
నియోజకవర్గ అభివృద్ధిపై వైఎస్ జగన్ సమీక్ష
పులివెందుల : పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. కలుషిత నీళ్లు సరఫరా చేస్తున్నారంటూ ప్రజలు చేసిన ఫిర్యాదుపై అధికారులను జగన్ ప్రశ్నించారు. ఇలాగైతే ఎలా మంచినీరు తాగుతారని ఆయన అడిగారు. అంతకు ముందు మున్సిపాలిటీలో తాగునీరు...మురుగునీరులా వస్తుందని స్థానికులు బాటిళ్లలో పట్టి ఈ సందర్భంగా వైఎస్ జగన్కు చూపించారు.