జిల్లాకోర్టు ఉద్యోగి ఆత్మహత్య | nizamabad district court employee's suicide | Sakshi
Sakshi News home page

జిల్లాకోర్టు ఉద్యోగి ఆత్మహత్య

Published Tue, Jan 7 2014 4:26 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

nizamabad district court employee's suicide

నిజామాబాద్‌క్రైం,న్యూస్‌లైన్: జిల్లాకోర్టులో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాఠశాలలో విధులు నిర్వహించి ఇంటికి చేరుకున్న అతని భార్యకు, భర్త ఫ్యాన్‌కు వేళాడుతూ కని పించటంతో ఒక్కసారిగా ఆందోళనకు గురై కుప్పకూలిం ది. ఈ సంఘటనకు సంబంధించి సోమవారం మూడో టౌన్ రెండో ఎస్సై ప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మూడో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధి నాందేవ్‌వాడకు చెందిన(రైల్వే ఒవర్ బ్రిడ్జి పక్కన) నివాసం ఉంటున్న చంద్రశేఖర్‌శర్మ(55) ఫస్టు అడిషన ల్ జిల్లాకోర్టులో జూని యర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు.
 
 సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని భార్య భాగ్యరేఖ సిర్పూర్ గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. వీరికి ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. భాగ్యరేఖ ఎప్పటిలాగే విధులు ముగించుకుని సాయంత్రం ఇంటికి చేరుకుంది. ఇంటి తలుపు తెరువగానే భర్త ఫ్యాన్‌కు వేళాడుతూ కనిపించటంతో అక్కడే కుప్పకూలింది. ఆమె పెట్టిన కేకలకు స్థానికులు అక్కడికి చేరుకుని ఆమెను ఓదార్చారు. చంద్రశేఖర్ ఇంకా బతికి ఉన్నాడనుకుని స్థానికులు కిందకు దింపారు. కాని అప్పటికే అతడు మృతి చెందటంతో ఇంట్లో పడుకోబెట్టారు. ఇంటికి చేరుకున్న కొడుకులు తండ్రి మృతదేహంపై పడి రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. ఎస్సై శ్రీహరి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. జిల్లాకోర్టు ఉద్యోగులు శర్మ మృతదేహాన్ని సందర్శించి ఆయన కుటుంబాన్ని ఓదార్చారు.
 
 అనారోగ్యంతో చనిపోతున్నా..
 తనకు బీపీ,షుగర్, నడుం నొప్పి ఉన్నాయని, అలాగే మానసిక ఒత్తిళ్లతో తాను చనిపోతున్ననంటూ చంద్రశేఖర్‌శర్మ సూసైడ్ నోట్ రాసి పెట్టాడు. ఆస్పత్రల  చుట్టూ తిరుగుతున్న ఆరోగ్యం బాగు కావటంలేదని, అందుకే చనిపోతున్న అంటూ లెటర్ లో పేర్కొన్నాడు. దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement