
ప్రతీకాత్మక చిత్రం
విజయవాడ: మరో ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. విజయవాడలోని ఆటోనగర్ అగ్నిమాపక శాఖ అధికారి కూచిపూడి శ్రీనివాస రావు తన కార్యాలయంలో విజయదుర్గ పెట్రో కెమికల్స్ యజమాని ముద్దాడ రామకృష్ణ నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.
ఇటీవల విజయదుర్గ పెట్రో కెమికల్స్ కర్మాగారంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ సమయంలో కర్మాగారంలోని విద్యుత్ మీటర్ దగ్ధమైంది. మీటర్ సర్టిఫై చేసేందుకు శ్రీనివాసరావు లంచం డిమాండ్ చేసినట్లు విచారణలో తేలింది. ఈ మేరకు నగదు స్వాధీనం చేసుకుని ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.