకరులతో శుక్రవారం మాట్లాడుతూ అణు విద్యుత్ కేంద్రం వల్ల నష్టపోయిన రైతులకు రెవెన్యూ అధికారులు పరిహారం అందించకుండా టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు, ఎంపీపీ బీనామీలకు అందించారని విమర్శించారు.
ఎంపీపీ విజయకుమార్‌కు బంధువులైన కొయ్యాం, అదపాక తదితర గ్రామస్తుల పేర్లు అణు పరిహా రంలో జాబితాలో ఎందుకున్నాయని వారు ప్రశ్నిస్తున్నారు. ఎంపీపీ కోళ్లు ఫారం, పొలాల్లో పనిచేసిన మరువాడ గ్రామానికి చెందిన కొందరి పేర్లు అణు నష్టపరిహారం జాబితాలోకి ఎలా వచ్చి పరిహారం పొందారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో మైలపల్లి సూరి, మైలపల్లి తవుడు, మంత్రి శ్రీను, మైలపల్లి సత్యం, దన్నాన అప్పలనాయుడు, కిల్లారి సన్యాసినాయుడు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment