పోలీస్‌ స్టేషన్ల ఆధునికీకరణకు చర్యలు | police stations developments | Sakshi
Sakshi News home page

పోలీస్‌ స్టేషన్ల ఆధునికీకరణకు చర్యలు

Jan 12 2017 11:44 PM | Updated on Aug 21 2018 9:20 PM

రాష్ట్రంలోని పోలీస్‌స్టేçÙన్లను ఆధునికీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు డిప్యూటీ సీఎం, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. పోలీస్‌ కన్వన్ష¯ŒS హాలులో ఏపీ పోలీసు అధికారుల సంఘం రూపొందించిన 2017 పోలీస్‌ డైరీని గురువారం

  • హోం మంత్రి చినరాజప్ప
కాకినాడ క్రైం (కాకినాడ సిటీ) : 
రాష్ట్రంలోని పోలీస్‌స్టేçÙన్లను ఆధునికీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు డిప్యూటీ సీఎం, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. పోలీస్‌ కన్వన్ష¯ŒS హాలులో ఏపీ పోలీసు అధికారుల సంఘం రూపొందించిన 2017 పోలీస్‌ డైరీని  గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో రాజప్ప మాట్లాడుతూ  2016లో జిల్లా లో జరిగిన ఆందోళనలపై పోలీసులు ఎంతో సంయమనం పాటించారని కితాబిచ్చారు. నేరాల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నట్టు చెప్పారు. ఎస్పీ ఎం.రవిప్రకాశ్‌ మాట్లాడుతూ  అధికారుల తప్పులు పునరావృతమైతే ఏ స్థాయి అధికారినైనా ఉపేక్షించమన్నారు. ఏఎస్పీ ఏఆర్‌ దామోదర్, ఓఎస్డీ వై.తరవిశంకర్‌రెడ్డి, జిల్లా పోలీసు అధికారుల సంఘ గౌరవాధ్యక్షుడు జి.బలరామమూర్తి, జిల్లా అధ్యక్షుడు జి.బ్రహ్మాజీరావు, కార్యదర్శి మధుసూదనరావు పాల్గొన్నారు.
జిల్లాలో రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యం..
కాకినాడ రూరల్‌ (కాకినాడ రూరల్‌ నియోజకవర్గం) : జిల్లాలోని పలు రహదారుల విస్తరణకు చర్యలు తీసుకుంటున్నట్టు డిప్యూటీ సీఎం చినరాజప్ప చెప్పారు. ఇంద్రపాలెం వద్ద ఆర్‌అండ్‌బీ వంతెనను ఆయన ప్రారంభిం చారు. జగన్నాథపురం వద్ద రూ.100 కోట్లతో వంతెన, రోడ్ల విస్తరణకు సీఎం చంద్రబాబు అంగీకరించారన్నారు. సర్పవరం వద్ద నాలుగు లైన్ల వంతెనకు శంకుస్థాపన చేశారు. సూర్యారావుపేటలో నిర్మించిన బ్రిడ్జిని  ప్రారంభిం చారు. జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు, ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, దాట్ల బుచ్చిరాజు,  కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ పాల్గొన్నారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement