ఆ గోరక్షకులను గుర్తిస్తే నగదు రివార్డు! | police announces reward on gau rakshaks | Sakshi
Sakshi News home page

ఆ గోరక్షకులను గుర్తిస్తే నగదు రివార్డు!

Published Wed, Apr 5 2017 5:42 PM | Last Updated on Tue, Sep 5 2017 8:01 AM

ఆ గోరక్షకులను గుర్తిస్తే నగదు రివార్డు!

ఆ గోరక్షకులను గుర్తిస్తే నగదు రివార్డు!

గో సంరక్షణ పేరిట 55 ఏళ్ల పెహ్లూ ఖాన్‌ను కిరాతకంగా చంపిన ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాజస్థాన్‌ పోలీసులు ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. పెహ్లూ ఖాన్‌ను కొట్టిచంపిన 'గోరక్షకుల' గురించి ఎవరైనా సమాచారం ఇస్తే.. వారికి రూ. 5వేల రివార్డు ఇస్తామని ప్రకటించారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఆరుగురు దుండగులను గుర్తించారు.

హర్యానాకు చెందిన పెహ్లూ ఖాన్‌ రాజస్థాన్‌లోని అల్వార్‌ జిల్లా మీదుగా గోవులను వాహనంలో తరలిస్తుండగా.. ఆయన బృందంపై రహదారిపై మాటువేసిన గోరక్షకులు అత్యంత దారుణంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌ దళ్‌కు చెందిన కార్యకర్తలు ఈ దాడికి పాల్పడినట్టు భావిస్తున్నారు. ఈ దాడిలో నలుగురు గాయపడగా.. తీవ్రంగా గాయపడిన పెహ్లూ ఖాన్‌ అల్వార్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఈ అమానుష దారుణంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement