దుస్తులిప్పించి, కారుకు కట్టేసి కొట్టారు | 4 Stripped, Tied To Car, Beaten In Gujarat By Alleged Cow Vigilantes | Sakshi

దుస్తులిప్పించి, కారుకు కట్టేసి కొట్టారు

Published Tue, Jul 12 2016 5:12 PM | Last Updated on Mon, Sep 4 2017 4:42 AM

దుస్తులిప్పించి, కారుకు కట్టేసి కొట్టారు

దుస్తులిప్పించి, కారుకు కట్టేసి కొట్టారు

అహ్మదాబాద్: గుజరాత్లో గోవు చర్మాలను తరలిస్తున్న నలుగురు యువకులపై గోసంరక్షణ సమితి కార్యకర్తలు దాడి చేశారు. నలుగురు యువకులను దుస్తులు విప్పించి, కారుకు కట్టేసి కర్రలతో చితకబాదారు. గిర్ సోమ్నాథ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ దృశ్యాలను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియలో పోస్ట్ చేశారు. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

గో సంరక్షణ సమితి కార్యకర్తలు.. నలుగురు యువకులను దూషిస్తూ వారి పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఒకరి తర్వాత మరొకరు కర్రలు తీసుకుని వారిని చితకబాదారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఐదుగురు నిందితుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement