వారంతా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు.. నిత్యం కంప్యూటర్లతో తలమునకలవుతుంటారు.. అయితేనేం.. మోడల్స్‌కు మేమేం తీసిపోమంటూ.. అలవోకగా ర్యాంప్ వాక్ చేశారు.. అంతేకాదు.. ఆహూతులను ఆసాంతం అలరించారు.గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ ఈ వేడుకకు వేదికైంది.. ‘ఆంపిల్ లాజిక్’ సంస్థ 15వ వార్షికోత్సవంలో భాగంగా శుక్రవారం ఉత్సాహభరిత వాతావరణంలో సంస్థ ఉద్యోగులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.. క్రీడల, ఇతర పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు సంస్థ ప్రోత్సాహకాలను అందజేసి, సత్కరించింది. ఉద్యోగుల సహకారంతో సంస్థ దినదినాభివృద్ధి చెందుతుందని సీఈఒ మన్నె వెంకన్న చౌదిరి
పేర్కొన్నారు.
– లక్డీకాపూల్
ఆంపిల్ ర్యాంప్
Published Sat, Jul 20 2024 11:37 AM | Last Updated on Sat, Jul 20 2024 11:37 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment