Cow vigilantes
-
Monu Manesar: గోసంరక్షకుడు మోను మనేసర్ అరెస్ట్
వివాదాస్పద గోసంరక్షుడు, బజరంగ్దళ్ సభ్యుడు మోను మనేసర్‌ను హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాలోని భివానీలో ఇద్దరు వ్యక్తుల హత్య, నూహ్‌లో అల్లర్లను ప్రేరేపించిన కేసులో మోను మనేసర్‌ను మంగళవారం సివిల్ డ్రెస్‌లో ఉన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మనేసర్‌ను హర్యానా పోలీసులు రాజస్ధాన్ పోలీసులకు అప్పగించనున్నారు. కాగా గత ఫిబ్రవరిలో హర్యానాలో ఇద్దరు ముస్లింలను సజీవ దహనం చేసిన కేసులో మోనుపై కేసు నమోదైంది. శాంతి భద్రతల విభాగం అడిషనల్ డీజీపీ మమతా సింగ్ మాట్లాడుతూ.. సోషల్ మీడియా అభ్యంతరకరమైన పోస్టుపై మోనును అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అరెస్ట్‌పై మోనూ వాంటెడ్‌గా ఉన్న ఇతర రాష్ట్రాల్లోని పోలీసులకు కూడా సమాచారం అందించామని పేర్కొన్నారు. రాజస్థాన్ పోలీసులు మోను మనేసర్‌ను కోర్టు ద్వారా కస్టడీలో తీసుకోవచ్చని తెలిపారు. అసలెవరీ మోను మనేసర్ మోను మనేసర్ అలియాస్ మోహిత్ యాదవ్ బజరంగ్దళ్ సభ్యుడు. అంతేగాక గో సంరక్షుడు కూడా. ఇతరు గురుగ్రామ్‌లోని మనేసర్ ప్రాంతానికి చెందినవాడు. ముస్లిం వర్గానికి చెందిన ఇద్దరిని కారుతో సహా సజీవ దహనం చేసిన కేసులో మోను కీలక నిందితుడిగా ఉన్నాడు. అదే విధంగా హర్యానాలోని నూహ్‌లో కొన్ని రోజులపాటు మతపరమైన ఘర్షణలు చోటుచేసుకున్నాయి. హిందువులు తలపెట్టిన ర్యాలీపై మరో వర్గం వారు రాళ్లు రువ్వడంతో రాష్ట్రంలో చెలరేగిన హింసలో ఓ కానిస్టేబుల్‌తో సహా ఆరుగురు చనిపోయారు.. అయితే ఈ యాత్రలో మానేసర్ పాల్గొన్నాడనే సమాచారంతోనే కొందరు దాడికి తెగబడ్డారు. వాహనాలను దగ్ధం చేశారు. కాగా రాజస్థాన్ భరత్పూర్ జిల్లాలోని ఘట్మీకా గ్రామానికి చెందిన నసీర్, జునైద్‌లను ఫిబ్రవరి 15న గోసంరక్షకులు అపహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. మరుసటి రోజే హర్యానాలోని లోహారులో ఓ కారులో కాలిపోయిన స్థితిలో వారి మృతదేహాలు గుర్తించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. రాజస్థాన్ పోలీసులు ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేసి మోను మనేసర్‌ను నిందితుడిగా చేర్చారు. చదవండి: ‘భారత్ మండపం’ పరిస్థితి ఏమిటి? ఎవరైనా బుక్ చేసుకోవచ్చా? -
గోవులను పూజిస్తారు.. హింస తెలీదు
సాక్షి, జైపూర్: గో రక్షక దళాల పేరిట జరుగుతున్న దాడులకు అడ్డుకట్ట వేయాలంటూ ఈ మధ్యే సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు సూచించిన విషయం తెలిసిందే. అంతేకాదు ప్రతీ జిల్లాకు డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఓ టాస్క్ ఫోర్స్ బృందాన్ని నియమించాలని ఆదేశించింది కూడా. ఈ నేపథ్యంలో గో రక్షక దళాలను ఉద్దేశించి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌లో ఆరు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ఆయన జైపూర్, జామ్దోలిలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఆవులను దైవంగా పూజించే వారు చాలా ప్రశాంత మనస్తతత్వంతో ఉంటారని, ఎదుటివారు తమ మనోభావాలను దారుణంగా దెబ్బ తీసినా చాలా ఓపికతో ఉంటారని ఆయన చెప్పారు. అంతేకానీ హింసకు ఎట్టిపరిస్థితుల్లో పాల్పడబోరని భగవత్ పేర్కొన్నారు. మరి దాడులకు పాల్పడుతుంది గో రక్షక దళ సభ్యులు కాదా? అన్న ప్రశ్నకు భగవత్ సమాధానం దాటవేశారు. ఆవులను అక్రమంగా తరలిస్తున్నాడని ఆరోపిస్తూ కొంతమంది గో సంరక్షకులు ఈ యేడాది ఏప్రిల్ నెలలో రాజస్థాన్‌లోనే ఓ ముస్లిం వ్యక్తిని కొట్టి చంపిన విషయం తెలిసిందే. పెహ్లూ ఖాన్(50) అనే డైరీ ఫాం రైతుపై విచక్షణా రహితంగా అతని మీద దాడి చేయడంతో.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. సంచలనం సృష్టించిన ఈ కేసులో ఆరుగురు నిందితులకు నేర పరిశోధన విభాగం ఈ మధ్యే పోలీసులు క్లీన్‌చీట్ ఇవ్వగా.. స్థానికంగా పెద్ద ఎత్తున్న నిరసన వ్యక్తమైంది. తాము సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు పెహ్లూ కుటుంబ సభ్యులు ఇప్పటికే ప్రకటించారు. -
షాకింగ్: కాళ్లతో తన్ని.. బెల్టులతో కొట్టి!
భోపాల్: గో సంరక్షకుల పేరుతో దేశంలో రోజురోజుకు హింస పెరిగిపోతుంది. ఈ దాడులను అరికట్టడం పోలీసులకు తలనొప్పిగా మారుతోంది. ముఖ్యంగా యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కబేళాలను మూసేయడంతో వీటికి ఆజ్యం పోసినట్లయింది. గోరక్షకుకులు చేసే దాడులలో కొన్ని సందర్భాలలో అమాయకుల ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఓ విచారకర ఘటన వెలుగుచూసింది. పదికి పైగా గోరక్షకులు ఓ వ్యక్తిని కాళ్లతో తన్ని, బెల్టులతో చితకబాదారు. ఈ వీడియో చూసినట్లయితే.. బాధితుడిపై దాడి జరిగిన తీరు ఎంత దారుణమో తెలుస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. గో రక్షకులంటూ చెప్పుకుని వాళ్లు చేసిన దాడిని చుట్టుపక్కల ఉన్నవాళ్లు చోద్యం చూశారే తప్ప ఆపాలని చూడకపోవడం గమనార్హం. 'నన్ను కొట్టవద్దు.. నాకే పాపం తెలియదు. నన్ను వదిలిపెట్టండి' అంటూ ప్రాధేయపడ్డా వారి మనసు కరగలేదు. ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా పది మంది యువకులు గుర్తుతెలియని వ్యక్తిని రోడ్డుపై విచక్షణా రహితంగా చితకబాదారు. ఈ వీడియో ఆధారంగా దీనిపై కేసు నమోదు చేసిన ఉజ్జయిని పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరికొందరు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. -
షాకింగ్: కాళ్లతో తన్ని.. బెల్టులతో కొట్టి!
-
ఆ గోరక్షకులను గుర్తిస్తే నగదు రివార్డు!
