ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు
కోనేరుసెంటర్(మచిలీపట్నం): ఏసీబీ వలలో మరో అధికారి చిక్కుకున్నాడు. పాత బిల్లులు మంజూరు చేసేందుకు లంచం తీసుకుంటూ మంగళవారం ఓ ఏఈ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ ప్రసాదరావు తెలిపిన వివరాల ప్రకారం...మచిలీపట్నానికి చెందిన పామర్తి లక్ష్మణరావు ఇరిగేషన్ కాంట్రాక్టు వర్క్‌లు చేస్తుంటాడు. బందరు మండలం ఎస్‌ఎన్ గొల్లపాలెంలో ఏడాదిన్నర క్రితం రిటైనింగ్ వాల్ వర్క్‌ను సకాలంలో పూర్తిచేసి బిల్లులు పెట్టుకున్నాడు.
సుమారు రూ. 6 లక్షలకు పైగా బిల్లులు రావాల్సి ఉంది. ఏడాదిన్నర కావస్తున్నా మచిలీపట్నం ఇరిగేషన్ ఏఈబి. అనిల్‌కుమార్ కాంట్రాక్టర్‌కు సంబంధించిన బిల్లులను మంజూరు చేయకుండా తాత్సారం చేస్తున్నాడు. కాంట్రాక్టర్ అడిగినప్పుడల్లా దశలవారీగా లంచం రూపంలో డబ్బులు తీసుకుంటున్నాడు. అలా లక్ష్మణరావు నుంచి ఇప్పటివరకు లక్షకుపైగా డబ్బులు గుంజాడు. అయినా బిల్లులు మంజూరు చేయకుండా కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తున్నాడు. విసుగు చెందిన ఆయన నాలుగు రోజుల క్రితం ఆశ్రయించి న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నాడు.
పక్కా పథకంలో అరెస్టు
ఏఈ అనిల్‌కుమార్ డిమాండ్ చేసిన విధంగా బాధితుడికి రసాయనాలతో కూడిన రూ. 19,000లను ఇచ్చి మంగళవారం ఉదయం కాంట్రాక్టర్‌ను మచిలీపట్నం బైపాస్‌రోడ్డులోని ఏఈ ఇంటికి పంపారు. ఏఈ బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా మెరుపుదాడి చేసి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేశారు. అనంతరం ఏఈని కోర్టులో హాజరుపరిచారు. ఏసీబీ డీజీ ఆర్‌పీ ఠాకూర్ ఆదేశాల మేరకు దాడి జరిపామని డీఎస్పీ ప్రసాదరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment