పుష్కర న్యూస్ ట్రాక్ | Pushkarni News Track | Sakshi
Sakshi News home page

పుష్కర న్యూస్ ట్రాక్

Published Fri, Jul 24 2015 2:16 AM | Last Updated on Sun, Sep 3 2017 6:02 AM

Pushkarni News Track

పుష్కరాలు ముగి యడానికి మరో రెండు రో జులే ఉండడంతో జిల్లాలో ని మంగపేట, రామన్నగూడెం, ముళ్లకట్ట పుష్కరఘాట్లకు జనం పోటెత్తుతున్నారు. 10వరోజు పుష్కరాల సందర్భంగా చోటుచేసుకున్న సంఘటనలు ఇలా..భక్తులు గోదావరి దిగువ ప్రాంతంవైపు వెళ్లొద్దని ఏటూరునాగారంలో పోలీసులు అడ్డుకున్నారు. పుష్కర స్నానానికి వచ్చిన వరంగల్ మీల్స్ కాలనీకి చెందిన వేల్పుల ఐలయ్య(55) మంగపేట ఘాట్‌లో స్నానం ఆచరిస్తుండగా ఫిడ్స్ వచ్చారుు. 108 అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు తప్పలేదు.మంగపేట, కమలాపురం మధ్యలో వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యూరుు. ములుగు డీఎస్పీ బానోతు రాజమహేంద్రనాయక్, మంగపేట ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి ద్విచక్రవాహనంపై తిరుగుతూ ట్రాఫిక్‌ను నియంత్రించారు.
     
గోదావరి ఒడ్డున భక్తులకు నీడను కల్పించేందుకు వేసిన టెంట్ల కిందకు వరద నీరు చేరింది. అధికారులు, సిబ్బంది టెంట్లను మార్చకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు.దుస్తులు మార్చుకునే తాత్కాలిక గదుల చుట్టూ వరద నీరు చుట్టుముట్టింది. స్త్రీలు దుస్తులు మార్చుకునే గదులను మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఏర్పాటు చేయలేదు.  రామన్నగూడెం గోదావరి పుష్కరాల కవరేజ్ కోసం వెళ్లిన ఓ విలేకరి కెమెరాను స్థానిక ఎస్సై వినయ్‌కుమార్ లాక్కున్నారు. ఫొటోలు తీయడంతో భక్తులు ఎక్కువ సమయం నీటిలో గడుపుతున్నారని అన్నారు. భక్తుల గస్తీ కోసం వెళ్లిన స్థానిక ఎస్సై వినయ్‌కుమార్ గురువారం రామన్నగూడెం గోదావరి నీటిలో పడవపై నుంచి నీటిలో పడిపోయారు. తోటి అధికారులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. ఎస్సై క్షేమంగా ఒడ్డుకు చేరడంతో ఊపిరి పీల్చుకున్నారు.

పుష్కర భక్తులతో మల్లూరు హేమాచల క్షేత్రం గురువారం కిక్కిరిసిపోయింది. భక్తులు చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి రావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.కమలాపురం ఇన్‌టెక్ వెల్ నదీ తీరంలో బిల్ట్ వ్యవస్థాపకుడు లలిత మోహన్‌థ్రాపర్‌కు 50 మంది కార్మికులు పిండ ప్రదానం చేశారు.  కమలాపురంలోని లక్ష్మీదేవరను భక్తులు గోదావరి పుష్కరాలకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా భారీ ఊరేగింపు నిర్వహించారు.
 - ఏటూరునాగారం/ములుగు/మంగపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement