
యాడ్‌రోబ్ ద్వారా కృష్ణా పుష్కర జలం
కృష్ణా నదీ పుష్కరాల సందర్భంగా పవిత్ర కృష్ణా నదీ జలాలను కృష్ణా జల్ బ్రాండ్ పేరుతో నగరానికి చెందిన ఈ కామర్స్ కంపెనీ యాడ్‌రోడ్‌డాట్‌ఇన్ డోర్ డెలివరీ చేయనున్నది.
కృష్ణా నదీ పుష్కరాల సందర్భంగా పవిత్ర కృష్ణా నదీ జలాలను కృష్ణా జల్ బ్రాండ్ పేరుతో నగరానికి చెందిన ఈ కామర్స్ కంపెనీ యాడ్‌రోడ్‌డాట్‌ఇన్ డోర్ డెలివరీ చేయనున్నది. ఈ నెల 13 నుంచి 23 వరకూ హైదరాబాద్‌లో ఈ అవకాశాన్ని అందిస్తున్నామని యాడ్‌రోబ్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్ నగరంలో అయితే 1 లీటర్ రూ.101 మాత్రమేనని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని ఇతర నగరాలకు రూ.151 అని, భారత్‌లోని ఏ ఇతర నగరాలకైతే రూ.201 అని యాడ్‌రోబ్‌డాట్‌ఇన్ ఎండీ కేశిరెడ్డి రాజిరెడ్డి పేర్కొన్నారు. అంతేకాకుండా పుష్కరాల సందర్భంగా కృష్ణా నదికి హారతి, దీపం సమర్పించే పుష్కర దీపం ప్యాకేజీని కూడా ఆఫర్ చేస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాలకు యాడ్‌రోబ్‌డాట్‌ఇన్ వెబ్‌సైట్‌ను చూడాలని పేర్కొన్నారు.