లింగనిర్ధారణ కేసులో వైద్యుడి అరెస్టు | Rajasthan cops arrest doctor, middleman for sex determination | Sakshi
Sakshi News home page

లింగనిర్ధారణ కేసులో వైద్యుడి అరెస్టు

Published Tue, Sep 13 2016 7:56 PM | Last Updated on Mon, Jul 23 2018 9:11 PM

Rajasthan cops arrest doctor, middleman for sex determination

గుజరాత్‌లో అక్రమంగా లింగనిర్ధారణ చేసిన కేసులో ఒక వైద్యుడిని, మధ్యవర్తిని రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్‌లోని మెహసానా ప్రాంతంలో గల ఒక ప్రైవేటు ఆస్పత్రిలో పోలీసు బృందం డెకాయ్ ఆపరేషన్ నిర్వహించింది. డాక్టర్ జయంతి లాల్ పటేల్ (64), మధ్యవర్తి నీరవ్ పటేల్ (23)లను ఈ సందర్భంగా అరెస్టు చేశారు. ఇద్దరినీ స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా, మేజిస్ట్రేట్ వారిని ఒకరోజు పోలీసు కస్టడీకి పంపారు.

లింగనిర్ధారణ చేసినందుకు డాక్టర్ రూ. 15వేలు తీసుకునేవారని, అయితే మధ్యవర్తి మరో రూ. 20వేలు తీసుకునేవారని పోలీసులు చెప్పారు. పిల్లలు పుట్టకముందే లింగ నిర్ధారణ పరీక్షలు చేసేవారిని పట్టుకోడానికి రాజస్థాన్ పోలీసులు తమ రాష్ట్రం వెలుపల నిర్వహించిన ఆపరేషన్లలో ఇది ఐదోది కావడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement