ఇంద్రకీలాద్రికి రెండో రోడ్డు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ ప్రకటన
పుష్కరాల నాటికి సిద్ధం చేస్తామని వెల్లడి
వాస్తవంలో ఇంకా ఇళ్ల తొలగింపేపూర్తికాని వైనం
మరో రెండు మూడు నెలలు పడుతుందంటున్న దుర్గగుడి అధికారులు
పుష్కరాల కోసం ప్రారంభించిన పనులు ఇంకా ప్రారంభ దశే దాటలేదు. వాటిని పూర్తిచేయకుండానే అధికా రులు కొత్త పనుల్ని ప్రారంభిస్తున్నారు. ఈ విధంగా ప్రారంభించిన పనుల్ని పుష్కరాల్లోగా పూర్తిచేస్తామంటూ ఒక వైపు ఉన్నతాధికారులు ఆర్భాటంగా ప్రకటించేస్తున్నారు. మరోవైపు ఆ పనులు ఏ విధంగా పూర్తవుతాయో అర్థంగాక కిందిస్థాయి అధికారులు జుట్టు పీక్కుంటున్నారు.
విజయవాడ : దుర్గమ్మ భక్తుల సౌకర్యార్థం పుష్కరాల నాటికి ఒక కొత్త ఘాట్ రోడ్డును నిర్మిస్తామని కలెక్టర్ బాబు.ఎ గత శనివారం ప్రకటించారు. భవానీ, పున్నమి ఘాట్లలో స్నానం చేసిన భక్తులు నేరుగా అమ్మవారి దర్శనానికి వెళ్లేందుకు వీలుగా దీనిని నిర్మించనున్నట్లు చెప్పారు. ఇది కాలిబాట భక్తులకు మాత్రమే ఉపయోగపడుతుందని తెలిపారు. జిల్లా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన పుష్కర సమావేశం అనంతరం కలెక్టర్ ఈ విషయం వెల్లడించారు. వాస్తవంలో మాత్రం.. కలెక్టర్ ప్రకటించినట్లు కాలిబాట రోడ్డు నిర్మించాలంటే విద్యాధరపురం హెడ్ వాటర్ వర్క్స్ ఎదురుగా సుమారు 138 ఇళ్లను తొలగించాలి. అక్కడ సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల రోడ్డు నిర్మించాలి.సాక్షి, విజయవాడ : దుర్గమ్మ భక్తుల సౌకర్యార్థం పుష్కరాల నాటికి ఒక కొత్త ఘాట్ రోడ్డును నిర్మిస్తామని కలెక్టర్ బాబు.ఎ గత శనివారం ప్రకటించారు. భవానీ, పున్నమి ఘాట్లలో స్నానం చేసిన భక్తులు నేరుగా అమ్మవారి దర్శనానికి వెళ్లేందుకు వీలుగా దీనిని నిర్మించనున్నట్లు చెప్పారు. ఇది కాలిబాట భక్తులకు మాత్రమే ఉపయోగపడుతుందని తెలిపారు. జిల్లా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన పుష్కర సమావేశం అనంతరం కలెక్టర్ ఈ విషయం వెల్లడించారు.
వాస్తవంలో మాత్రం.. కలెక్టర్ ప్రకటించినట్లు కాలిబాట రోడ్డు నిర్మించాలంటే విద్యాధరపురం హెడ్ వాటర్ వర్క్స్ ఎదురుగా సుమారు 138 ఇళ్లను తొలగించాలి. అక్కడ సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల రోడ్డు నిర్మించాలి. ప్రస్తుతం రెవెన్యూ శాఖ ఇక్కడ ఇళ్లను తొలగించే పనిలో ఉంది. ఆ తరువాత ఈ స్థలాన్ని శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి అప్పగించాల్సి ఉంటుంది. ఆ తరువాత దేవస్థానం అధికారులు దీన్ని పరిశీలించి రోడ్డు నిర్మాణానికి మార్కింగ్ చేయాల్సి ఉంటుంది. రోడ్డు కూడా ఒకే రూట్‌లో కాకుండా రెండు మూడు మార్గాలు చూసుకుని భక్తులకు ఏది వీలుగా ఉంటుందో నిర్ణయించుకుని దాన్ని చివరకు ఖరారు చేయాల్సి ఉంది. ఆ తరువాత ఆ మార్గంలో కొండను తొలగించడం ప్రారంభించారు. అనంతరం సిమెంట్‌తో మెట్లను నిర్మించాలి. కొంతమేర మెట్లు, మరికొంత నడిచే ప్రదేశం, తిరిగి మెట్లు నిర్మించాల్సి ఉంటుంది. చివరగా రెండువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించాలి. ఇదంతా జరిగే సరికి కనీసం రెండు మూడు నెలలు పట్టే అవకాశం ఉందని తెలిసింది.
కాంట్రాక్టర్‌కూ స్పష్టత ఇవ్వలేదు...
ఇంద్రకీలాద్రికి కొత్త రోడ్డు నిర్మాణానికి రూ.1.08 కోట్లతో కాంట్రాక్టర్‌ను ఖరారు చేశారు కాని పనులు ఎప్పటి నుంచి ప్రారంభించాలనేది అతనికి ఇప్పటి వరకు స్పష్టంగా చెప్పలేదు. పుష్కరాల లోపుగా ఈ కొత్త రోడ్డు నిర్మించడం కష్టమేనని దుర్గగుడి అధికారులే పెదవివిరుస్తుండగా, ఈ రోడ్డును పుష్కరాల నాటికి సిద్ధం చేస్తామని మంత్రి ఉమా సమక్షంలో కలెక్టర్ చెప్పడంపై విమర్శలు వస్తున్నాయి.
ఫ్లైఓవర్ ఏమైంది?
పుష్కరాల నాటికి ఇంద్రకీలాద్రి వద్ద ఫ్లైఓవర్ పూర్తి చేస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కలెక్టర్ బాబు.ఎ గత కొన్ని నెలలుగా హడావుడి చేస్తూ వచ్చారు. చివరకు శనివారం కలెక్టర్ మాట్లాడుతూ పుష్కరాల నాటికి ఫ్లైఓవర్ పూర్తి కాదని, కుమ్మరపాలెం సెంటర్ నుంచి వారధి వరకు నాలుగు రోడ్ల రహదారిని మాత్రమే పూర్తి చేస్తామని ప్రకటించారు. ఫ్లైఓవర్‌ను పిల్లర్ల దాకా నిర్మించి వదిలేసి పుష్కరాల తరువాత చేపడతామని చెప్పారు. ఇంద్రకీలాద్రికి కొత్త రోడ్డు నిర్మాణం పరిస్థితి కూడా ఇదే తరహాలో ఉంటుందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఘాట్ల నిర్మాణం, అర్జునవీధి విస్తరణ, ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేసి భక్తులకు ఇబ్బంది కలగకుండా చూస్తే అదే పదివేలని పలువురు స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.
కాలిబాట రోడ్డూ..
Published Tue, Jul 12 2016 1:28 AM | Last Updated on Mon, Sep 4 2017 4:37 AM
Advertisement
Advertisement