court employee
-
మహిళ నుంచి రోజూ ఫోన్, వాట్సప్ మెసేజ్‌లు.. ఉదయం భవనానికి వెళ్లి చూస్తే..
యశవంతపురల(బెంగళూరు): హావేరి జిల్లా హిరేకెరూరు పట్టణంలోని ప్రభుత్వ ఉద్యోగుల భవనంలో ఆదివారం రాత్రి కోర్టులో శిరస్తేదారుగా పని చేస్తున్న మల్లికార్జున భరగి (42) ఆత్మహత్య చేసుకున్నాడు. బాగలకోటె జిల్లా బాదామి తాలూకా కటగేర గ్రామానికి చెందిన మల్లికార్జున 13 ఏళ్లుగా హిరేకెరూరులో ఉంటూ కోర్టులో పని చేస్తున్నారు. ఆయనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. నలుగురి నుంచి వేధింపులు హసీనా మూలిమని అనే మహిళ రోజూ మల్లికార్జునకు ఫోన్ చేయడం, వాట్సప్ మెసేజ్‌లు పంపుతూ అతన్ని వేధిస్తుండేది. ఆమెతో పాటుగా న్యాయవాది జీవీ కులకర్ణి, కేజీ కురియవరు, వసీంలు కోర్టులో మానసికంగా వేధిస్తున్నారు. దీంతో విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం ఎన్జీఓ భవనానికి వెళ్లిన వారు చూసి పోలీసులకు సమాచారం అందించారు. నా మరణానికి ఆ నలుగురే కారణం అని మల్లికార్జున వాట్సప్ స్టేటస్ పెట్టాడు. అతని వద్ద 26 పేజీల డెత్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: ఫుడ్ డెలివరీకి వెళ్లి యువతికి బలవంతంగా ముద్దు.. డెలివరీ బాయ్ అరెస్ట్ -
ఏసీబీ వలలో కోర్టు ఉద్యోగి
కేపీహెచ్‌బీకాలనీ: న్యాయం కోసం కోర్టుకు వచ్చే వారి నుంచి లంచాలు వసూలు చేస్తున్న ఓ కోర్టు ఉద్యోగిని ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. చెక్ బౌన్స్ కేసుల్లో న్యాయం చేసేందుకు గాను రూ. 6వేలు డిమాండ్ చేసిన అతను నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు బుధవారం రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. న్యూఢిల్లీకి చెందిన జేయు అగ్రి సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డీలర్లకు ఉత్పతులను సరఫరా చేస్తుంది. అందుకుగాను కొందరు డీలర్లు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి. సుమారు రూ. 60 చెక్కులు బౌన్స్ కావడంతో కూకట్‌పల్లిలోని నాల్గో స్పెషల్ కోర్టులో చెక్‌బౌన్స్ కేసులు దాఖలు చేశారు. సదరు కేసుల్లో పురోగతిని తెలుసుకునేందుకు సంస్థకు చెందిన హరిబాబు అనే ఉద్యోగి సూపరిండెంట్ గులంగౌస్ను సంప్రదించాడు. ఒక్కో కేసుకు రూ. 400 తీసుకుంటామని, మొత్తం చెక్కులకు ఒకే దఫాలో రూ. 6వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో హరిబాబు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అధికారుల సూచనమేరకు బుధవారం సూపరిండెంట్ గులాంగౌస్కు కోర్టు ఆవరణలో హరిబాబు రూ. 6వేలు ఇస్తుండగా అప్పటికే అక్కడ మాటు వేసిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. పంచనామ నిర్వహించి నోట్లు, ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ వివరించారు. -
జిల్లాకోర్టు ఉద్యోగి ఆత్మహత్య
నిజామాబాద్క్రైం,న్యూస్‌లైన్: జిల్లాకోర్టులో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాఠశాలలో విధులు నిర్వహించి ఇంటికి చేరుకున్న అతని భార్యకు, భర్త ఫ్యాన్‌కు వేళాడుతూ కని పించటంతో ఒక్కసారిగా ఆందోళనకు గురై కుప్పకూలిం ది. ఈ సంఘటనకు సంబంధించి సోమవారం మూడో టౌన్ రెండో ఎస్సై ప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మూడో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధి నాందేవ్‌వాడకు చెందిన(రైల్వే ఒవర్ బ్రిడ్జి పక్కన) నివాసం ఉంటున్న చంద్రశేఖర్‌శర్మ(55) ఫస్టు అడిషన ల్ జిల్లాకోర్టులో జూని యర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని భార్య భాగ్యరేఖ సిర్పూర్ గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. వీరికి ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. భాగ్యరేఖ ఎప్పటిలాగే విధులు ముగించుకుని సాయంత్రం ఇంటికి చేరుకుంది. ఇంటి తలుపు తెరువగానే భర్త ఫ్యాన్‌కు వేళాడుతూ కనిపించటంతో అక్కడే కుప్పకూలింది. ఆమె పెట్టిన కేకలకు స్థానికులు అక్కడికి చేరుకుని ఆమెను ఓదార్చారు. చంద్రశేఖర్ ఇంకా బతికి ఉన్నాడనుకుని స్థానికులు కిందకు దింపారు. కాని అప్పటికే అతడు మృతి చెందటంతో ఇంట్లో పడుకోబెట్టారు. ఇంటికి చేరుకున్న కొడుకులు తండ్రి మృతదేహంపై పడి రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. ఎస్సై శ్రీహరి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. జిల్లాకోర్టు ఉద్యోగులు శర్మ మృతదేహాన్ని సందర్శించి ఆయన కుటుంబాన్ని ఓదార్చారు. అనారోగ్యంతో చనిపోతున్నా.. తనకు బీపీ,షుగర్, నడుం నొప్పి ఉన్నాయని, అలాగే మానసిక ఒత్తిళ్లతో తాను చనిపోతున్ననంటూ చంద్రశేఖర్‌శర్మ సూసైడ్ నోట్ రాసి పెట్టాడు. ఆస్పత్రల చుట్టూ తిరుగుతున్న ఆరోగ్యం బాగు కావటంలేదని, అందుకే చనిపోతున్న అంటూ లెటర్ లో పేర్కొన్నాడు. దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.