- ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప
పార్కుగా పాత అక్విడెక్టు అభివృద్ధి
Published Mon, May 1 2017 12:42 AM | Last Updated on Tue, Sep 5 2017 10:04 AM
పి.గన్నవరం :
పాత అక్విడెక్టును పార్కుగా తీర్చిదిద్ది, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. స్థానిక కొత్త అక్విడెక్టు ముఖద్వారంలో కొలువు దీరిన శ్రీపంచముఖాంజనేయస్వామి ఆలయంపై నిర్మించిన 70 అడుగుల అభయాంజనేయస్వామి విగ్రహాన్ని ఆయన ఆదివారం ఆవిష్కరించారు. మిర్తిపాటి సూర్యనారాయణ నేతృత్వంలో పూజ్యం విశ్వనాథశర్మ ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. తొలుత ఆలయ కమిటీ చైర్మ¯ŒS పడాల వెంకటేశ్వరరావు(సూపర్) ఆధ్వర్యంలో చినరాజప్పకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాజప్ప ఆంజనేయస్వావిుకి ప్రత్యేకపూజలు చేసి, హోమ గుండం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం చైర్మ¯ŒS పడాల సూపర్ అధ్యక్షతన జరిగిన సభలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆ«ధ్మాత్మిక భావనను పెంపొందించుకుని సమాజానికి సేవలు అందించాలన్నారు. దాతల సాయంతో సుమారు 1.6 కోట్ల వ్యయంతో ఆలయాన్ని, 70 అడుగుల విగ్రహాన్ని నిర్మించిన సూపర్‌ను అభినందించారు. సూపర్‌ను చినరాజప్ప తదితరులు దుశ్శాలువాలతో సన్మానించారు.
జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు, ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యేలు పాముల రాజేశ్వరీదేవి, బండారు సత్యానందరావు, ఎంపీపీ సంసాని లక్ష్మీగౌరి, సర్పంచ్ చుట్టుగుల్ల షర్మిలారమణ, ఎంపీటీసీ సభ్యురాలు తాటికాయల వీవీఎల్‌ఎ¯ŒS దేవి, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి డొక్కా నాథ్‌బాబు తదితరులను ఆలయ కమిటీ సత్కరించి స్వామి చిత్ర పటాలను అందజేసింది. వివిధ గ్రామాలకు చెందిన వేలాదిమంది స్వామివారికి పూజలు చేశారు. కమిటీ ఆధ్వర్యంలో అన్న సమారాధన చేశారు.
కార్యక్రమాల్లో జెడ్పీటీసీ సభ్యురాలు గంగుమళ్ల కాశీ అన్నపూర్ణ, ఉలిశెట్టి బాబీ, సుంకర బుల్లెట్, చొల్లంగి సత్తిబాబు, కోటిపల్లి గంగరాజు, పడాల రామ లక్ష్మణ్, కొక్కిరి రవికుమార్, వాసంశెట్టి కుమార్, అన్నాబత్తుల అనుబాబు, గణేశుల శ్రీవెంకట కొండలరావు, ఇందుకూరి నర్శింహరాజు, సంసాని పెద్దిరాజు, గణపతి రాఘవులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement