
ప్రతీకాత్మక చిత్రం
ముంబై: లంచం వసూలు చేసిన ఇద్దరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అధికారులను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. లంచం డిమాండ్ చేస్తున్నరనే ఫిర్యాదుతో సీబీఐ అధికారులు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మేనేజర్, రూరల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అధికారిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. మహారాష్ట్ర పుణే జిల్లాలోని బారామతి శాఖ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో పని చేస్తున్న మేనేజర్ రూ. 99 లక్షల లోన్ మంజూరు విషయంలో ఓ వ్యక్తి వద్ద రూ. 2.70లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో డిమాండ్ చేసిన డబ్బును వసూలు చేసుకురమ్మని బ్యాంక్‌లో పనిచేసే రూరల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అధికారిని సదరు వ్యక్తి వద్దకు పంపాడు. (ఉద్యోగమిస్తామని ఊబిలోకి నెట్టారు)
సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు సేల్స్ ఎగ్జిక్యూటివ్ అధికారిని లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. అతని వద్ద పట్టుబడిన నగదును అధికారులు సీజ్ చేశారు. బ్యాంకు మేనేజర్‌పై కేసు నమోదు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఈ కేసుపై పూర్తిగా స్థాయిలో దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు
Comments
Please login to add a commentAdd a comment