గో సంరక్షణ పేరిట 55 ఏళ్ల పెహ్లూ ఖాన్‌ను కిరాతకంగా చంపిన ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాజస్థాన్ పోలీసులు ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. పెహ్లూ ఖాన్‌ను కొట్టిచంపిన 'గోరక్షకుల' గురించి ఎవరైనా సమాచారం ఇస్తే.. వారికి రూ. 5వేల రివార్డు ఇస్తామని ప్రకటించారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఆరుగురు దుండగులను గుర్తించారు. హర్యానాకు చెందిన పెహ్లూ ఖాన్ రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా మీదుగా గోవులను వాహనంలో తరలిస్తుండగా.. ఆయన బృందంపై రహదారిపై మాటువేసిన గోరక్షకులు అత్యంత దారుణంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్‌కు చెందిన కార్యకర్తలు ఈ దాడికి పాల్పడినట్టు భావిస్తున్నారు. ఈ దాడిలో నలుగురు గాయపడగా.. తీవ్రంగా గాయపడిన పెహ్లూ ఖాన్ అల్వార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఈ అమానుష దారుణంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
'జాగ్రత్త.. అలాంటి చెత్త పనులు సహించను'
కోల్‌కతా: గో సంరక్షకులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గో సంరక్షణ పేరుతో ఎవరైనా హింసాత్మక చర్యలకు పాల్పడితే, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హింసకు దిగే గోసంరక్షకులపై ఏమైనా చర్యలు తీసుకుంటారా అన్న ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానం ఇచ్చారు. 'వెజిటేరియన్స్ వెజ్‌ను.. నాన్ వెజిటేరియన్స్ నాన్ వెజ్ ను తింటారు. ఎవరు ఏం తినాలో ఏం తినకూడదో చెప్పడానికి అసలు వీళ్లంతా ఎవరు?. ఇలాంటి చెత్తపనులు మానుకోవాలని నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి తమ మతాన్ని సంరక్షించుకునే హక్కు ఉంది. యూరప్ లో గోవులను తింటారు. గిరిజనులు కూడా వాటిని తింటారు. మతం పేరిట ఏ ఒక్కరు ఈ అంశంపై అతి చేసినా వారిని వదిలిపెట్టే సమస్యే లేదు. నేను ఇలాంటి వాటిని అస్సలు సహించలేను. ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగితే డ్రైవర్ ది ఏ మతం అని అడుగుతున్నారు. ఈలోగా బాధితుడు ప్రాణాలుకోల్పోతున్నాడు. బాధితులకు నేరస్థుల నుంచి నష్టపరిహారం చెల్లించేలా ఓ బిల్లును వచ్చే సమావేశాల్లో తీసుకొస్తాం. దీనిని గత ఐదేళ్లకు వర్తింపజేసి అమలు చేస్తాం. రాజకీయాలు అనేవి సిద్దాంతాల పరంగా ఉండాలి తప్ప మతం, ప్రజల ఆధారంగా కాదు' అని మమత అన్నారు. -
గో రక్ష దళ్ చీఫ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు
చండీగఢ్: గో రక్ష దళ్ చీఫ్ సతీష్ కుమార్‌పై పంజాబ్ పోలీసులు సోమవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గోరక్షణ పేరుతో దాడులకు పాల్పడిన ఘటనపై సతీష్ కుమార్‌పై పాటు పలువురిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. కాగా గోవులను కబేళాకు తరలిస్తున్నారన్న నేపథ్యంలో యువకులపై దాడికి పాల్పడిన ఘటనలో సతీష్ కుమార్ సహా రాజ్‌పుర, అన్నూ, గుర్ప్రీత్ అలియాస్ హ్యాపీలపై ఐపీసీ సెక్షన్లు 382, 384, 342, 341, 323, 148, 149 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇప్పటివరకూ ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని వారు పేర్కొన్నారు. గో రక్షణ సమితి సభ్యులు దాడికి పాల్పడిన వీడియో ఒకటి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు పటియాల ఎస్ఎస్పీ చౌహాన్ మాట్లాడుతూ వీడియఓ ఫుటేజీని పరిశీలిస్తున్నామన్నారు. -
దుస్తులిప్పించి, కారుకు కట్టేసి కొట్టారు
అహ్మదాబాద్: గుజరాత్లో గోవు చర్మాలను తరలిస్తున్న నలుగురు యువకులపై గోసంరక్షణ సమితి కార్యకర్తలు దాడి చేశారు. నలుగురు యువకులను దుస్తులు విప్పించి, కారుకు కట్టేసి కర్రలతో చితకబాదారు. గిర్ సోమ్‌నాథ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ దృశ్యాలను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియలో పోస్ట్ చేశారు. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. గో సంరక్షణ సమితి కార్యకర్తలు.. నలుగురు యువకులను దూషిస్తూ వారి పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఒకరి తర్వాత మరొకరు కర్రలు తీసుకుని వారిని చితకబాదారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఐదుగురు నిందితుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.