- చట్టసభల్లో సీఎం సిద్ధు వెల్లడి
సాక్షి, బెంగళూరు : నిధుల లేమి వల్ల అభివృద్ధి పనులు ఆగిపోవడం సర్వసాధారణం. అయితే వేల కోట్ల రూపాయల నిధులు అందుబాటులో ఉండి కూడా ఖర్చుకాకపోవడం రాష్ట్ర గృహనిర్మాణశాఖలోనే చోటు చేసుకుంటోంది. ఈ విషయాలన్నీ చట్టసభకు సాక్షాత్తు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం తెలియజేశారు. వర్షాకాల సమావేశాల్లో భాగంగా చిక్కమగళూరు జిల్లా తరికెరె ఎమ్మెల్యే జీ.హెచ్ శ్రీనివాస్ అడిగిన ఓ ప్రశ్నకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. ‘2015-16 బడ్జెట్‌లో గృహ నిర్మాణ శాఖకు రూ.3,818 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఇందులో మే 30 వరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదు. ఈ శాఖకు అంబరీష్ మంత్రిత్వ బాధ్యతలు వహిస్తున్నారు.’ అని పేర్కొన్నారు.
ఒక్క పైసా కూడా ఖర్చుపెట్టని గృహ నిర్మాణశాఖ!
Published Wed, Jul 15 2015 3:58 AM | Last Updated on Sun, Sep 3 2017 5:29 AM
Advertisement