రూ.వందల కోట్లు కృష్ణార్పణం | Hundreds of crores were going as gambling | Sakshi

Oct 4 2016 9:13 AM | Updated on Mar 21 2024 7:52 PM

ఒక్కొక్క ఊరికి రూ. 11 కోట్లు ఖర్చు పెట్టారంటే ఆ ఊరి రూపురేఖలే మారిపోవాలి. కానీ పుష్కరాల సందర్భంగా రూ.1472 కోట్లు ఖర్చుపెట్టినా కృష్ణాతీరం వెంట ఉన్న గ్రామాల్లో ఆ మేరకు పనుల ఆనవాళ్లు కనిపించడంలేదు. నామినేషన్లపై పనులు దక్కించుకున్న అధికార పార్టీ నేతలు అరకొర పనులతో కనికట్టు చేసేశారు. కొన్ని చోట్ల ఉన్న రోడ్లపైనే కంకరపోసి బిల్లులు చేయించుకున్నారు. మరికొన్నిచోట్ల రోడ్లు వేయకుండానే వేసినట్లు చూపించేశారు. మరికొందరు మరో అడుగు ముందుకేసి ప్రైవేటు రియల్ ఎస్టేట్ వెంచర్లకు రోడ్లు వేసేశారు. ఘాట్ల నిర్మాణంలో ఎలాంటి నిబంధనలూ పాటించకుండా కంకరపోసి టైల్స్ అతికించేశారు. పుష్కరాలు ముగిసి నెలరోజులైనా మరికొన్ని చోట్ల ఘాట్ల పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కోట్ల మంది ప్రజల భక్తి విశ్వాసాలే పెట్టుబడిగా వందల కోట్ల ప్రజాధనాన్ని పుష్కరాల పనుల పేరుతో తెలుగు తమ్ముళ్లు దోచేసుకున్నారు. పుష్కరాల పనులు జరిగిన ప్రాంతాల్లో ‘సాక్షి’ జరిపిన పరిశీలనలో ఈ విషయం సచిత్రంగా స్పష్టమైంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement