Dacoit
-
అడివి శేష్ కి గుడ్ బాయ్ చెప్పిన శృతి హాసన్.. ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్
-
డకాయిట్ మిస్టరీ.. శృతి పోయి మృణాల్ ఎలా వచ్చింది?
-
నాది వాటర్ పిస్టల్ కాదు: కాంగ్రెస్ ఎమ్మెల్యే వర్సెస్ దోపిడి దొంగ
జైపూర్: జగన్ గుర్జార్ అనే దోపిడి దొంగ హత్య, అపహరణ, లూటీలు, దోపిడిలకు సంబంధించి సుమారు 120కి పైగా కేసులు ఎదుర్కొంటున్నాడు. అయితే ఇటీవలే ధోల్పూర్ ఎమ్మెల్యేను బెదిరించినందుకు గానూ రాజస్థాన్ పోలీసులు అతనిపై మరింత నిఘా పెట్టారు. గత నెల ధోల్పూర్లోని కొంతమంది దుకాణదారులతో గుర్జర్‌కు గొడవ జరిగినప్పుడు ఈ వివాదం ప్రారంభమైనట్లు సమాచారం. అంతేకాదు దుకాణదారులను భయపెట్టేందుకు గుర్జర్ గాల్లోకి కూడా కాల్పులు జరిపాడని స్థానికులు చెప్పారు. దీంతో వ్యాపారులు పోలీసులకు, గిరిరాజ్ మలింగకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు తన గురించి వెతుకుతున్నారని తెలుసుకుని ఆగ్రహంతో ఎమ్మెల్యే గిరిరాజ్ సింగ్ మలింగను బెదిరిస్తూ ఒక వీడియోని విడుదల చేశాడు. ఆ వీడియోలో.. "కాంగ్రెస్ నాయకుడిని దుర్భాషలాడుతూ కనిపించాడు. అంతేకాదు మలింగ ఒక వ్యక్తిని చంపమని తనను అడిగాడని పేర్కొన్నాడు. పైగా ఆ వ్యక్తిని జస్వంత్ ఎమ్మెల్యే అని, కానీ తాను అతన్ని చంపలేదని కూడా చెప్పాడు. అంతేకాదు తనను ఎటువంటి భద్రతా లేకుండా ఎదుర్కొవాలంటూ ఎమ్మెల్యేకి ఒక సవాలు కూడా విసిరాడు". అయితే బారీ ఎమ్మెల్యే ఆ ఆరోపణలను ఖండించాడు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కూడా ప్రతిస్పందనగా దోపిడి దొంగను ఉద్దేశించి ఒక వీడియోని విడుదల చేశారు. ఆ వీడియోలో ఆ ఎమ్మెల్యే మాట్లాడుతూ...నేను ఎటువంటి పోలీసు రక్షణ తీసుకోలేదు. నేను అతని కోసం ఎదురుచూస్తున్నాను. అతను మగాడైతే నా ఇంటికి వచ్చి నన్ను ఎదుర్కోవాల అని ఒక కౌంటర్ వీడియో విడుదల చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే మలింగ మాట్లాడుతూ...ఈ వ్యక్తులు స్థానిక గుండాలు. పైగా నా ప్రజలను బెదరిస్తూ ఉంటే చూస్తూ కూర్చోను. నా దగ్గర ఉన్నది వాటర్ పిస్టల్ కాదు అని ఆగ్రహంగా చెప్పారు. ఈ క్రమంలో స్థానిక పోలీసులు మాట్లాడుతూ..జగన్ గుర్జర్‌ను అరెస్టు చేసిన వారికి రూ. 50 వేల రివార్డ్‌ను ప్రకటించాం. మేము అతని ఆచూకి కోసం చంబల్, మోరెనాలో వెతుకుతున్నాము. అతన్ని త్వరలోనే అరెస్టు చేస్తాం. అని ధోల్పూర్ పోలీసు సూపరింటెండెంట్ శివరాజ్ మీనా చెప్పారు. (చదవండి: మూడేళ్ల క్రితమే పెళ్లి.. వరుసకు బావతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో) -
బందిపోటు శెట్టి ‘కేసు’ క్లోజ్!
సాక్షి, హైదరాబాద్: నగర పోలీసు విభాగానికి ‘సుపరిచితుడైన’ మనీష్ శెట్టి అలియాస్ ఆర్ సర్వోత్తమ్ శెట్టి కథ ముగిసింది. కొన్నేళ్ల క్రితం అబిడ్స్‌లోని రాజ్యలక్ష్మీ జ్యువెలర్స్‌లో బందిపోటు దొంగతనానికి పాల్పడిన ముఠాకు లీడర్ ఇతడు. ఈ కేసు ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది. మూడు రాష్ట్రాల్లో 25కు పైగా భారీ కేసులో నమోదై ఉన్న ఈ శెట్టిని ప్రత్యర్థులు గత వారం బెంగళూరులో హత్య చేశారు. దీనిపై నగర పోలీసు విభాగానికి సమాచారం అందింది. కర్ణాటకలోని మంగుళూరుకు చెందిన మనీష్ శెట్టి ముంబైలో ఓ హోటల్లో సప్లయర్ కమ్ క్లీనర్‌గా చేరాడు. ఈ రకంగా వస్తున్న ఆదాయం కంటికి ఆనకపోవడంతో తన పంథా మార్చారు. నేరజీవితం ప్రారంభించిన మనీష్ శెట్టి తొలినాళ్లలో ఒంటరిగానే ముంబై లోకల్ రైళ్లల్లో జేబులు కత్తిరించాడు. ఆపై ఓ ముఠాను ఏర్పాటు చేసు కుని మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులతో పా టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను టార్గెట్‌గా చేసుకున్నాడు. జ్యువెలరీ దుకాణాలు, పెద్ద పెద్ద దుకాణాలు, బ్యాంకుల్లో దోపిడీలు, బందిపోటు దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలోనే ఇతడికి ఉత్తరాదికి చెందిన మాఫియా డాన్లు రవి పుజారీ, జన్నన్ జీ రాజా, ముత్తప్ప రాయ్‌లతో పరిచయం ఏర్పడింది. ఓ హత్యాయత్నం కేసులో అరెస్టై, నాసిక్ జైలుకు వెళ్ళిన శెట్టికి అక్కడే ఘరానా దొంగలైన వసంత్ సాలియానా, గోపాల్ రమణ శెట్టి, రవి కువూర్ అన్నా గౌడ, సర్వమిత్ర అలియాస్ వునీష్ అలియాస్ రాజు శెట్టి, విశ్వనాథ్ బాబు పిలాల్, రమేష్‌లతో పరిచయం ఏర్పడింది. వీరితో పాటు మరికొందరితో కలిసి హైదరాబాద్‌ను టార్గెట్‌గా చేసుకున్నాడు. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆ నగరానికి చేరుకుని తమ ‘పని’ పూర్తి చేద్దామని అంతా నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని బయట ఉన్న అనుచరులకూ చేరవేశారు. పథకం ప్రకారం 2006 ఏప్రిల్‌లో నగరానికి చేరుకున్న ఈ గ్యాంగ్ అబిడ్స్‌లోని రాజ్యలక్ష్మి జ్యువెలర్స్‌పై పంజా విసిరింది. రాత్రి 9.10 గంటల సమయంలో దుకాణం మూసే ముందు ఆయుధాలతో లోపలికి ప్రవేశించారు. ఈ దుండగులు రూ.1.5 కోట్ల విలువైన సొత్తును కేవలం 15 నిమిషాల్లో చేజిక్కించుకుని తమ క్వాలిస్ వాహనంలో ఉడాయించారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మహేష్, వసంత్‌లతో కూడిన గ్యాంగ్ పనిగా మెుత్తం 13 మంది పాల్గొన్నట్లు గుర్తించింది. వీరు ముంబై కేంద్రంగా ఓ అడ్డా ఏర్పాటు చేసుకున్నారని గుర్తించి అక్కడి పోలీసుల సాయంతో పట్టుకుంది. ఈ కేసులో బెయిల్‌పై వచ్చిన శెట్టి తన మకాంను మహారాష్ట్ర నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరుకు మార్చాడు. 2007 ఆగస్టులో అక్కడి బసన్వాడీ ప్రాంతంలో ఉన్న ఓ జ్యువెలరీ దుకాణంపై తన గ్యాంగ్‌తో పంజా విసిరి 5 కేజీల బంగారం దోచుకుపోయాడు. ఈ కేసులో అరెస్టయి జైల్లో ఉండగానే కేరళకు చెందిన సివిల్ కాంట్రాక్టర్‌ను చంపడానికి సుపారీ తీసుకున్నాడు. శెట్టి ఈ హత్య చేయడానికి మహ్మద్ ఖున్నీ అనే సుపారీ కిల్లర్‌ను పంపాడు. ఇతడు కేరళ పోలీసులకు చిక్కడం, విచారణలో శెట్టి పేరు బయటపెట్టడంతో మరోసారి జైలుకు వెళ్లాడు. ఇలా ఇతడిపై మొత్తం 25 భారీ కేసులు నమోదయ్యాయి. 2015లో శిక్ష పూర్తి చేసుకుని బయటకు వచ్చిన శెట్టి బెంగళూరులోని వివిధ ప్రైవేట్ సంస్థల్లో కెఫెటేరియాలు కాంట్రాక్టు తీసుకుంటూ గడిపాడు. 2018లో అక్కడి రెస్ట్ హౌస్ రోడ్లో ఉన్న డ్యూట్ బార్‌ను లీజుకు తీసుకున్నాడు. గత గురువారం ఈ బార్ నుంచే బయటకు వచ్చిన శెట్టిని ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు దగ్గర నుంచి కాల్చి చంపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న బెంగళూరు పోలీసులు గత శనివారం నలుగురిని అరెస్టు చేశారు. ఆధిపత్య పోరు నేపథ్యంలోనే కర్ణాటకలోని వివిధ ప్రాంతాలకు చెందిన శశికాంత్, అక్షయ్, గణేష్, నిత్య కలిసి శెట్టిని చంపారని తేల్చారు. శెట్టిని మృతికి సంబంధించిన బెంగళూరు పోలీసులు నగర అధికారులకు సమాచారం ఇచ్చారు. దీనిపై అధికారిక పత్రాలు సేకరించడానికి ఇక్కడి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ‘అత్యాచారం’ కేసులో డాలర్ భాయ్ అరెస్టు సాక్షి, సిటీబ్యూరో: పదకొండేళ్లుగా తనపై 143 మంది అత్యాచారం చేశారంటూ మిర్యాలగూడకు చెందిన బాధితురాలి ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో రాజశ్రీకర్ అలియాస్ డాలర్ భాయ్‌ని సీసీఎస్ మహిళా ఠాణా అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. బాధితురాలికి ‘అండగా’ ఉండి, ఆమెతో ఫిర్యాదు చేయించిన స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు డాలర్ భాయే ప్రధాన నిందితుడిగా మారాడు. ఈ కేసును పూర్తిస్థాయిలో సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్నామని, వెలుగులోకి వచ్చిన ఆధారాలను బట్టి చర్యలు తీసుకుంటున్నామని సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి మీడియాకు తెలిపారు. పంజగుట్ట రాణాలో కేసు నమోదు... తనపై అనేక మంది అత్యాచారం చేశారంటూ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో తొలుత పంజగుట్ట ఠాణాలో ఈ కేసు నమోదైంది. నిందితుల జాబితాలో కొందరు ప్రముఖులకు కూడా ఉన్నారు. దర్యాప్తు నిమిత్తం నగర నేర పరిశోధన విభాగానికి ఈ కేసు బదిలీ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సకత రేపిన ఈ కేసు దర్యాప్తు కోసం సీసీఎస్ మహిళా ఠాణా ఏసీపీ శ్రీదేవిని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్‌గా నియమించారు. కేసు దర్యాప్తు ముమ్మరంగా చేస్తుండగానే బాధితురాలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. సోమాజిగూడలో స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తూ, తనకు సాయం చేస్తున్నట్టు నటించిన రాజశ్రీకర్ అలియాస్ డాలర్ భాయ్ కారణంగానే ఈ ఫిర్యాదు చేశానని పేర్కొంది. అతగాడు చెప్పిన పేర్లు తన ఫిర్యాదులో పొందుపర్చానని చెప్పింది. దీన్ని పరిగణలోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు ఈ కేసులో డాలర్ భాయ్‌ని ప్రధాన నిందితుడిగా చేర్చారు. ప్రమేయం ఉన్నవారిపై చర్యలు... భవిష్యత్‌లో ఇబ్బందులు రాకుండా ఉండటానికి బాధితురాలితో న్యాయస్థానంలోనూ 164 స్టేట్మెంట్ రికార్డు చేయించారు. మాజీ భార్య ఫిర్యాదుతో డాలర్ భాయ్‌పై సీసీఎస్ మహిళా ఠాణాలో గతంలోనూ కేసు నమోదై ఉంది. ఫోన్ బెదిరింపుల నేపథ్యంలో నల్లగొండలో తాజాగా మరో కేసు నమోదైంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న కొందరిని ఇప్పటికే విచారించామని, ఆధారాలను బట్టి ప్రమేయం ఉన్న వారిని గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అవినాష్ మహంతి పేర్కొన్నారు. నిమిషాల్లో కేసు కొలిక్కి! సాక్షి, సిటీబ్యూరో: సాంకేతిక పరిజ్ఞానం ఏ స్థాయిలో అందుబాటులోకి వచ్చినా... పోలీసుల్లో సమయస్ఫూర్తి లేకపోతే పూర్తి స్థాయి ఫలితాలు ఉండవు. ఈ రెంటినీ జోడించిన ఆసిఫ్‌నగర్ క్రైమ్ టీమ్ పోలీసులు ఓ సెల్‌ఫోన్ స్నాచింగ్ కేసును కేవలం అర్ధగంటలో ఛేదించారు. నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఈ బృందాన్ని శుక్రవారం తన కార్యాలయానికి పిలిపించి అభినందించి జ్ఞాపికలు అందించారు. ఈ కేసుకు సంబంధించిన ‘క్లూ’ ఏమిటంటే... పిల్లర్ నెం.28 వద్ద స్నాచింగ్... నిర్మల్ జిల్లాకు చెందిన జి.రోజా నగరంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగిని. మెహిదీపట్నం అయోధ్యనగర్‌లోని ఓ హాస్టల్లో ఉంటూ సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నారు. ఈమె ఇటీవల ఓ రోజు రాత్రి 7.30కి మెహిదీపట్నంలోని పిల్లర్ నం.28 మీదుగా నడుచుకుంటూ వెళ్తుండగా.. ద్విచక్రవాహనంపై పక్కనుంచే వచ్చిన ఓ యువకుడు చేతిలోని సెల్‌ఫోన్ లాక్కొని ఉడాయించాడు. విషయం తెలిసిన మరుక్షణం... రోజా సమీపంలో ఉన్న ఓ వ్యక్తి నుంచి సెల్‌ఫోన్ తీసుకుని ‘డయల్–100’కు ఫోన్ చేశారు. ఈ కాల్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆసిఫ్‌నగర్ ప్రాంతానికి చెందిన బ్లూ కోల్ట్ కానిస్టేబుల్ భాస్కర్‌కు అందించింది. వెంటనే ఆయన పోలీసుస్టేషన్‌కు సమాచారం ఇవ్వగా.. ఆ సమయంలో అక్కడే ఉన్న క్రైమ్ కానిస్టేబుల్ శ్రీకాంత్ అప్రమత్తమయ్యారు. బాధితురాలు ‘100’కు ఫోన్ చేసిన నంబర్ తెలుసుకొని దానిని సంప్రదించారు. సమయస్ఫూర్తిగా వ్యవహరించి బాధితురాలి నుంచి ఆమెకు, ఫోన్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ఆ యాప్ సహాయంతో ముందుకు... రోజా విద్యాధికురాలు కావడం, సాఫ్ట్వేర్ రంగంలో ఉండటంతో ఆమె ఫోన్లో కచ్చితంగా ట్రాకింగ్ యాప్స్ ఉంటాయని భావించారు. ఇదే విషయాన్ని రోజాను అడగ్గా... తన ఫోన్లో ట్రాక్ మై డివైజ్ యాప్ ఉందని చెప్పారు. దీంతో భాస్కర్‌తో కలిసి బయలుదేరిన శ్రీకాంత్... ఆమె యూజర్ ఐడీ, పాస్వర్డ్ తీసుకున్నారు. వీటిని వినియోగించి తన ఫోన్ నుంచే ఆ యాప్‌లోకి గెస్ట్‌గా లాగిన్ అయ్యారు. దీంతో ఆ డివైజ్ (ఫోన్) గోల్కొండ వైపు వెళ్లి... అక్కడే స్విచ్ఛాఫ్ అయినట్లు యాప్ చూపించింది. రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన నిందితుడు ... సదరు యాప్ చూపించిన దిశలో వెళ్లిన శ్రీకాంత్, భాస్కర్లు ఓ నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఓ యువకుడు చేతిలో రెండు ఫోన్లు ఉండటం గమనించి పట్టుకున్నారు. ఫోన్లను పరిశీలించగా వాటిలో రోజాకు చెందిన నీలిరంగు ఫోన్ కూడా ఉంది. నిందితుడు గోల్కొండకు చెందిన అథర్గా గుర్తించి స్టేషన్‌కు తరలించారు. రోజా ఫిర్యాదుతో అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఈ కానిస్టేబుళ్లల్లో ఇలాంటి స్ఫూర్తి నింపిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఆకుల శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ ఎన్.రవీందర్, ఏసీపీ ఆర్జీ శివమారుతిలను కమిషనర్ అభినందించారు. స్నేహితుడితో కలిసి టీవీల చోరీ సనత్‌నగర్: తాను పని చేస్తున్న సంస్థలో స్నేహితుడితో కలిసి 27 టెలివిజన్ సెట్లను అపహరించాడో వ్యక్తి. పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసి సొత్తును స్వాధీనం చేసుకున్నారు. బేగంపేట ఠాణాలో శుక్రవారం ఏసీపీ నరేష్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... రాంగోపాల్‌పేట నల్లగుట్టకు చెందిన నీలం ప్రణీత్ సాయి (21) బేగంపేటలోని సామ్సంగ్ డీలర్స్ అయిన త్రివిక్రమ గోడౌన్లో చెక్స్ కలెక్షన్ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఇతను గోడౌన్‌లోని 32 ఇంచుల సామ్సంగ్ టీవీలు రోజుకొకటి చొప్పున చోరీ చేసి.. తన స్నేహితుడు ఠాక్రే హరీందర్ (19) సహాయంతో వాహనంలో తరలించేవాడు. గోడౌన్‌లోని టీవీలు చోరీ అవుతుండటంతో నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రణీత్‌సాయి, హరీందర్ లను అదుపులోకి తీసుకుని విచారించగా తామే చోరీ చేసినట్టు ఒప్పుకున్నారు. పోలీసులు వీరి అరెస్టు చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. చోరీ కేసును ఛేదించిన బేగంపేట ఠాణా సిబ్బందిని ఏసీపీ అభినందించారు. సమావేశంలో ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, డీఐ శేఖర్ పాల్గొన్నారు. -
సినీ ఫక్కీలో దారి దోపిడీ
మహబూబ్‌నగర్: కొల్లాపూర్ సమీపంలో ఇద్దరు గుర్తుతెలియని దుండగులు రామాపురానికి వెళ్లే ప్రధాన రహదారిపై కాపు కాసి దారి దోపిడీ చేసిన సంఘటన గురువారం అర్ధరాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే గురువారం అర్థరాత్రి 1:30గంటల సమయంలో ఇద్దరు గుర్తుతెలియని దుండగులు కొల్లాపూర్ నుంచి రామాపురం వెళ్లే దారిలో ఊరాటిగుట్ట వద్ద ప్రధాన రహదారిపై చెట్టు కొమ్మలను అడ్డంగా పడవేశారు. అదే సమయంలో కొల్లాపూర్ నుంచి పెబ్బేరుకు డీసీఎంవ్యాన్ బయలుదేరింది. రోడ్డుపై ఉన్న చెట్ల కొమ్మలను తొలగించేందుకు డీసీఎం డ్రైవర్ ఫయూం, క్లీనర్ రఘులు ప్రయత్నించగా పొదల మాటున కాపు కాసిన ఇద్దరు దుండగులు గొడ్డళ్లు, కత్తులతో వారిని చంపుతామంటూ బెదిరించారు. వారి జేబులో నగదు లేకపోవడంతో సెల్ఫోన్లు లాక్కున్నారు. కొద్దిసేపటికి పెంట్లవెల్లికి చెందిన సుదర్శన్‌చారి మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా రోడ్డుపై డీసీఎం వాహనం నిలిపి ఉండటం, రోడ్డుకు అడ్డంగా చెట్టు కొమ్మలు పడి ఉండటాన్ని గమనించి ఆయన అక్కడే ఆగిపోయాడు. దుండగులు ముళ్ల పొదల నుంచి అక్కడికి వచ్చి అతని జేబులోని రూ.2వేల నగదు, సెల్‌ఫోన్‌ను లాక్కొని డీసీఎంలోనే కూర్చోబెట్టారు. 45 నిమిషాల తర్వాత తిరుపతి నుంచి వస్తున్న తుఫాన్ వాహనాన్ని దుండగులు అడ్డగించారు. అందులో ప్రయాణిస్తున్న మేనుగొండ హమాలీ వెంకటస్వామి మెడలో ఉన్న ఐదు తులాల బంగారు నగలను, రూ.3వేల నగదు, ప్రయాణికుల సెల్ఫోన్లను లాక్కొని వారిని పంపించారు. కొద్దిసేపటి తర్వాత డీసీఎంలో ఉన్న సుదర్శనాచారికి తమ వద్ద ఉన్న సెల్ఫోన్లన్నీ అప్పగించి సోమశిల గట్లవైపు దుండగులు వెళ్లిపోయారు. సుదర్శనాచారి వెంటనే కొల్లాపూర్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని దారి దోపిడీ పై ఫిర్యాదు చేశారు. అప్పటికే మేనుగొండ వెంకటస్వామి కూడా అక్కడకు చేరుకొని పోలీసులకు జరిగిన విషయాన్ని వివరించారు. సీఐ రాఘవరావు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని దుండగుల కోసం గాలించారు. దుండగుల ఆచూకీ వారికి లభించలేదు. రోడ్డుపై ఉన్నచెట్టు కొమ్మలను తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మిస్టరీగా మారుతున్న కేసులు
ఆదిలాబాద్/మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లాలో దోపిడీ దొంగలు అలజడి సృష్టిస్తున్నారు. గొలుసుకట్టు హత్యలతో హతమారుస్తూ, దోపిడీకి పాల్పడుతున్నారు. నగలు, నగదు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. అడ్డొచ్చినవారిని మానవత్వం లేకుండా రాడ్లు, కత్తులతో చిన్నా, పెద్దా అని చూడకుండా నరుకుతూ తమ పనికానిస్తున్నారు. ప్రధానంగా తల, ముఖంపై బాదుతున్నారు. ఒంటిపైన నగలు, బీరువాలో దాచుకున్న విలువైన సామగ్రిని దోచుకెళ్తున్నారు. మూడేళ్లలో రాత్రి, పగలు తేడా లేకుండా జిల్లాలో దాదాపు 1500పైగా దొంగతనాలు జరిగాయి. నాలుగేళ్లలో రూ.8 కోట్లకుపైగా సొత్తు దొంగలు దోచుకెళ్లారు. ఉదయం రెక్కీ నిర్వహిస్తూ రాత్రి దొంగతనానికి పాల్పడుతున్నారు. ఇంటికి తాళం వేసి ఉంటే చాలు ఆ రోజు రాత్రి ఆ ఇ ల్లు గుల్ల అయినట్టే. ఇల్లే కాకుండా, బ్యాం కులు, దుకాణాలకు కూడా కన్నం వేస్తున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. స్థానికుల సహకారంతో పొరుగు రాష్ట్రంవారు పనికానిచేస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి. పోలీసులు మాత్రం కేసులను ఛేదించడంలో విఫలం చెందారు. అంతర్రాష్ర్ట ముఠా పనేనా? జిల్లాలో దొంగతనాలు, హత్యలు అనేకం జరిగాయి. తాజాగా బాసరలో ముగ్గురి హత్య, మంచిర్యాలలో ఇద్దరి హత్య వెనుక పగలు, ప్రతీకారాలు లేవు. కేవలం నగలు, నగదు కోసమే చేసినట్లు తెలుస్తోంది. ఈ హత్యలను పరిశీలిస్తే అంతర్రాష్ర్ట్ర దొంగల ముఠా కిరాతకంగా పోలీసులు భావిస్తున్నారు. ముందుగా హత్య చేసిన తర్వాత దోపిడీకి పాల్పడినట్లు తెలుస్తోంది. గతంలో స్థానికంగా డబ్బులు, నగల కోసం హత్యలు జరిగినా దొంగల ముఠాల ప్రమేయం లేదు. రెండు రోజుల క్రితం జరిగిన ఐదుగురి హత్యలు ప్రొఫెషనల్ కిల్లర్ల పనేనని పోలీసులు కూడా సందేహిస్తున్నారు. పాత నేరస్థుల సహకారం ఏమైనా ఉందా? అనే కోణంలో విచారిస్తున్నారు. జిల్లా సరిహద్దు పెద్దదిగా ఉండటం, చుట్టూ మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు ఉండటం, రైల్వే మార్గం కూడా ఉండటంతో దొంగలు సులువుగా తప్పించుకోవడానికి వీలుంది. ఈ రాష్ట్రాలతోపాటు బీహార్, తమిళనాడు దొంగల ముఠాల ప్రమేయం ఉందా అనే ఆందోళనను జిల్లావాసులు వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలోని పార్ది ముఠా దొంగలు ఇలాంటి దురాగతాలకు పాల్పడతారని పోలీసులు అనుమానిస్తున్నారు. పక్కనున్న నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి సంఘటనలు అనేకం జరిగినట్లు పోలీసుల దృష్టిలో ఉంది. ఈ కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. కొలిక్కిరాని కేసులు పశ్చిమ ప్రాంతంలో.. ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్‌లో కొన్నేళ్ల క్రితం ఓ ఇంట్లో చొరబడి దొంగలు వృద్ధురాలి చెవులు కోసి నగలు అపహరించి దారుణంగా హతమర్చారు. నిర్మల్‌లోని శాస్త్రీనగర్‌లో 2002లో ఓ బ్యాంక్ మేనేజర్ ఇంట్లో చొరబడి ఆయనను హతమర్చి, ఆయన భార్యను తీవ్రంగా గాయపర్చి ఇంట్లోని నగలు, డబ్బులు ఎత్తుకెళ్లారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఖోజా కాలనీలో కొన్నేళ్ల కిందట ఓ ఇంట్లో చొరబడ్డ దొంగలు కత్తులతో దాడిచేసి ఒకరిని హతమర్చడమే కాకుండా తుపాకీతో కాల్పులు జరపడం సంచలనం కలిగించింది. నిర్మల్ పట్టణంలోని ఆదర్శ్‌నగర్‌లో ఓ ఇంట్లో చొరబడ్డ దొంగలు కత్తులతో బెదిరించి సుమారు 60 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. జూన్ 3, 2013న ఇచ్చోడ దక్కన్ గ్రామీణ బ్యాంక్ క్యాషియర్, అటెండర్ కలిసి ఆదిలాబాద్‌లోని డీజీబీ మెయిన్ బ్రాంచ్ నుంచి రూ.30 లక్షలు తీసుకొని ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా దేవాపూర్ చెక్‌పోస్టు వద్ద పట్టపగలే ముగ్గురు దోపిడీ దొంగలు ద్విచక్ర వాహనంపై వచ్చి బ్యాంక్ సిబ్బంది కంట్లో కారం చల్లి డబ్బులు ఎత్తుకెళ్లారు. ఈ కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో ఇప్పటికీ ఒక అడుగు కూడా ముందుకు పడలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తూర్పు ప్రాంతంలో.. గతేడాది ఏప్రిల్ 2న మంచిర్యాల ఐబీ పక్కన పాల విక్రయ కేంద్రం వ్యాపారి వేమురెడ్డి వెంకటేశ్వర్‌రెడ్డి హత్యకు గురయ్యారు. వెంకటేశ్వర్‌రెడ్డి హత్యను పోలీసులు తీవ్రంగా పరిగణించారు. దోపిడీ దొంగలను పట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. బెల్లంపల్లి అదనపు ఎస్పీ భాస్కర్‌రావు, అప్పటి మంచిర్యాల సీఐలు భీమన్న, లక్ష్మీనర్సింహస్వామిలు కేసును ఛేదించేందుకు పరిశోధన చేశారు. ప్రతి రోజు పాలకేంద్రానికి వచ్చేవారిని, కరీంనగర్ నుంచి పాలు తీసుకవచ్చే వాహనం డ్రైవర్‌ను విచారించారు. అయితే క్లీనర్ రాకపోవడంతో పోలీసులకు అనుమానం కలిగింది. ఆ అనుమానమే నిందితులను పట్టించింది. క్లీనర్ రోజు పాల అమ్మకాల ద్వారా వచ్చే రూపాయలు పెద్ద మొత్తంలో వెంకటేశ్వర్‌రెడ్డి దగ్గర నిల్వ ఉన్నాయనే విషయం తెలుసుకున్న క్లీనర్ మహారాష్ట్రకు చెందిన మరో ముగ్గురు నిందితులతో కలిసి హత్యకు పథకం రచించాడు. అనంతరం పోలీసులకు దొరికాడు. నాలుగేళ్ల క్రితం మంచిర్యాలలోని యమహ షోరూంలో పనిచేసే వాచ్‌మన్ హత్యకు గురయ్యాడు. యమహ వాహనంతోపాటు క్యాష్‌కౌంటర్‌లో నగదు దోపిడీకి గురైంది. సంచలనం రేకెత్తించిన కేసు కూడా పోలీసులు తమదైన శైలిలో విచారించారు. చివరకు షోరూంలో పని చేసే ఓ యువకుడు డబ్బుల కోసం మిత్రులతో కలిసి వాహనాల దొంగతనానికి పాల్పడ్డాడు. వాచ్‌మన్ వారిని వారించబోతూ నిందితున్ని గుర్తించాడు. తమగుట్టు రట్టుకాకుండా వాచ్‌మన్‌ను హత్యచేశాడు. చివరకు పోలీసులకు దొరికారు. అలాగే మంచిర్యాల పురపాలక సంఘంలో టౌన్‌ప్లానింగ్ అధికారి క్లిస్టఫర్రాజు తల్లిని కూడా ఓ దొంగ బంగారం కోసం హత్యచేశాడు. 2009 సంవత్సరంలో ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడేందుకు ప్రయత్నిస్తుండగా అప్పుడే అటుగా వచ్చిన గుర్కాను దొంగలు హత్య చేశారు. ఆ తర్వాత నిందితులు మరో కేసులో పోలీసులకు పట్టుబడడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. మందమర్రిలో గతేడాది ఆగస్టులో దక్కన్ గ్రామీణ బ్యాంకులో భారీ దోపిడీ జరిగింది. రూ.18 లక్షలు ఎత్తుకెళ్లారు. అయితే ఇప్పటికీ దొంగల ఆచూకీ లభించలేదు. ఈ నెల 9వ తేదీన బెల్లంపల్లిలోని 2 ఇంక్లైన్లో రవి ఇంట్లో దొంగలు 10 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. ఇంట్లో లేని సమయంలో దొంగలుపడి రూ.2.55 లక్షల విలువ గల బంగారు నగలు, రూ.2 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఈ కేసులో ఇప్పటికీ మిస్టరీ తేలలేదు.