గో రక్ష దళ్ చీఫ్పై ఎఫ్ఐఆర్ నమోదు | Punjab: crackdown on 'cow vigilantes', Gau Raksha Dal chief booked | Sakshi
Sakshi News home page

గో రక్ష దళ్ చీఫ్పై ఎఫ్ఐఆర్ నమోదు

Published Mon, Aug 8 2016 11:45 AM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM

Punjab: crackdown on 'cow vigilantes', Gau Raksha Dal chief booked

చండీగఢ్: గో రక్ష దళ్ చీఫ్ సతీష్ కుమార్పై పంజాబ్ పోలీసులు సోమవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గోరక్షణ పేరుతో దాడులకు పాల్పడిన ఘటనపై సతీష్ కుమార్పై పాటు పలువురిపై  పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. కాగా గోవులను కబేళాకు తరలిస్తున్నారన్న నేపథ్యంలో యువకులపై దాడికి పాల్పడిన ఘటనలో సతీష్ కుమార్ సహా రాజ్పుర, అన్నూ, గుర్ప్రీత్ అలియాస్ హ్యాపీలపై ఐపీసీ సెక్షన్లు 382, 384, 342, 341, 323, 148, 149 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అయితే ఇప్పటివరకూ ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని వారు పేర్కొన్నారు. గో రక్షణ సమితి సభ్యులు దాడికి పాల్పడిన వీడియో ఒకటి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు పటియాల ఎస్ఎస్పీ చౌహాన్ మాట్లాడుతూ వీడియఓ ఫుటేజీని పరిశీలిస్తున్నామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement