నిందితుడు గులాంగౌస్
కేపీహెచ్‌బీకాలనీ: న్యాయం కోసం కోర్టుకు వచ్చే వారి నుంచి లంచాలు వసూలు చేస్తున్న ఓ కోర్టు ఉద్యోగిని ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. చెక్ బౌన్స్ కేసుల్లో న్యాయం చేసేందుకు గాను రూ. 6వేలు డిమాండ్ చేసిన అతను నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు బుధవారం రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. న్యూఢిల్లీకి చెందిన జేయు అగ్రి సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డీలర్లకు ఉత్పతులను సరఫరా చేస్తుంది. అందుకుగాను కొందరు డీలర్లు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి. సుమారు రూ. 60 చెక్కులు బౌన్స్ కావడంతో కూకట్‌పల్లిలోని నాల్గో స్పెషల్ కోర్టులో చెక్‌బౌన్స్ కేసులు దాఖలు చేశారు.
సదరు కేసుల్లో పురోగతిని తెలుసుకునేందుకు సంస్థకు చెందిన హరిబాబు అనే ఉద్యోగి సూపరిండెంట్ గులంగౌస్‌ను సంప్రదించాడు. ఒక్కో కేసుకు రూ. 400 తీసుకుంటామని, మొత్తం చెక్కులకు ఒకే దఫాలో రూ. 6వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో హరిబాబు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అధికారుల సూచనమేరకు బుధవారం సూపరిండెంట్ గులాంగౌస్‌కు కోర్టు ఆవరణలో హరిబాబు రూ. 6వేలు ఇస్తుండగా అప్పటికే అక్కడ మాటు వేసిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. పంచనామ నిర్వహించి నోట్లు, ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment