Ramannagudem
-
నగ్న ఫొటోలు పంపాలని ఇన్‌స్టాలో వేధింపులు
హైదరాబాద్: సోషల్ మీడియా యాప్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో యువతులను వేధింపులకు గురి చేస్తున్న యువకుడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయిలను పరిచయం చేసుకొని అనంతరం వారిని నగ్న ఫొటోలు, వీడియోలు పంపాలని వేధిస్తుండడంతో విసుగు చెందిన ఓ మహిళ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐపీ అడ్రస్ ఆధారంగా దర్యాప్తు చేసి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తనను వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. హయత్‌నగర్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్ రామన్నగూడెం ప్రాంతానికి చెందిన సంతోశ్ కుమార్‌గా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సంతోశ్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఉన్న ఓ ప్రైవేటు కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ సందర్భంగా నిందితుడిని అరెస్టు చేసి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. -
ఉధృతంగా గోదావరి ప్రవాహం
ఏటూరునాగారం/వెంకటాపురం(కె)/వాజేడు/భద్రాచలంటౌన్: గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద ప్రవాహం ఉధృతంగా ఉండటంతో ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, కన్నాయిగూడెం, వాజేడు, మంగపేట తదితర ఏజెన్సీ మండలాలు అతలాకుతలమవుతున్నాయి. గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలకు కంటిమీద కునుకులేకుండా పోయింది. రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద శనివారం రాత్రి 9.1 మీటర్లు ఉన్న నీటిమట్టం ఆదివారం ఉదయం 9.92 మీటర్లకు చేరింది. శనివారం 8.5 మీటర్లకు నీటిమట్టం చేరగానే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు ఆదివారం రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నీటిమట్టం 10.9 మీటర్లకు చేరితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. ముల్లకట్ట వద్ద 75 మీటర్ల ఎత్తులో సుమారు 2 కిలోమీటర్ల వెడల్పుతో 163 జాతీయ రహదారిని తాకుతూ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏటూరునాగారం మండలంలోని రాంనగర్, పరిసర తండాలను గోదావరి వరద చుట్టుముట్టింది. రాంనగర్ వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి పిల్లర్లు వరద నీటిలో మునిగిపోయాయి. ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఓడవాడకు చెందిన 150 పశువులు వరదలో చిక్కుకోవడంతో వాటిని రైతులు తాళ్ల సహాయంతో బయటకు తీశారు. వెంకటాపురం మండలం బెస్తగూడెం సమీపంలోని గోదావరి లంకల్లో గొర్రెల కాపరులు, గొర్రెలు చిక్కుకున్నాయి. వెంకటాపురం సీఐ శివప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు నాటు పడవల సహాయంతో రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా, భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆదివారం ఉదయం 43 అడుగులు ఉన్న వరద రాత్రి 7 గంటలకు 50.06 అడుగులకు చేరింది. దీంతో ఒక్క రోజులోనే మొదటి, రెండో ప్రమాద హెచ్చరికలను అధికారులు జారీ చేశారు. జూరాలకు 1.73 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో గద్వాల టౌన్: కృష్ణానదిపై కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి రోజురోజుకూ వరద పెరుగుతోంది. దీంతో జూరాలకు ఆదివారం 1.73 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, సోమవారం ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 13 క్రస్టు గేట్లను ఎత్తి 1,32,853 క్యూసెక్కులను, విద్యుదుత్పత్తి యూనిట్ల ద్వారా 34,422 క్యూసెక్కులను మొత్తం 1.72 లక్షల క్యూసెక్కులను దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి విడుదల చేస్తున్నారు. -
గోదావరిలో పుష్కర స్నానాలు
ఏటూరునాగారం : శ్రావణమాసాన్ని పురస్కరించుకుని మండలంలోని రామన్నగూడెం గోదావరి పుష్కరఘాట్ వద్ద భక్తులు శనివారం అంత్య పుష్కరస్నానాలు ఆచరించారు. తొలుత మహిళలు గోదావరి నదిలో పసుపు, కుంకుమలు చల్లారు. అనంతరం స్నానాలు ఆచరించి పిల్లాపాపలను చల్లంగా చూడాలని వేడుకున్నారు. తర్వాత గోదావరి ఒడ్డున ఉన్న శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పలువురు తమ పితృదేవతల పేరిట పిండ ప్రదానాలు చేశారు. పెరుగుతున్న గోదావరి నీటి మట్టం ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి నీటి మట్టం 7.18 మీటర్ల వరకు పెరిగింది. శుక్రవారం కొద్దిగా తగ్గినప్పటికీ శనివారం నుంచి గోదావరి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో వరద మరింత చేరడంతో గోదావరి ఉధృతి పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. వరదను పరిశీలించిన తహసీల్దార్ రామన్నగూడెం వద్ద పెరుగుతున్న గోదావరి నీటి మట్టాన్ని స్థానిక తహసీల్దార్ నరేందర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఘాట్ వద్ద ఉన్న నీటి మట్టం కొలతలను పరిశీలించి వీఆర్వోలకు పలు సూచనలు ఇచ్చారు. లోతట్టు గ్రామాల ప్రజలకు గోదావరి వరద పెరుగుతున్న విషయాన్ని ఎప్పటికప్పుడు చేరవేయాలన్నారు. కాగా, వరద ఉధృతి కారణంగా రాంనగర్‌కు వెళ్లే లోలెవల్ కాజ్‌వేపై రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కాజ్‌వేపై నుంచి వెళ్లేందుకు వెంటనే పడవ ఏర్పాటు చేయాలని తహసీల్దార్.. సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ఆర్ఐ సర్వర్‌పాషా, వీఆర్వోలు అర్రెం నర్సయ్య, రాములు, వీఆర్ఏ కృష్ణ ఉన్నారు. -
పుష్కర స్నానానికి వర్షం అడ్డంకి
ఏటూరునాగారం : గోదావరి అంత్యపుష్కరాల్లో బుధవారం భక్తుల స్నానాలకు వర్షం అడ్డంకిగా మారింది. తెల్లవారుజాము నుంచి జోరుగా వర్షం కురవడంతో రామన్నగూడెం ఘాట్ వద్దకు రావడానికి ఇబ్బంది పడ్డారు. ఎట్టకేలకు కొందరు వచ్చి పుష్కర స్నానాలు ఆచరించారు. మహిళలు తమ మొక్కులను ఘాట్ వద్దనే సమర్పించుకున్నారు. ఘాట్‌పై ఒండ్రుమట్టి పేరుకుపోవడంతో గ్రామస్తులు నీటితో శుభ్రం చేశారు. భక్తులు పితృదేవతలకు పిండప్రదానాలు చేసి గోదావరిలో కలిపారు. -
పుష్కర న్యూస్ ట్రాక్
పుష్కరాలు ముగి యడానికి మరో రెండు రో జులే ఉండడంతో జిల్లాలో ని మంగపేట, రామన్నగూడెం, ముళ్లకట్ట పుష్కరఘాట్లకు జనం పోటెత్తుతున్నారు. 10వరోజు పుష్కరాల సందర్భంగా చోటుచేసుకున్న సంఘటనలు ఇలా..భక్తులు గోదావరి దిగువ ప్రాంతంవైపు వెళ్లొద్దని ఏటూరునాగారంలో పోలీసులు అడ్డుకున్నారు. పుష్కర స్నానానికి వచ్చిన వరంగల్ మీల్స్ కాలనీకి చెందిన వేల్పుల ఐలయ్య(55) మంగపేట ఘాట్‌లో స్నానం ఆచరిస్తుండగా ఫిడ్స్ వచ్చారుు. 108 అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు తప్పలేదు.మంగపేట, కమలాపురం మధ్యలో వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యూరుు. ములుగు డీఎస్పీ బానోతు రాజమహేంద్రనాయక్, మంగపేట ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి ద్విచక్రవాహనంపై తిరుగుతూ ట్రాఫిక్‌ను నియంత్రించారు. గోదావరి ఒడ్డున భక్తులకు నీడను కల్పించేందుకు వేసిన టెంట్ల కిందకు వరద నీరు చేరింది. అధికారులు, సిబ్బంది టెంట్లను మార్చకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు.దుస్తులు మార్చుకునే తాత్కాలిక గదుల చుట్టూ వరద నీరు చుట్టుముట్టింది. స్త్రీలు దుస్తులు మార్చుకునే గదులను మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఏర్పాటు చేయలేదు. రామన్నగూడెం గోదావరి పుష్కరాల కవరేజ్ కోసం వెళ్లిన ఓ విలేకరి కెమెరాను స్థానిక ఎస్సై వినయ్‌కుమార్ లాక్కున్నారు. ఫొటోలు తీయడంతో భక్తులు ఎక్కువ సమయం నీటిలో గడుపుతున్నారని అన్నారు. భక్తుల గస్తీ కోసం వెళ్లిన స్థానిక ఎస్సై వినయ్‌కుమార్ గురువారం రామన్నగూడెం గోదావరి నీటిలో పడవపై నుంచి నీటిలో పడిపోయారు. తోటి అధికారులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. ఎస్సై క్షేమంగా ఒడ్డుకు చేరడంతో ఊపిరి పీల్చుకున్నారు. పుష్కర భక్తులతో మల్లూరు హేమాచల క్షేత్రం గురువారం కిక్కిరిసిపోయింది. భక్తులు చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి రావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.కమలాపురం ఇన్‌టెక్ వెల్ నదీ తీరంలో బిల్ట్ వ్యవస్థాపకుడు లలిత మోహన్‌థ్రాపర్‌కు 50 మంది కార్మికులు పిండ ప్రదానం చేశారు. కమలాపురంలోని లక్ష్మీదేవరను భక్తులు గోదావరి పుష్కరాలకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా భారీ ఊరేగింపు నిర్వహించారు. - ఏటూరునాగారం/ములుగు/మంగపేట -
భక్తజన హోరు
ఒక్కరోజే 4 లక్షల మంది పుష్కర స్నానాలు గోదావరి తీరం భక్తి పారవశ్యంలో తడిసి ముద్దవుతోంది. పుష్కరాల తొమ్మిదో రోజు బుధవారం భక్తులు పోటెత్తారు. మంగపేట, రామన్నగూడెం ఘాట్లలో సుమారు నాలుగు లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. - సాక్షి, హన్మకొండ హన్మకొండ :గోదావరి తీరం భక్తి పారవశ్యంలో తడిసి ముద్దవుతోంది. పుష్కరాలు ప్రారంభమై తొమ్మి ది రోజులు గడుస్తున్నా భక్తుల ప్రవాహనం తగ్గ డం లేదు. బుధవారం మంగపేటలో 2.50లక్షలు, రామన్నగూడెం ఘాట్‌లో 1.50లక్షల మం ది పుష్కరస్నానం చేశారు. రెండు రోజులుగా కురుస్తున్న చిరు జల్లులతో రహదారులు చిత్తడిగా మారినా లెక్కచేయకుండా భక్తులు పుష్కరస్నానాలకు తరలివస్తూనే ఉన్నారు. పస్రా నుంచి ప్రకృతి అందాలు.. గోదావరి తీరానికి చేరుకునే దారిలో ప్రకృతి అం దాలకు ముఖద్వారంగా ములుగు స్వాగతం ప లుకుతోంది. అక్కడి నుంచి దాదాపు 70 కిలోమీటర్ల మేర పచ్చని చెట్ల నడుమ ప్రయూణం సాగుతోంది. గోవిందరావుపేట మండలం పస్రా దా టాక ఏటూరునాగారం అభయారణ్యం గుండా సాగే ప్రయాణం, అప్పటి వరకు ఉన్న బడలికను దూరం చేస్తోంది. శని, ఆదివారాల్లో రాష్ట్ర వ్యా ప్తంగా పుష్కరదారుల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడి నా.. భక్తులు అతితక్కువగా ఇబ్బందులు ఎదుర్కొన్నది ఈ మార్గంలోనే కావడం గమనార్హం. ఏటూరునాగారం నుంచి కమలాపురం వరకు దాదాపు 7 కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపు లా పచ్చని చెట్ల నడుమ భక్తులు భోజనాలు చే యడం, సేదదీరడం వనభోజనాలను గుర్తు కు తెచ్చారుు. మంగపేట సమీపంలోని మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుంటున్న భక్తులు.. ఇక్కడ సహాజ సిద్ధంగా వెలసి న మంచినీటి ధారలు ఆస్వాదిస్తూ ఆనందం పొందుతున్నారు. మంగపేట, రామన్నగూడెంలో చేసే పుష్కర స్నా నం చేసి గోదారమ్మ అనుగ్రహం పొందిన భక్తులకు ఈ ప్రయూణం చక్కని అనుభూతి కలిగి స్తోంది. తొమ్మిదోరోజు భారీగా భక్తులు కర్మకాండలు నిర్వహించేందుకు అనువైన రోజని తెలియడంతో భక్తు లు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో పూజారుల కొరత ఏర్పడగా సామూహిక పిండప్రదానం చేయాల్సి వచ్చింది. కాగా, ఎన్పీడీసీఎల్ సీఎండీ వెంకటనారాయణ, సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాద వ్ మంగపేట, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నర్సారెడ్డి రామన్నగూడెం లో పుష్కరస్నానాలు చేశారు. తొమ్మిది రోజుల్లో 17,05,850 మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారని అంచనా. మంగపేట మహానగరం పుష్కరాలకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులు, వేలాది వాహనాలతో మంగపేట మహానగరాన్ని తలపిస్తోంది. తొమ్మిది రోజుల నుంచి భక్తుల రాకతో మంగపేట సందడిగా మారింది. -కొమరగిరి సురేష్, శారదా వస్త్రాలయం చెరగని ముద్ర రాష్ట్రంలో మొదటిసారి గోదావరి పుష్కరాలు మంగపేటలో నిర్వహించ డం ఆనందంగా ఉంది. దీని ద్వారా రాష్ట్రంలో మంగపేటకు చెరగని ముద్ర పడినట్లయ్యింది. - రావుల కృష్ణవేణి, శ్రావ్య జిరాక్స్ నా జన్మ ధన్యమైంది పుష్కరాలకు వచ్చే భక్తులకు ఉచిత బస్సులను నడిపే అవకాశం కలిగినందుకు మా జన్మ ధన్యమైంది. వేలాది మందిని పుష్కరాలకు తరలించడంలో కలిగిని ఆనందం మరేదానిలో లేదు. -గుడెల్లి రాములు, డ్రైవర్, హన్మకొండ