Tirupathi Reddy
-
ఏసీబీకి చిక్కిన లైన్‌మన్
శంషాబాద్: గృహ వినియోగ విద్యుత్ మీటర్ కోసం లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ అధికారులకు లైన్మెన్ చిక్కాడు. పెద్దషాపూర్ సబ్‌స్టేషన్ పరిధిలోని తొండుపల్లి, ఊట్పల్లి, చౌదరిగూడ లైన్మెన్గా కాశీరాం పనిచేస్తున్నాడు. ఊట్పల్లి పరిధిలోని సదరన్ వెంచర్లో ఇంటిని నిర్మించుకుంటున్న తిరుపతిరెడ్డికి గృహ వినియోగ విద్యుత్ మీటర్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఈ పనికోసం లైన్మెన్ రూ.40 వేలు లంచం డిమాండ్ చేశాడు. తాను డబ్బులు ఇవ్వలేనని తిరుపతిరెడ్డి చెప్పడంతో లైన్మెన్ మీటర్ బిగించకుండా ఇబ్బందులకు గురిచేశాడు. దీంతో తిరుపతిరెడ్డి ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఒప్పందం మేరకు ఇటీవల రూ.20 వేలు ఇవ్వడానికి అంగీకరించాడు. ఈ సమాచారాన్ని ఏసీబీకి తెలపడంతో సోమ వారం ఆ నగదు కాశీరాంకు ఇస్తుండగా అధికారులు రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. ఏసీపీబీ డీఎస్పీ సూర్యనారాయణ, సీఐలు మాజీద్ అలీ, నాగేందర్‌గౌడ్ కేసు దర్యాప్తు చేపడుతున్నారు. కాశీరాం గతంలో పనిచేసిన శంషాబాద్, పాలమాకుల పరిధిలో కూడా అనేకమంది గృహ, పారిశ్రామిక యజమానులకు లంచాల కోసం ఇబ్బందులు పెట్టేవాడని ఆరోపణలు ఉన్నాయి. -
ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి
నంగునూరు: ఇన్పుట్ సబ్సిడీని వెంటనే విడుదల చేసి రైతులను అదుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి ఎల్లా తిరుపతిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గత రబీ సీజన్లో నీళ్లులేక పంటలు ఎండిపోతే ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని ప్రకటించిందని, నేటి వరకు అన్నదాతలకు పరిహారం అందలేదన్నారు. పంటలు పండక, పరిహారం అందక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత సీజన్లో చెరువులు, బావులు, బోర్లలో నీళ్లులేక 50 శాతం పైగా మొక్కజొన్న పంటలు ఎండిపోయాయని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి త్వరగా పరిహారం అందించాలని కోరారు. -
చిన్నారి మెడలో గొలుసు చోరీ
చాక్లెట్ కొనిస్తానని చిన్నారికి ఆశచూపిన దుండగుడు ఆమె మెడలోని గొలుసును దోచుకెళ్లాడు. ఈ ఘటన బుధవారం అంబర్‌పేట పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ మధుసూదన్ కథనం ప్రకారం... హస్తినాపురంలో నివసించే తిరుపతి రెడ్డి, ఆయన భార్య, కూతరు హాసిని(4) మంగళవారం రాత్రి పటేల్‌నగర్‌లోని ఓ ఫంక్షన్హాల్లో జరిగిన శుభకార్యానికి వచ్చారు. హాసిని బయట ఆడుకుంటుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి చాకెట్లు కొనిస్తానంటూ పక్కనే ఉన్న కిరాణం కొట్టుకు తీసుకె ళ్లాడు. ఆమెకు మాయమాటలు చెప్పి మెడలో ఉన్న తులం బంగారు గొలుసును తస్కరించుకొని పరారయ్యాడు. కొద్దిసేపటి తర్వాత కూతురు మెడలో గొలుసు లేదని గమనించిన తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. దీనిపై వారు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.