భక్తజన హోరు
ఒక్కరోజే 4 లక్షల మంది పుష్కర స్నానాలు
గోదావరి తీరం భక్తి పారవశ్యంలో తడిసి ముద్దవుతోంది. పుష్కరాల తొమ్మిదో రోజు బుధవారం భక్తులు పోటెత్తారు. మంగపేట, రామన్నగూడెం ఘాట్లలో సుమారు నాలుగు లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారు.
- సాక్షి, హన్మకొండ
హన్మకొండ :గోదావరి తీరం భక్తి పారవశ్యంలో తడిసి ముద్దవుతోంది. పుష్కరాలు ప్రారంభమై తొమ్మి ది రోజులు గడుస్తున్నా భక్తుల ప్రవాహనం తగ్గ డం లేదు. బుధవారం మంగపేటలో 2.50లక్షలు, రామన్నగూడెం ఘాట్‌లో 1.50లక్షల మం ది పుష్కరస్నానం చేశారు. రెండు రోజులుగా కురుస్తున్న చిరు జల్లులతో రహదారులు చిత్తడిగా మారినా లెక్కచేయకుండా భక్తులు పుష్కరస్నానాలకు తరలివస్తూనే ఉన్నారు.
పస్రా నుంచి ప్రకృతి అందాలు..
గోదావరి తీరానికి చేరుకునే దారిలో ప్రకృతి అం దాలకు ముఖద్వారంగా ములుగు స్వాగతం ప లుకుతోంది. అక్కడి నుంచి దాదాపు 70 కిలోమీటర్ల మేర పచ్చని చెట్ల నడుమ ప్రయూణం సాగుతోంది. గోవిందరావుపేట మండలం పస్రా దా టాక ఏటూరునాగారం అభయారణ్యం గుండా సాగే ప్రయాణం, అప్పటి వరకు ఉన్న బడలికను దూరం చేస్తోంది. శని, ఆదివారాల్లో రాష్ట్ర వ్యా ప్తంగా పుష్కరదారుల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడి నా.. భక్తులు అతితక్కువగా ఇబ్బందులు ఎదుర్కొన్నది ఈ మార్గంలోనే కావడం గమనార్హం. ఏటూరునాగారం నుంచి కమలాపురం వరకు దాదాపు 7 కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపు లా పచ్చని చెట్ల నడుమ భక్తులు భోజనాలు చే యడం, సేదదీరడం వనభోజనాలను గుర్తు కు తెచ్చారుు. మంగపేట సమీపంలోని మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుంటున్న భక్తులు.. ఇక్కడ సహాజ సిద్ధంగా వెలసి న మంచినీటి ధారలు ఆస్వాదిస్తూ ఆనందం పొందుతున్నారు. మంగపేట, రామన్నగూడెంలో చేసే పుష్కర స్నా నం చేసి గోదారమ్మ అనుగ్రహం పొందిన భక్తులకు ఈ ప్రయూణం చక్కని అనుభూతి కలిగి స్తోంది.
తొమ్మిదోరోజు భారీగా భక్తులు
కర్మకాండలు నిర్వహించేందుకు అనువైన రోజని తెలియడంతో భక్తు లు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో పూజారుల కొరత ఏర్పడగా సామూహిక పిండప్రదానం చేయాల్సి వచ్చింది. కాగా, ఎన్పీడీసీఎల్ సీఎండీ వెంకటనారాయణ, సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాద వ్ మంగపేట, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నర్సారెడ్డి రామన్నగూడెం లో పుష్కరస్నానాలు చేశారు. తొమ్మిది రోజుల్లో 17,05,850 మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారని అంచనా.
మంగపేట మహానగరం
పుష్కరాలకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులు, వేలాది వాహనాలతో మంగపేట మహానగరాన్ని తలపిస్తోంది. తొమ్మిది రోజుల నుంచి భక్తుల రాకతో మంగపేట సందడిగా మారింది.
-కొమరగిరి సురేష్, శారదా వస్త్రాలయం
చెరగని ముద్ర
రాష్ట్రంలో మొదటిసారి గోదావరి పుష్కరాలు మంగపేటలో నిర్వహించ డం ఆనందంగా ఉంది. దీని ద్వారా రాష్ట్రంలో మంగపేటకు చెరగని ముద్ర పడినట్లయ్యింది.
- రావుల కృష్ణవేణి, శ్రావ్య జిరాక్స్
నా జన్మ ధన్యమైంది
పుష్కరాలకు వచ్చే భక్తులకు ఉచిత బస్సులను నడిపే అవకాశం కలిగినందుకు మా జన్మ ధన్యమైంది. వేలాది మందిని పుష్కరాలకు తరలించడంలో కలిగిని ఆనందం మరేదానిలో లేదు.
-గుడెల్లి రాములు, డ్రైవర్, హన్మకొండ