rajappa
-
రోజుకూలీ రాజప్ప.. ఇతను సామాన్యుడు కాదప్పా!!
బెంగళూరు : ఫొటోలోని వ్యక్తి పేరు రాజప్ప. బాహుబలిలో కట్టప్ప కంటే ఎక్కువ వినయాన్ని ప్రదర్శిస్తాడు. రోజు కూలీనని, ఏమీ లేనివాడినని చెప్పుకుంటాడు. ఒకప్పుడది నిజమే. కానీ ఇప్పుడతను కోటీశ్వరుడు! పెద్ద నోట్ల రద్దును అనకూలంగా మార్చుకున్న అక్రమార్కుల్లోఒకడు!! తాను నివసించే ఖరీదైన ఇంట్లో 27 కిలోల గంజాయి మూటలతో అడ్డంగా దొరికిపోయిన రాజప్పను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. అతని గురించి పోలీసులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి.. రోజు కూలీగా జీవితాన్ని ఆరంభించి.. : దక్షిణ కర్ణాటకలోని చామ్రాజ్నగర్ జిల్లాకు చెందిన పేద రాజప్ప చాలా ఏళ్ల కిందటే బెంగళూరు నగరానికి వలస వచ్చాడు. భవన నిర్మాణంలో రోజు కూలీగా పనిచేస్తూ పొట్టపోసుకుంటూ కాలం గడిపేవాడు. రాజప్ప సొంత ఊరు గంజాయి సాగుకు చాలా ఫేమస్. ఇంటికి వెళ్లినప్పుడల్లా సరదాగా కొంత గంజాను తీసుకొచ్చి తక్కువ ధరకే తోటి కూలీలకు ఇచ్చేవాడు. క్రమంగా వారంతా ఆ మత్తుపదార్థానికి బానిసలయ్యారు. గంజాయి సప్లయర్‌గా రాజప్పకు డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు గ్రాముల్లో మొదలైన స్మగ్లింగ్ క్రమంగా టన్నులకు చేరింది. ఎడాపెడా గంజాయి అమ్మేసి కోట్లు గడించాడు రాజప్ప. ఎప్పటి నుంచో కన్నేసిన పోలీసులు.. ఇటీవలే రాజప్ప ఇంటిపై దాడిచేసి పక్కా సాక్ష్యాదారాలతో కేసు నమోదుచేశారు. నోట్లరద్దుతో ప్రముఖుడయ్యాడు : గంజాయి కేసులో అరెస్టైన రాజప్పను పోలీసులు విచారించగా పలు సంచలన విషయాలు వెల్లడయ్యాయి. దందాలో పోగేసిన కోట్లాది రూపాయల నల్లధనాన్ని నోట్ల రద్దు తర్వాత తెల్లధనంగా మార్చుకున్నాడు రాజప్ప. అందుకోసం న్యాయవాదులు, బినామీలు, అకౌంటెంట్లతో భారీ సెటప్ చేసుకున్నాడు. నోట్ల రద్దు తర్వాత రాజప్ప అకౌంట్లో నిల్వలు భారీగా పెరగడంపై ఐటీ శాఖ వివరణ కోరగా.. నకిలీ పత్రాలు చూపించి తప్పించుకున్నాడు. అరెస్టు తర్వాత అసలు నిజం వెలుగులోకి రావడంతో అతనిపై చర్యలకు ఐటీ శాఖ సిద్ధమైంది. గంజాయి కేసు నిరూపణ అయితే రాజప్పకు భారీ శిక్ష తప్పదు. ప్రస్తుతం అతను జ్యుడిషిల్ రిమాండ్ ఉన్నాడు. -
కంటి చూపు ఇప్పించండి
డిప్యూటీ సీఎంను వేడుకున్న బాధితులు న్యాయం చేస్తామని రాజప్ప హామీ పూర్తిస్థాయి విచారణకు కలెక్టర్‌కు ఆదేశం శిబిరాల నిర్వహణలో ప్రభుత్వ వైద్యులు ఉండేలా ఆదేశాలు ఇచ్చేందుకు చర్యలు వేట్లపాలెం (సామర్లకోట) : పోయిన కంటి చూపు వచ్చేలా వైద్య పరీక్షలు చేయించాలని బాధితులు డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్పను వేడుకున్నారు. బుధవారం వేట్లపాలెంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి రాజప్ప ఆ గ్రామ సర్పంచ్ వల్లూరి శేషవేణి స్వగృహం వద్ద లయన్స్ క్లబ్ ఆస్పత్రి నిర్వహించిన శస్త్ర చికిత్సల్లో చూపు కోల్పోయిన బాధితులను పరామర్శించారు. ఈ నెల 4న సాక్షి దినపత్రిక ‘చీకటి నింపిన శస్త్ర చికిత్స’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో అధికారులు, రాజకీయ నాయకులు వారి వద్దకు వచ్చి పరిస్థితి తెలుసుకొంటున్నారు. ఈ సందర్భంగా కంటి శస్త్ర చికిత్స చేయించుకున్న రామిశెట్టి సత్యవతి, కుప్పాల కృపారావు, చిట్టూరి సత్యనారాయణ, బావిశెటి రాంబాయి, గొడత రామకృష్ణ, బొండాడ సత్యానందం తమకు కంటి చూపు వచ్చేలా చేయాలని డిప్యూటీ సీఎం రాజప్పను వేడుకున్నారు. కంటి చూపు పోవడానికి గల కారణాలను గ్రామ ఉపసర్పంచ్ వల్లూరి శ్రీనివాసు రాజప్పకు వివరించారు. ఈ మేరకు బాధితులకు న్యాయం చేస్తామని రాజప్ప హామీ ఇచ్చారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ఏప్రిల్ 13న లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటి శిబిరంలో వేట్లపాలేనికి చెందిన వారు 10 మంది శస్త్ర చికిత్సలు చేయించుకున్నారని వారిలో 8 మందికి కళ్లు కనిపించడం లేదన్నారు. వారి సమస్యపై కాకినాడలోని ప్రభుత్వ వైద్యాధికారులతో చర్చించామని, బాధితులకు మెరుగైన వైద్యం చేయించి కంటి చూపు వచ్చేలా చేస్తామని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని జిల్లా కలెక్టరును ఆదేశించామన్నారు. ఉచిత వైద్య శిబిరాలు జరిగే సమయంలో సంబందిత ప్రభుత్వ వైద్యులు హాజరు కాక పోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందన్నారు. శిబిరాలు జరిగే సమయంలో ప్రభుత్వ వైద్యులు తప్పనిసరిగా ఉండేలా ఆదేశాలు జారీ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొడత మార్త, జెడ్పీటీసీ సభ్యురాలు గుమెళ్ల విజయలక్ష్మి పాల్గొన్నారు. -
మాట వినకుంటే పింఛన్లు పీకేస్తా
ఆర్బీపట్నం మహిళలపై మంత్రి రాజప్ప చిందులు ఆర్బీ పట్నం (పెద్దాపురం) : మేం చెప్పిందే వేదం.. మేం చేసిందే అభివృద్ధి.. ఏమనుకుంటున్నారో... వేషాలు వేస్తే మహిళలని చూడం. అవసరమైతే పింఛన్లు పీకేస్తాం. ఇవి ఎవరో తెలుగు తమ్ముడు అన్నమాటలు కావు .. సాక్షాత్తూ రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఊగిపోతూ మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైనమిది. పెద్దాపురం మండలం రాయభూపాలపట్నం గ్రామంలో మంగళవారం అభివృద్ధి కార్యక్రమాల పేరుతో రాత్రి వేళ గ్రామంలోకి వచ్చిన రాజప్పకు తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేవారు. తమ ఊరు అభివృద్ధిపై దృష్టి సారించాలని మహిళలు చెప్పే లోపే ఆయన ఆగ్రహంతో ఊగిసలాడిపోయారు. మహిళలని చూడకుండానే ఏదో పార్టీల అండ చూసుకుని ఇష్టం వచ్చినట్టు అడుగుతున్నారు. మేం చేసే అభివృద్ధి పనులకే వత్తాసు పలకాలంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అవసరమైతే మీ పింఛన్లు పీకేస్తా.. అభివృద్ధికి సహకరించాలే తప్ప వేషాలు వేస్తే ఊరుకునేది లేదంటూ ఆగ్రహానికి లోనయ్యారు. దీనిని బట్టి అర్థమౌతోంది మంత్రి రాజప్పకు అభివృద్ధిపై ఎంత ఆసక్తి ఉందో. అంతేగాకుండా ఆ గ్రామానికి అనుకున్న సమయానికి వస్తే మహిళలు ప్రశ్నలు అడుగుతారనే ఆలస్యంగా వచ్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
పార్కుగా పాత అక్విడెక్టు అభివృద్ధి
ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప పి.గన్నవరం : పాత అక్విడెక్టును పార్కుగా తీర్చిదిద్ది, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. స్థానిక కొత్త అక్విడెక్టు ముఖద్వారంలో కొలువు దీరిన శ్రీపంచముఖాంజనేయస్వామి ఆలయంపై నిర్మించిన 70 అడుగుల అభయాంజనేయస్వామి విగ్రహాన్ని ఆయన ఆదివారం ఆవిష్కరించారు. మిర్తిపాటి సూర్యనారాయణ నేతృత్వంలో పూజ్యం విశ్వనాథశర్మ ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. తొలుత ఆలయ కమిటీ చైర్మ¯ŒS పడాల వెంకటేశ్వరరావు(సూపర్) ఆధ్వర్యంలో చినరాజప్పకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాజప్ప ఆంజనేయస్వావిుకి ప్రత్యేకపూజలు చేసి, హోమ గుండం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం చైర్మ¯ŒS పడాల సూపర్ అధ్యక్షతన జరిగిన సభలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆ«ధ్మాత్మిక భావనను పెంపొందించుకుని సమాజానికి సేవలు అందించాలన్నారు. దాతల సాయంతో సుమారు 1.6 కోట్ల వ్యయంతో ఆలయాన్ని, 70 అడుగుల విగ్రహాన్ని నిర్మించిన సూపర్‌ను అభినందించారు. సూపర్‌ను చినరాజప్ప తదితరులు దుశ్శాలువాలతో సన్మానించారు. జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు, ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యేలు పాముల రాజేశ్వరీదేవి, బండారు సత్యానందరావు, ఎంపీపీ సంసాని లక్ష్మీగౌరి, సర్పంచ్ చుట్టుగుల్ల షర్మిలారమణ, ఎంపీటీసీ సభ్యురాలు తాటికాయల వీవీఎల్ఎ¯ŒS దేవి, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి డొక్కా నాథ్‌బాబు తదితరులను ఆలయ కమిటీ సత్కరించి స్వామి చిత్ర పటాలను అందజేసింది. వివిధ గ్రామాలకు చెందిన వేలాదిమంది స్వామివారికి పూజలు చేశారు. కమిటీ ఆధ్వర్యంలో అన్న సమారాధన చేశారు. కార్యక్రమాల్లో జెడ్పీటీసీ సభ్యురాలు గంగుమళ్ల కాశీ అన్నపూర్ణ, ఉలిశెట్టి బాబీ, సుంకర బుల్లెట్, చొల్లంగి సత్తిబాబు, కోటిపల్లి గంగరాజు, పడాల రామ లక్ష్మణ్, కొక్కిరి రవికుమార్, వాసంశెట్టి కుమార్, అన్నాబత్తుల అనుబాబు, గణేశుల శ్రీవెంకట కొండలరావు, ఇందుకూరి నర్శింహరాజు, సంసాని పెద్దిరాజు, గణపతి రాఘవులు తదితరులు పాల్గొన్నారు. -
సెటిల్మెంట్లు చేస్తే చర్యలు తప్పవు
హోం మంత్రి రాజప్ప హెచ్చరిక అమలాపురం టౌన్ : న్యాయవాద వృత్తి చేస్తూ కొందరు భూ కబ్జాలు, సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారని, అలాంటి న్యాయవాదులను ఉపేక్షించేది లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప హెచ్చరించారు. సెటిల్మెంట్లు, భూ కబ్జాలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే న్యాయవాదులపై కేసులు నమోదు చేసి జైళ్లకు కూడా పంపుతామని స్పష్టం చేశారు. అమలాపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక అసోసియేషన్ కార్యాలయ ప్రాంగణంలో పలువురు ప్రజాప్రతినిధులకు ఆదివారం జరిగిన సత్కార సభకు రాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అమలాపురం బార్ అసోసియేషన్‌కు ఎంతో ఘన చరిత్ర ఉంది. ఇక్కడ న్యాయవాదులుగా పనిచేసి నేడు న్యాయమూర్తులుగా అనేక మంది ఉన్నత స్థానాల్లో ఉన్నారని రాజప్ప గుర్తు చేశారు. అలాంటి అమలాపురంలో కొంత మంది న్యాయవాదులు సెటిల్మెంట్లు, భూకబ్జాలకు పాల్పడుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని చెప్పారు. అమలాపురంలో రౌడీయిజాన్ని అణిచివేశాం, తప్పు ఎవరు చేసినా క్షమించేది లేదన్నారు. రాష్ట్రంలో సెటిల్మెంట్లు, భూ కబ్జాలకు ముఖ్యంగా నకిలీ డాక్యుమెంట్లు... నకిలీ రిజస్ట్రేషన్లతో ప్రజలను మోసగిస్తే పోలీసు శాఖ ఉక్కుపాదం మోపుతుందన్నారు. విశాఖపట్నంలో ఈ తరహాలో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వీటి అణిచివేతకు గతంలో అమలాపురం డీఎస్పీగా పనిచేసిన ప్రస్తుత విశాఖ సీపీ టి.యోగానంద్ ప్రత్యేక దర్యాప్తు, విచారణతో అలాంటి నేరాలను అదపు చేస్తున్నారని రాజప్ప గుర్తు చేశారు. బార్ అసోసియేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని సూచించారు. అందుకు తన సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. పేదలకు ఉచిత న్యాయం అందించాలని ఆయన ఆకాంక్షించారు. వాస్తవంగా తప్పులు చేసిన వారికి శిక్ష పడేలా న్యాయవాదులు పనిచేయాలని రాజప్ప సూచించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మట్టపర్తి మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాజప్పను అసోసియేషన్ తరపున ఘనంగా సత్కరించారు. ఆయనతోపాటు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, జడ్పీ చైర్మన్ నామన రాంబాబు, రాజోలు, అమలాపురం ఎమ్మెల్యేలు గొల్లపల్లి సూర్యారావు, అయితాబత్తుల ఆనందరావు, వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి, మాజీ ఎమ్మెల్సీ, పీసీసీ ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు తదితరులు పాల్గొన్నారు. టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రాధాన్యం అప్పనపల్లి (మామిడికుదురు) : టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. రాజప్ప దంపతులు ఆదివారం అప్పనపల్లి శ్రీబాలబాలాజీస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో విజయవాడ, శ్రీశైలం పుణ్యక్షేత్రాలకు ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ ఆలయాలను మరింత అభివృద్ధి చేసే లక్ష్యంతో ఐఏఎస్ అధికారులకు అక్కడ నియమించామన్నారు. జిల్లాలో వాడపల్లి, అప్పనపల్లి పుణ్య క్షేత్రాలను కూడా అభివృద్ధి చేయడంతో పాటు స్థానికంగా ఉన్న వనరులను వినియోగించుకుని వీటిని టెంపుల్ టూరిజం కేంద్రాలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించామన్నారు.లంక గ్రామాలు ముంపు బారిన పడకుండా ఉండేందుకు కాజ్‌వేల ఎత్తు పెంచేలా కార్యాచరణ చేపట్టామన్నారు. తీర గ్రామాలకు సాగునీరు అందించే అప్పనపల్లి ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేసే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. రైల్వేలైన్ నిర్మాణంలో భాగంగా కోటిపల్లి నదిపై వంతెన నిర్మాణానికి టెండర్లు పిలిచామన్నారు. ఈ సీజన్లోనే పనులు మొదలు పెట్టేలా చర్యలు తీసుకుంటామని రాజప్ప తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో 20 ఎకరాల విస్తీర్ణంలో అంబేడ్కర్ భారీ విగ్రహం ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. పలువురు పార్టీ నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. -
ముఖ్యమంత్రిని విమర్శిస్తే సహించేది లేదు
విలేకర్ల సమావేశంలో ముద్రగడపై ఉప ముఖ్యమంత్రి నిప్పులు భానుగుడి (కాకినాడ) : ముఖ్యమంత్రిని అవినీతి పరుడంటూ ముద్రగడ విమర్శించడం పట్ల ఉప ముఖ్యమంత్రి చిన రాజప్ప తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనస్థాయి తెలుసుకుని మాట్లాడితే మంచిదని, కాపులకోసం కమిష¯ŒS వేసిన ఘనత చంద్రబాబుదని, కాపు ఉద్యమం పేరిట రాజకీయాలు చేయడం ముద్రగడకే చెల్లిందని ఎద్దేవా చేశారు. మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రశేఖర్ అనే అనుయాయునికి సర్వీస్ కమిష¯ŒS పదవి ఇవ్వాలని ఎంపీగా ఉన్నపుడు ముద్రగడ కోరారని, ఇపుడు నిజాయితీ పరునిగా కథలు అల్లుతున్నారన్నారు. ఇటీవల ఓ వ్యక్తి రాసిన పుస్తకం ద్వారా ముద్రగడ చరిత్ర ఎంత హీనమయిందో తెలుస్తుందన్నారు. -
కొబ్బరి ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు కృషి
నాఫెడ్ కేంద్రాలు నిరంతరం కొనసాగేలా చర్యలు హోంశాఖామంత్రి చినరాజప్ప అంబాజీపేట : కొబ్బరి విస్తారంగా సాగవుతున్న కోనసీమలో కొబ్బరి ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్టు రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. బుధవారం అంబాజీపేటలో పర్యటించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. నాఫెడ్ కొనుగోలు కేంద్రాలు నిరంతరం కొనసాగేలా చర్యలు తీసుకొంటామన్నారు. కొబ్బరి ఆధారిత పరిశ్రమల ఏర్పాటులో భాగంగా సీపీసీఆర్‌ఐ డైరెక్టర్ డాక్టర్ పి.చౌడప్ప ఇటీవల కోనసీమలో పర్యటించారన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని అల్లవరం మండలం సామంతకుర్రులో గుర్తించారని తెలిపారు. ఆ స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించే చర్యలు తీసుకొంటున్నామన్నారు. కడియం మండలం మాధవరాయుడుపాలెంలో సీపీసీఆర్‌ఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కోసం ఇప్పటికే భూసేకరణ పూర్తయిందన్నారు. ప్రారంభోత్సవాలు అంబాజీపేటలో రూ.18 లక్షలతో నిర్మించిన సొసైటీ గోదాములను హోం మంత్రి చినరాజప్ప బుధవారం ప్రారంభించారు. తొలుత అంబాజీపేట శివారు కొర్లపాటివారిపాలెంలో రూ.20 లక్షలతో నిర్మించిన సామాజిక కమ్యూనిటీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న «వివిధ సామాజిక వర్గాల కమ్యూనిటీ భవనాలను దశలవారీగా పూర్తిచేస్తామన్నారు. అనంతరం స్థానిక వెంకట్రాజు ఆయిల్ మిల్లు వద్ద ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొబ్బరి ఒలుపు యంత్రం (డీ హస్కర్)ను మంత్రి రాజప్ప ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పి.గన్నవరం, అమలాపురం ఎమ్మెల్యేలు పులపర్తి నారాయణమూర్తి, అయితాబత్తుల ఆనందరావు, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఆర్డీవో జి.గణేష్‌కుమార్, ఏడీహెచ్ శ్రీనివాస్, ఎంపీపీ దాసరి వీరవెంకట సత్యనారాయణ, జెడ్పీటీసీ సభ్యుడు బొంతు పెదబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ అరిగెల బలరామమూర్తి, సొసైటీ అధ్యక్షుడు గణపతి వీరరాఘవులు, సర్పంచ్‌లు సుంకర సత్యవేణి, కాండ్రేగుల గోపాలకృష్ణ, మట్టపర్తి చంద్రశేఖర్, ఎంపీటీసీలు ఈతకోట సత్యవతి, దొమ్మేటి సాయికృష్ణ, కత్తుల నాగమణి, కోమలి అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
బరిలో బుక్కైన హోం మంత్రి రాజప్ప!
-
పోలీస్ స్టేషన్ల ఆధునికీకరణకు చర్యలు
హోం మంత్రి చినరాజప్ప కాకినాడ క్రైం (కాకినాడ సిటీ) : రాష్ట్రంలోని పోలీస్‌స్టేçÙన్లను ఆధునికీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు డిప్యూటీ సీఎం, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. పోలీస్ కన్వన్ష¯ŒS హాలులో ఏపీ పోలీసు అధికారుల సంఘం రూపొందించిన 2017 పోలీస్ డైరీని గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో రాజప్ప మాట్లాడుతూ 2016లో జిల్లా లో జరిగిన ఆందోళనలపై పోలీసులు ఎంతో సంయమనం పాటించారని కితాబిచ్చారు. నేరాల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నట్టు చెప్పారు. ఎస్పీ ఎం.రవిప్రకాశ్ మాట్లాడుతూ అధికారుల తప్పులు పునరావృతమైతే ఏ స్థాయి అధికారినైనా ఉపేక్షించమన్నారు. ఏఎస్పీ ఏఆర్ దామోదర్, ఓఎస్డీ వై.తరవిశంకర్‌రెడ్డి, జిల్లా పోలీసు అధికారుల సంఘ గౌరవాధ్యక్షుడు జి.బలరామమూర్తి, జిల్లా అధ్యక్షుడు జి.బ్రహ్మాజీరావు, కార్యదర్శి మధుసూదనరావు పాల్గొన్నారు. జిల్లాలో రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యం.. కాకినాడ రూరల్ (కాకినాడ రూరల్ నియోజకవర్గం) : జిల్లాలోని పలు రహదారుల విస్తరణకు చర్యలు తీసుకుంటున్నట్టు డిప్యూటీ సీఎం చినరాజప్ప చెప్పారు. ఇంద్రపాలెం వద్ద ఆర్అండ్బీ వంతెనను ఆయన ప్రారంభిం చారు. జగన్నాథపురం వద్ద రూ.100 కోట్లతో వంతెన, రోడ్ల విస్తరణకు సీఎం చంద్రబాబు అంగీకరించారన్నారు. సర్పవరం వద్ద నాలుగు లైన్ల వంతెనకు శంకుస్థాపన చేశారు. సూర్యారావుపేటలో నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభిం చారు. జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు, ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, దాట్ల బుచ్చిరాజు, కలెక్టర్ అరుణ్‌కుమార్ పాల్గొన్నారు. -
రూ.149కే ఏపీ ఫైబర్ నెట్
డిప్యూటీ సీఎం చినరాజప్ప వివిమెరక (సఖినేటిపల్లి) : ఈ నెల 29వ తేదీన సీఎం చంద్రబాబునాయుడు మోరిపోడు రివర్సైడు స్కూలులో ప్రారంభించనున్న ఏపీ ఫైబర్ నెట్ సౌకర్యం ద్వారా రూ.149కే మోరి, మోరిపోడు గ్రామాల్లో ప్రతి ఇంటికి ఇంటర్నెట్, టీవీ కనెక్షన్, కేబుల్ టీవీ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నట్టు డిప్యూటీ సీఎం, హోం శాఖామంత్రి ఎ¯ŒS.చినరాజప్ప తెలిపారు. సోమవారం వివిమెరకలో సీఎం సభ విజయవంతానికై రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి టీడీపీ కార్యకర్తలు, నాయకులతో సమావేశం జరిగింది. సమావేశంలో డిప్యూటీ సీఎం చినరాజప్ప ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ఆప్టికల్ ఫైబర్ టెక్నాలజీ ద్వారా వేగమైన, స్పష్టత కలిగిన ప్రసారాలను ఈ నెట్ సౌకర్యం ద్వారా అందజేయనున్నట్టు వెల్లడించారు. సీఎం సభ విజయవంతానికి ప్రతి కార్యకర్త జనసమీకరణపై దృష్టి పెట్టాలని సూచించారు. రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ రివర్సైడు స్కూలు ఫౌండర్, బెర్క్లీ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాల్మ¯ŒS డార్వి¯ŒS కృషితో స్మార్ట్విలేజస్గా ప్రభుత్వం ప్రకటించిన మోరి, మోరిపోడు గ్రామాల్లో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు 12 బహుళ జాతీయ కంపెనీలు రానున్నట్టు వెల్లడించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అంతర్వేదిలో డ్రెడ్జింగ్ హార్బర్‌కు సీఎం శంకుస్థాపన చేయనున్నారని, శంకరగుప్తంలో డాక్టరు మంగళంపల్లి బాలమురళీకృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్టు పేర్కొన్నారు. జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు, మాజీ డిప్యూటీ స్పీకర్ ఏవీ సూర్యనారాయణరాజు, టీడీపీ రాష్ట్ర ప్రతినిధులు పెచ్చెట్టి చంద్రమౌళి, గేదెల వరలక్ష్మి, ధవళేశ్వరం వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటి చైర్మ¯ŒS ఈశ్వరరాజు వర్మ, రాజోలు సబ్‌డివిజ¯ŒS నీటి సంఘ చైర్మ¯ŒS ఓగూరి విజయ్‌కుమార్, రాజోలు టీడీపీ నియోజకవర్గ ఇ¯ŒSచార్జ్ బత్తుల రాము, మోరి చేనేత సొసైటీ అధ్యక్షుడు చింతా వీరభద్రేశ్వరరావు, రాజోలు ఏఎంసీ చైర్మ¯ŒS కాండ్రేగుల సత్యనారాయణమూర్తి, రాష్ట్ర రైతు ప్రతినిధి బోణం నాగేశ్వరరావు, పలు ప్రాంతాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
విద్యార్థి దశ నుంచే శాస్త్రవేత్త ఎదిగేందుకు కృషి చేయాలి
శ్రీ ప్రకాష్ టింకరింగ్ ల్యాబ్ అభినందన సభలో మంత్రి రాజప్ప పెద్దాపురం : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన 'మై క్లీన్ ఇండియా' కలలకు సాకారం అందించిన ఘనత పెద్దాపురం శ్రీ ప్రకాష్ విద్యా సంస్థకే దక్కిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంశాఖా మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప అన్నారు. నీతి ఆయోగ్ కమిషన్ ఆదేశంతో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ నిర్వహించిన ఇన్నోవేషన్ చాలంజెస్‌లో దేశంలోని 12 వేల పాఠశాలలు దరఖాస్తు చేయగా నవాంధ్ర నుంచి 1207 పాఠశాలలు ఆసక్తి కనబరిచాయి. వీటిలో ఏపీలో 8 పాఠశాలలు ఎంపిక కాగా జిల్లాలో రెండు పాఠశాలలు శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాల (పెద్దాపురం), శ్రీప్రకాష్ విద్యానికేతన్ (పాయకరరావుపేట) ఎంపిక కావడం గర్వకారణం. ఈ సందర్భంగా మంగళవారం స్థానిక శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు అధ్యక్షతన జరిగిన సభకు మంత్రి రాజప్ప ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ల్యాబ్‌ల ఎంపికకు కృషి చేసిన విద్యార్థులను, పాఠశాల డైరెక్టర్ విజయ్‌ప్రకాష్‌ను అభినందించారు. పాఠశాల ¿¶భౌతిక శాస్త్ర విభాగాధిపతి పీవీఎస్‌బీ చలపతి పర్యవేక్షణలో విద్యార్థులు అభ్యుదయ ప్రోమా, అపురూప్‌రాజ్ వర్థన్, గ్రీష్మణిలు పాల్గొని పెద్దాపురం పట్టణ పరి«ధిలోని జల కాలుష్య నివారణ, యంత్రశక్తిని విద్యుత్ శక్తిగా మార్చి రెండు వాట్స్ ఎల్ఈడీ బల్బు వెలిగేలా యంత్రాన్ని రూపొందించిన తీరు తెన్నులను వారు మంత్రి సమక్షంలో వివరించారు. ‘మై క్లీన్ ఇండియా'లో భాగంగా జిల్లా నుండి రెండు పాఠశాలలకు స్థాçనం లభించిందని పాఠశాల డైరెక్టర్ విజయ్ ప్రకాష్ అన్నారు. అనంతరం మంత్రి రాజప్ప మాట్లాడుతూ జాతీయ స్థాయిలో పెద్దాపురానికి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చిన విద్యార్థులను, శ్రీ ప్రకాష్ విద్యాసంస్థలు ఎప్పటికీ మరువరని, అటువంటి స్పూర్తితోనే ప్రతీ విద్యార్థి మేధస్సుతో ముందుకు ఎదగాలన్నారు. మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, ఏఎంసీ చైర్మన్ ముత్యాల రాజబ్బాయిలు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ల్యాబ్ పెద్దాపురం పట్టణానికి రావడం గర్వకారణమన్నారు. అనంతరం ప్రాజెక్టుకు కీలక పాత్ర పోషించిన నవోదయ రిటైర్డ్ ప్రిన్సిపాల్, శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల ఎడ్యుకేషనల్ కో–ఆర్డినేటర్ ఎఎస్ఎన్ మూర్తిని మంత్రి రాజప్ప సత్కరించారు. కార్యక్రమంలో పాఠశాల డీన్ రాజేశ్వరి, అకడిమిక్ కో–ఆర్డినేటర్ పీఏ రాజు, సీనియర్ ప్రిన్సిపాల్ ఎంవీవీఎస్ మూర్తి, లైజాన్ ఆఫీసర్ ఎం.సతీష్, బొడ్డు బంగారుబాబు, గుమ్మళ్ళ రామకృష్ణ, అడబాల కుమారస్వామి, రోటరీ కార్యదర్శి పాణింగపల్లి చలపతిరావు (నాని), డాక్టర్ పతివాడ రాజేష్‌బాబు, డాక్టర్ పతివాడ శ్రీలక్ష్మి, ఆత్మ చైర్మన్ కలకపల్లి రాంబాబు, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థినీవిద్యార్థులు పాల్గొన్నారు. -
గుడ్ల ఉత్పత్తిలో రెండో స్థానంలో రాష్ట్రం
పరిశ్రమ అభివృద్ధి వల్లే చౌకగా గుడ్లు, మాంసం లభ్యం ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఘనంగా ప్రపంచ గుడ్డు దినోత్సవం అనపర్తి(బిక్కవోలు) : రాష్ట్రంలో పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి చెందడం వల్లే గుడ్ల ఉత్పత్తిలో దేశంలో మన రాష్ట్రం రెండో స్థానంలో నిలిచిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. దీన్ని మొదటి స్థానంలోకి తెచ్చేందుకు వివిధ రాయితీలు అందిస్తున్నట్టు చెప్పారు. ప్రపంచ గుడ్డు దినోత్సవం సందర్భంగా అనపర్తి ఏరియా కోళ్ల రైతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి వేడుకలు బిక్కవోలు మండలం బలభద్రపురం ఎమ్మెస్సార్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తొలుత అనపర్తి జీబీఆర్ కాలేజీ నుంచి సుమారు వెయ్యి మందితో 2కే రన్‌ను ఎమ్మెల్యే ఎన్.రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. రన్లో నెక్ రైతులతో పాటు విద్యార్థులు పాల్గొని గుడ్డును ఆహారంగా తీసుకోవడం వల్ల కలిగే లాభాలను వివరించారు. అనంతరం బలభద్రపురం ఫంక్షన్ హాల్లో జరిగిన సభలో చినరాజప్ప మాట్లాడుతూ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి చెందడం వల్లే సామాన్యుడికి గుడ్డు, కోడి మాంసం అతి చౌకగా లభిస్తున్నాయన్నారు. పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కోళ్ళ రైతులకు ఏడు శాతం సబ్సిడీతో ఏడాదికి రూ.50 కోట్ల వరకూ రుణాలు అందిస్తుందన్నారు. పౌల్ట్రీ రంగ పితామహుడు డాక్టర్ బి.వి.రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ కల్తీకి ఆస్కారం లేని ఆహారం కోడిగుడ్డు అన్నారు. గుడ్డులో పోషకాలను గుర్తించిన ప్రభుత్వం అంగన్వాడీ చిన్నారులకు, గర్భిణులు, బాలింతలకు వారానికి నాలుగు గుడ్లు చొప్పున అందిస్తుందన్నారు. రాష్ట్ర పశుసంవర్థకశాఖ చీఫ్ సెక్రటరీ డాక్టర్ మన్మోçßæన్ సింగ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పౌల్ట్రీ పరిశ్రమ 11.02 శాతం అభివృద్ధి సాధించి రూ.10 వేల కోట్లు ఆదాయం ఆర్జిస్తున్నామన్నారు. జిల్లా నెక్ చైర్మన్ పడాల సుబ్బారెడ్డి మాట్లాడుతూ కోడిగుడ్డు పూర్తిగా శాఖాహారమని ప్రతి ఒక్కరు తీసుకోవచ్చన్నారు. జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, శ్రీనివాసా హేచరీస్ జేఎండీ కె.సోమిరెడ్డి తదితరులు ప్రసంగించారు. అనంతరం ‘కోడిగుడ్డుతో పలు రకాల వంటకాలు’ పుస్తకాన్ని మంత్రి సుజాత, గుడ్డు శాఖాహారం వాల్‌పోస్టర్‌ను మంత్రి చినరాజప్ప ఆవిష్కరించారు. కేర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ బి.సరళా రాజ్యలక్ష్మి, కేపీఆర్ సంస్థల చైర్మన్ కొవ్వూరి పాపారెడ్డిలను సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, తేతలి ఉపేంద్రరెడ్డి, అనపర్తి జెడ్పీటీసీ సభ్యుడు కర్రి ధర్మారెడ్డి, బిక్కవోలు, అనపర్తి ఎంపీపీలు బేరా వేణమ్మ, ఉమామహేశ్వరి, నెక్ ఆడ్వయిజర్ కె.బాలాస్వామి, శ్రీనివాసా హేచరీస్ వైస్ చైర్మన్ సురేష్‌రాయ్, పశుసంవర్థక శాఖ డైరెక్టర్ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
అన్ని జిల్లాల్లో స్టేడియంల నిర్మాణం
ఉప ముఖ్యమంత్రి రాజప్ప కొత్తపేటలో రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం కొత్తపేట : రాష్ట్రానికి దేశానికి గుర్తింపు తీసుకువచ్చే క్రీడల అభివృద్ధికి అన్ని జిల్లాల్లో స్టేడియంల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. కొత్తపేట రెడ్డి అనసూయమ్మ మెమోరియల్ ఇండోర్ షటిల్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్–2016 అండర్–19 బాలురు, బాలికల పోటీలు బుధవారం రాత్రి ప్రారంభమయ్యాయి. స్థానిక కాస్మోపాలిటన్ రిక్రియేషన్ సొసైటీ ఫౌండర్ అంyŠ చైర్మన్, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం(ఆర్ఎస్) ఆధ్వర్యంలో జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు తేతలి నారాయణరెడ్డి పర్యవేక్షణలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రారంభం సందర్భంగా జరిగిన సభకు ఎమ్మెల్సీ ఆర్ఎస్ అధ్యక్షత వహించగా హోంమంత్రి రాజప్ప, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత, దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సభలో రాజప్ప మాట్లాడుతూ వర్థమాన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు, పాత స్టేడియంల ఆధునికీకరణకు, కొత్త స్టేడియంల నిర్మాణాలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మరో మంత్రి సుజాత మాట్లాడుతూ క్రీడాభివృద్ధికి సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యం ఇస్తారని దానిలో భాగంగా 1999లో హైదరాబాద్‌లో ఏసియన్ గేమ్స్ నిర్వహించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. మరో మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతోపాటు క్రీడలు కూడా అవసరమన్నారు. తొలుత మంత్రి సుజాత, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఎంపీపీ రెడ్డి అనంతకుమారిలు జ్యోతి వెలిగించారు. ఈ సభలో పశ్చిమగోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు, మండలి విప్ అంగర రామ్మోహనరావు, ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కరరామారావు, కె.రవికిరణ్‌వర్మ, ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, వనమాడి కొండబాబు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, డీసీఎంఎస్ చైర్మన్ కెవీ సత్యనారాయణరెడ్డి, ఏఎంసీ చైర్మన్ బండారు వెంకట సత్తిబాబు, జిల్లా షటిల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు బామిరెడ్డి, ఉపాధ్యక్షురాలు కొడాలి తనూజ, తదితరులు పాల్గొన్నారు. అనంతరం లాంఛనంగా పోటీలను రాజప్ప ప్రారంభించారు. క్వాలిఫై విజేతలు రాష్ట్రంలో 13 జిల్లాల నుంచి 85 టీమ్‌లు పోటీలకు హాజరుకాగా గురువారం జరిగే పోటీలకు నాకౌట్ విధానంలో ఎంపికలు జరిగాయి. బాలుర సింగిల్స్ విభాగంలో పి.చంద్రాజ్ పట్నాయక్(విశాఖ), బి.గిరీష్‌నాయుడు(తూర్పుగోదావరి), కె.ఎం.రవి(విశాఖ), కె.సాయిచరణ్(గుంటూరు), ఎం.సాయికిరణ్, బి.రోహిత్‌కుమార్, వి.యశ్వంత్(విశాఖ), ఆమన్గౌడ్(తూర్పుగోదావరి) బాలుర డబుల్స్ విభాగంలో పి.ఎస్.ఎన్ సంతోష్, టి.ఎన్.వీ సన్నీ(విశాఖ), చక్రధర్‌రెడ్డి, కె.విక్రాంత్(ప్రకాశం), ఏ. అరుణేష్, బి.గిరిష్‌నాయుడు(తూర్పుగోదావరి), డి.నితిన్, కె.హరికృష్ణ(తూర్పుగోదావరి) విజేతలుగా నిలిచారు. -
పోర్టులు, ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి చర్యలు
డిప్యూటీ సీఎం చినరాజప్ప సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన మధురపూడి : రాష్ట్రంలో పోర్టులు, ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. రాజమహేంద్రవరం విమానాశ్రయ విస్తరణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భూమిపూజ చేయనున్న నేపథ్యంలో.. సంబంధిత ఏర్పాట్ల పరిశీలనకు రాజప్ప శనివారం ఇక్కడకు వచ్చారు. సీఎం సభ, ఎంఓయూ, భూమిపూజ జరిగే ప్రాంతాలను పరిశీలించారు. వాటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, ఇప్పటికే విజయవాడ ఎయిర్‌పోర్టు అభివృద్ధి పూర్తయిందన్నారు. రాజమహేంద్రవరం విమానాశ్రయం విస్తరణకు 850 ఎకరాలు సేకరించామని తెలిపారు. ఆ భూములకు రూ.350 కోట్ల పరిహారం చెల్లించామన్నారు. కడప, తిరుపతి, భోగాపురం విమానాశ్రయాల అభివృద్ధికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. రాజమహేంద్రవరం విమానాశ్రయ విస్తరణ పనులకు సంబంధించిన భూమిపూజకు సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు ఎం.వెంకయ్య నాయుడు, పి.అశోక్‌గజపతిరాజు తదితరులు వస్తారని తెలిపారు. కొందరు రైతులకు భూ పరిహారం అందలేదని విలేకర్లు ప్రస్తావించగా, లీగల్ సమస్యలు పరిష్కారమయ్యాక వారికి పరిహారం అందుతుందని చెప్పారు. అనంతరం రాజప్ప జెట్ ఎయిర్వేస్ విమానంలో హైదరాబాద్ వెళ్లారు. పనుల పరిశీలనకు వచ్చిన కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ మాట్లాడుతూ, సీఎం భూమిపూజ చేయడంతో ఎయిర్‌పోర్టు అభివృద్ధి పనులు మొదలవుతాయని చెప్పారు. రూ.181 కోట్లతో రన్‌వే విస్తరణ, ప్రహరీ, ఐసొలేషన్ బే నిర్మాణ పనులు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్, రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ బి.రాజకుమారి, సబ్‌కలెక్టర్ విజయ కృష్ణన్, ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఎం.రాజకిషోర్, కోరుకొండ తహశీల్దార్ రియాజుద్దీన్, సీతానగరం ఎంపీడీఓ డి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, వర్షం కారణంగా సీఎం పర్యటనకు ఆటంకం కలుగుతుందేమోనన్న సందేహాలు అధికారుల్లో నెలకొన్నాయి. ఏర్పాట్లన్నీ పూర్తి చేశాక వర్షం కురిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన చెందుతున్నారు. -
అంత్యపుష్కరాలను ప్రారంభించిన చినరాజప్ప
-
ప్రియుడితో కలిసి ఉడాయించిన వివాహిత
హొసూరు : ప్రియుడితో కలిసి ఓ వివాహిత ఉడాయించింది. ఘటనపై వివాహిత భర్త ఫిర్యాదు మేరకు ఉద్దనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే... ఉద్దనపల్లి సమీపంలోని క్రిష్ణకొత్తూరు గ్రామానికి చెందిన ఆనందప్ప, సుజాత(32) దంపతులు. వీరికి రెండేళ్ల బాలుడు ఉన్నాడు. హొసూరు పారిశ్రామిక వాడలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో పనిచేస్తున్న ఆనందపప్ప, ఈ నెల 20న రాత్రి తొందరగా పనిముగించుకుని ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయంలో ఇంటిలో తన భార్య ఆమె ప్రియుడు రాజప్పతో కలిసి ఉంది. విషయాన్ని గుర్తించిన ఆనందప్ప ఆగ్రహంతో ఇద్దరిని చితకబాదాడు. ఆ సమయంలో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకున్నారు. అవమానాన్ని భరించలేని సుజాత, రా జప్ప పరారయ్యారు. వారం రోజుల పాటు తన భార్య తిరిగి వస్తుందని ఎదురు చూసిన ఆనందప్ప ఆమె రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.