ఏసీబీ అధికారులకు చిక్కిన కాశీరాం
శంషాబాద్: గృహ వినియోగ విద్యుత్ మీటర్ కోసం లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ అధికారులకు లైన్‌మెన్ చిక్కాడు. పెద్దషాపూర్ సబ్‌స్టేషన్ పరిధిలోని తొండుపల్లి, ఊట్‌పల్లి, చౌదరిగూడ లైన్‌మెన్‌గా కాశీరాం పనిచేస్తున్నాడు. ఊట్‌పల్లి పరిధిలోని సదరన్ వెంచర్‌లో ఇంటిని నిర్మించుకుంటున్న తిరుపతిరెడ్డికి గృహ వినియోగ విద్యుత్ మీటర్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఈ పనికోసం లైన్‌మెన్ రూ.40 వేలు లంచం డిమాండ్ చేశాడు. తాను డబ్బులు ఇవ్వలేనని తిరుపతిరెడ్డి చెప్పడంతో లైన్‌మెన్ మీటర్ బిగించకుండా ఇబ్బందులకు గురిచేశాడు.
దీంతో తిరుపతిరెడ్డి ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఒప్పందం మేరకు ఇటీవల రూ.20 వేలు ఇవ్వడానికి అంగీకరించాడు. ఈ సమాచారాన్ని ఏసీబీకి తెలపడంతో సోమ వారం ఆ నగదు కాశీరాంకు ఇస్తుండగా అధికారులు రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. ఏసీపీబీ డీఎస్‌పీ సూర్యనారాయణ, సీఐలు మాజీద్ అలీ, నాగేందర్‌గౌడ్ కేసు దర్యాప్తు చేపడుతున్నారు. కాశీరాం గతంలో పనిచేసిన శంషాబాద్, పాలమాకుల పరిధిలో కూడా అనేకమంది గృహ, పారిశ్రామిక యజమానులకు లంచాల కోసం ఇబ్బందులు పెట్టేవాడని ఆరోపణలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment